ఘనంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి.. ఎవరీ గౌతమ్ కిచ్లూ? : ప్రెస్ రివ్యూ

కాజల్ అగర్వాల్ మ్యారేజ్ ఫొటో

ఫొటో సోర్స్, instagram

సినీ నటి కాజల్ పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 1

గౌతమ్‌ కిచ్లూతో ఆమె వివాహం పూర్తయింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 2
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 2

చాలా కాలం నుంచి పెళ్లి అనే వార్తలను ఖండిస్తూ వచ్చిన కాజల్‌.. చివరికి తన ప్రేమని, ప్రియుడిని తెలియజేసింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 3
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 3

అప్పటి నుంచి నిత్యం కాజల్‌ వార్తలలో నిలుస్తూనే ఉంది. అక్టోబర్‌ 30 శుక్రవారం ఆమె ముంబయిలో తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూని పెళ్లాడింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 4
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 4

అయితే పెళ్లికి ముందు జరిగిన ఫంక్షన్లలో ఎంతో సంతోషంగా కనిపించిన కాజల్‌.. పెళ్లి కాసేపట్లో అని తెలిసి.. నిశ్శబ్దానికి లోనైనట్లుగా ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 5
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 5

ఇప్పుడు భర్త పక్కన మాత్రం చాలా కూల్‌గా, సంతోషంగా కాజల్‌ ఈ ఫొటోలో కనిపిస్తోందని ఆంధ్రజ్యోతి రాసింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 6
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 6

ఎవరీ గౌతమ్ కిచ్లూ?

హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న గౌతమ్ కిచ్లూ ఒక ఇంటీరియర్ డిజైనర్.

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో ఆయన ఇంటర్‌నెట్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇంటీరియర్స్, టెక్, డిజైన్ ఎంతూజియాస్ట్ అని రాసుకున్నారు.

డైసెర్న్ లివింగ్ అనే ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీని కూడా ఆయన స్థాపించారు.

పబ్ జీ

ఫొటో సోర్స్, PUBG

పబ్‌జీ కథ భారత్‌లో ముగిసిపోయినట్లే..

శుక్రవారం నుంచి భారత్‌లో పబ్‌జీ గేమ్ ఆడలేరని ఆ కంపెనీ ప్రకటించిందని ఈనాడు కథనం ప్రచురించింది.

ఆన్‌లైన్‌ వార్‌గేమ్‌ పబ్‌జీ కథ భారత్‌లో ముగిసిపోయినట్లే.

ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం నుంచి భారత్‌లో తమ సేవలను రద్దు చేసుకుంటున్నట్లు సంబంధిత సంస్థ టెన్సెంట్‌ గేమ్స్‌ ప్రకటించిందని ఈనాడు రాసింది.

దేశ భద్రత దృష్ట్యా పబ్‌జీ మొబైల్‌ వెర్షన్లను భారత ప్రభుత్వం రెండు నెలల కిందట నిషేధించింది.

అయితే, అంతకుముందు యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వినియోగదారులకు మాత్రం ఈ గేమ్‌ని ఆస్వాదించే వెసులుబాటు ఉండేది.

తాజా నిర్ణయంతో ఈ గేమ్‌కి పూర్తిగా తెరపడింది.

‘‘వినియోగదారుల సమాచార భద్రతే అత్యంత ముఖ్యం. భారత డేటా భద్రత చట్టాలను, నిబంధనలను మేం పాటించాం. ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అక్టోబరు 30నుంచి పబ్‌జీ మొబైల్‌ నొర్డిక్‌ మ్యాప్‌- లివిక్‌, పబ్‌జీ లైట్‌ సేవలను టెన్సెంట్‌ నిలిపివేస్తోంది’’ అని పబ్‌జీ మొబైల్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసినట్లు ఈనాడు చెప్పింది.

పబ్‌జీతో పాటు 118 మొబైల్‌ యాప్‌లపై ఈ ఏడాది సెప్టెంబరు 2న భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

ఏపీ స్కూళ్లు
ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

ఏపీలో పాఠశాలలు తెరిచేందుకు మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ప్రారంభించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.

