కియారా అద్వానీ: ‘మొదట్లో నన్ను కలవడానికి కూడా భయపడ్డారు...ఇప్పుడు వాళ్లే ఆఫర్లిస్తున్నారు’

కియారా అద్వానీ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, నయిదీప్ రక్షిత్
    • హోదా, బీబీసీ కోసం

సినీ పరిశ్రమలో చాలా మంది తన పట్ల ప్రదర్శించే వైఖరి మారిందని కబీర్ సింగ్, షేర్ షా, మేజ్-2, ఇప్పుడు జుగ్ జుగ్ జివో లాంటి వరుస హిట్ సినిమాలను అందించిన కియారా అద్వానీ అంటున్నారు.

మొదట్లో తనను కలవడానికి సంకోచించిన వారే ఇప్పుడు తనకు ఆఫర్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఆమె బీబీసీ హిందీతో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.

కియారాను హేమమాలినితో పోల్చడం పట్ల ఏమంటున్నారు?

కొంత మంది కియారా అద్వానీని హేమమాలినితో పోల్చి డ్రీం గర్ల్ అనే ట్యాగ్ ను కూడా ఇస్తూ ఉంటారు. తనను హేమామాలినితో పోల్చడాన్ని అత్యంత గొప్ప ప్రశంసగా భావిస్తానని చెప్పారు.

"డ్రీం గర్ల్ లాంటి బిరుదును నాకివ్వడం చాలా పెద్ద విషయం. అది హేమమాలి సొంతం. మా మధ్య చాలా పోలికలు ఉంటాయని చాలామంది అంటుండగా విన్నాను. ఇలా విన్న ప్రతిసారి నాకు అంతరాంతరాల్లో నుంచి సంతోషంగా ఉంటుంది’’ అని కియారా చెప్పారు.

"స్టార్ డం తాత్కాలికం"

కియారా అద్వానీ కెరీర్ మొదలైనప్పటి నుంచి శరవేగంగా సినీ తారగా మారిన ప్రయాణాన్ని ఎలా చూస్తున్నారు? ఆమెపై స్టార్ డం ప్రభావం పడిందా?

"నేనెప్పుడూ మారలేదు" అని అంటూ తానిలా ఉండటానికి తన కుటుంబం కారణమని అన్నారు.

"నేను ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచీ వీరందరికీ నేను తెలుసని అనుకుంటున్నాను. ఒకరితో ఒకరం మనసులో విషయాలను పంచుకోగలిగే బంధం మా మధ్య ఏర్పడింది. నా కోసం అవతలి వాళ్లు మారకపోతే, నేను కూడా ఎప్పటికీ ఎవరి కోసం మారను. మీ జీవితంలో ఎగుడు దిగుళ్లు చూసి ఉంటే ఇవన్నీ చాలా తాత్కాలికం అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనుకోవడం వల్ల మీరు మీ పనిని కొనసాగించేందుకు కావల్సిన స్ఫూర్తి దొరుకుతుంది. మంచి పనిని చేస్తూ ఉండటమే మన పని".

కియారా అద్వానీ

ఫొటో సోర్స్, instagram/kiaraaliaadvani

‘నా పాత్రలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి’

తానునటించే సినిమాలను మనసుతో అలోచించి ఎంపిక చేసుకుంటానని కియారా చెప్పారు. షేర్ షా, భూల్ బులయ్య 2, జుగ్ జుగ్ జియో లాంటి సినిమాల్లో ఆమె నటించిన పాత్రలకు చాలా ఆదరణ లభించింది.

నా మనసుకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటించేందుకు అంగీకరిస్తాను. మనసుకు దగ్గరగా అనిపిస్తే ఆ సినిమా చేసేందుకు అంగీకరిస్తాను.

తాను నటించిన పాత్రలన్నిటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించిందని కియారా చెప్పారు.

"ధోనీ సినిమాలో నటించిన సాక్షి పాత్ర అయినా, డింపుల్, ప్రీతి, నయన లాంటి పాత్రలన్నిటికీ ఆదరణ లభించింది.

దేశమంతటికీ ఆ పాత్ర తమ ఇంట్లో అమ్మాయిని తలపిస్తుంది. నేను సినిమా ప్రచారం కోసం బయటకు వెళ్ళినప్పుడు, "మీరు మాకు ముందుగానే తెలుసనిపిస్తోందని అంటారు. ఇలాంటి మాటలు చాలా భరోసాను ఇస్తాయి" అని అన్నారు.

కబీర్ సింగ్ సినిమాలో నటించి మూడేళ్లు కావస్తోంది. కానీ, జుగ్ జుగ్ జియో సినిమా ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అభిమానులు ప్రీతి, ప్రీతి అని పిలవడం మొదలుపెట్టారు.