కోవిడ్‌–19 నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

  • ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు.
  • ఒక్కో విద్యార్థికి మధ్య దూరం 6 అడుగులు ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.
  • రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
  • నవంబర్‌ నెలంతా హాఫ్‌ డే స్కూళ్లే ఉంటాయి.
  • నవంబర్‌ నెలంతా స్కూళ్లు హాఫ్‌డే మాత్రమే (ఉదయం 9 నుంచి 1.30 వరకు) ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.
  • విద్యార్థులు రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు.
  • ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు తరగతులు పెట్టాలి
  • నవంబర్‌ 23 నుంచి 6, 8 తరగతులకు ఒకరోజు, 7, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాలి.
  • డిసెంబర్‌ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలి.
  • టెన్త్‌ విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు నిర్వహించాలి.
  • ఏ స్కూలులో అయినా 750 మందికి మించి విద్యార్థులున్నట్లయితే వారిని మూడు బ్యాచులుగా చేసి మూడేసి రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి.
  • టీచర్లు రోజూ స్కూళ్లకు హాజరవ్వాలి. ఉదయం తరగతుల బోధన, మధ్యాహ్నం ఆన్‌లైన్‌ బోధనలో పాల్గొనాలి.
  • హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లను అక్కడి వసతిని బట్టి నిర్ణీత నిబంధనలను పాటిస్తూ 9–12 తరగతుల పిల్లలతో నవంబర్‌ 2వ తేదీనుంచి ప్రారంభించవచ్చు.
  • నిబంధనలకు అనువుగా తగినంత వసతి లేని పక్షంలో నవంబర్‌ 23 నుంచి ప్రారంభించాలి.
  • అప్పటివరకు ఆ విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లలోని తరగతులకు హాజరవ్వడం లేదా ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ఆయా పాఠ్యాంశాలు నేర్చుకొనేలా చూడాలి.
  • 3 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించి నిబంధనలు తరువాత విడుదల చేస్తారు. అప్పటివరకు ఈ విద్యార్థులు సమీపంలోని స్కూళ్లలోని తరగతులకు హాజరై అక్కడ మధ్యాహ్న భోజనం తీసుకోవచ్చు
హైదరాబాద్ మెట్రో

ఫొటో సోర్స్, TWITTER/HYDERABAD METRO RAIL

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ ఆఫర్లు

హైదరాబాద్‌‌లో మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు కొత్త ఆఫర్లు ప్రకటించారని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

కొవిడ్‌ -19 విజృంభణతో బస్‌పాస్‌ హోల్డర్లు నష్టపోయిన రోజులను తిరిగి వినియోగించుకునే అవకాశాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ టీఎస్‌ ఆర్టీసీ కల్పించింది.

లాక్‌ డౌన్‌ సమయంలో బస్సు పాస్‌ను వినియోగించుకోలేకపోయిన జనరల్‌ బస్‌ పాస్‌ వినియోగదారులు తమ పాత బస్‌పాస్‌(ఐడీ కార్డు, టిక్‌ట్‌)ను ఆయా కౌంటర్‌లో అందజేస్తే కొత్తవి ఇస్తామని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు తెలిపారు.

నవంబర్‌ 30 వరకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన చెప్పారని పత్రిక తెలిపింది.

ఆది వారం నుంచి మెట్రో బంపర్‌ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.

దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగుల దృష్ట్యా ప్రయాణికుల కోసం మెట్రో ఇటీవల నాలుగు సరికొత్త ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

అందులో రెండు ఆఫర్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా మరో రెండు ఆఫర్లు స్టోర్‌ వాల్యూ కార్డ్‌ రీచార్జ్‌ ఆఫర్‌, టీ-సవారీ ట్రిప్‌ ఆఫర్‌లు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

స్టోర్‌ వాల్యూ కార్డ్‌ ఆఫర్‌లో రూ.400 నుంచి రూ.800 వరకు ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ కార్డ్‌ రీచార్జ్‌ చేయిస్తే అందులో 50 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ 75 రోజుల వరకు అందుబాటులో ఉంటుందని పత్రికలో రాశారు.

ఇక టీ-సవారీ యాప్‌లో ఎన్ని ట్రిప్పులకైతే డబ్బులు చెల్లిస్తామో అదనంగా మరికొన్ని ట్రిప్పులు పొందే అవకాశం ఉంటుంది. 14 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 20 ట్రిప్పులు పొందొచ్చు.

30 ట్రిప్పులు చార్జీ చెల్లిస్తే అదనంగా 15 ట్రిప్పులు యాడ్‌ వుతాయి. కాగా ఇప్పటికే అందుబాటులో ఉన్న మెట్రో సువర్ణ ఆఫర్‌, స్మార్ట్‌ కార్డు ట్రిప్‌ ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని మెట్రో అధికారులు చెప్పినట్లు పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)