ఆ సినిమాలో కియారా నటించిన పాత్ర పేరు ప్రీతి సిక్కా.

కియారా అద్వానీ

ఫొటో సోర్స్, instagram/kiaraaliaadvani

‘ఆ పాఠాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటా’

సినిమాలో ప్రధాన పాత్ర పురుషుడైనప్పుడు ఆ సినిమాల్లో తన ఉనికిని చాటుకునేందుకు ఎలా చేస్తారని అడిగినప్పుడు, అలాంటి సందర్భాల్లో తన తాతగారి నుంచి నేర్చుకున్న పాఠాలను గుర్తు చేసుకుంటానని చెప్పారు.

"ధోనీ సినిమా తీస్తున్నప్పుడు ప్రధాన పాత్ర ఒక వ్యక్తి జీవిత చరిత్రకు సంబంధించిందని ఆలోచించాను. అది కూడా ఒక అబ్బాయిది.

అదే సమయంలో మా బంధువు సయీద్ జాఫ్రీ చనిపోయారు. అప్పుడు ఆయన గురించి చాలా చదివాను. అప్పుడే ఏ పాత్రా చిన్నది, పెద్దది కాదని అర్ధం చేసుకున్నాను. అది 2 నిమిషాల పాటు నటించేది అయినా కావచ్చు లేదా 10 నిమిషాలు కావచ్చు. ఆ పాత్ర గురించి చాలా అధ్యయనం చేస్తాం. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. ప్రజలు మాత్రం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు" అని చెప్పారు.

"ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని నేను ధోనీ సినిమాలో నటించాను. నా పాత్రకు చాలా ఆదరణ లభించింది. కానీ, ఏ సినిమాలో నటించినా కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని పని చేస్తాను. నేనే పాత్రలో నటించినా నా వైపు నుంచి నేను చేయగలిగినంత చేస్తాను".

కియారా అద్వానీ

ఫొటో సోర్స్, ANI

సినిమా ముగింపు సీన్లపై ఎందుకు దృష్టి పెడతారు?

జుగ్ జుగ్ జియో సినిమాలో కియారా, వరుణ్ ధవాన్ మధ్య చిత్రీకరించిన ఒక సన్నివేశాన్ని చాలా మంది ప్రశంసించారు.

ఈ సీన్ లో వీరిద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంటుంది. కానీ, ఆ సన్నివేశాన్ని చాలా బాగా రచించారని కియారా చెప్పారు.

ఆ సంభాషణలో పురుషులు, మహిళల దృక్కోణం కూడా తెలిసే విధంగా సంభాషణ ఉంటుంది.

ఇప్పటి వరకు నటించిన పాత్రల్లో తనకు బాగా నచ్చిన సీన్ అదేనని చెప్పారు.

"నేను నటించిన చాలా క్లైమాక్స్ సన్నివేశాలు నాకు మంచి పేరును తెచ్చాయి. నేనెప్పుడూ ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ, నేను చూసే ప్రతీ స్క్రిప్ట్ లో చివరి సన్నివేశం ఎలా ఉందో చూస్తాను" అని చెప్పారు.

కియారా అద్వానీ

ఫొటో సోర్స్, facebook/DharmaMovies

వరుణ్, కార్తీక్, సిద్దార్థ్, సుశాంత్, విక్కీ కౌశల్ గురించి మీ అభిప్రాయమేంటి?

కియారాతో నటించిన తోటి నటుల గురించి తన అభిప్రాయమేంటి అని అడిగినప్పుడు, వాళ్లంతా మంచి ఆర్టిస్టులని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన శైలి ఉందని చెప్పారు.

సుశాంత్ గురించి చెప్పాలంటే, ఏదైనా పాత్ర గురించి చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. ఒక సినిమాలో నటించడం కోసం ఆయన సిద్ధమైనట్లు ఎవరూ కారు. ఆయనలో ఈ లక్షణాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాను.

విక్కీ కౌశల్ డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. త్వరలో విడుదల కానున్న సినిమాలో ఆయనను చూస్తారు.

వరుణ్ ధావన్ మంచి టీమ్ ప్లేయర్ .కార్తీక్ ఆర్యన్‌కు మంచి హాస్య దృష్టి ఉంటుంది.

సిద్దార్థ్ చాలా నిజాయితీతో నటిస్తారు. ఆయన కళ్లల్లో అది కనిపిస్తూ ఉంటుంది....అన్నారు కియారా.

వీడియో క్యాప్షన్, అనుపమా పరమేశ్వరన్: ఆ వేధింపులు నాకూ తప్పలేదు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)