బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ విచారణకు హాజరైన హీరోయిన్లు దీపిక పడుకోన్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ - BBC Newsreel

ఫొటో సోర్స్, Getty Images
బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకోన్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ శనివారం ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వినియోగం వ్యవహారంలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీరికి సమన్లు జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ ముగ్గురు హీరోయిన్లు వేరువేరుగా జోనల్ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిని విచారించి, వీరి స్టేట్‌మెంట్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఫొటో సోర్స్, AMIR KHAN
కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే నటి రియా చక్రవర్తి సోదరుడు సహా పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది.

ఫొటో సోర్స్, BCCI/IPL
IPL 2020: సత్తా చూపని ధోనీ బ్యాట్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి
దుబయ్‌లో జరిగిన ఐపీఎల్ ఏడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను దిల్లీ క్యాపిటల్స్ జట్టు 44 పరుగుల తేడాతో ఓడించింది. దిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన 176 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఐదవ ఓవర్లో 23 పరుగుల స్కోరు వద్ద చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తొలి దెబ్బ తగిలింది. షేన్ వాట్సన్ 16 బంతుల్లో 14 పరుగులు చేయగలిగాడు. మురళీ విజయ్ కూడా ఎక్కువ సేపు పిచ్‌లో నిలబడలేదు. ఆరో ఓవర్‌లో అవుటయ్యాడు.
ఫాఫ్ డుప్లెసిస్, కొత్త బ్యాట్స్‌మన్ రితురాజ్ గైక్వాడ్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ 10వ ఓవర్లో రితురాజ్ 5 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద రనౌటయ్యాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
డుప్లెసిస్‌కు కేదార్ జాదవ్ తోడైనా అతను కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేక పోయాడు. 21 బంతుల్లో 26 పరుగులు చేసిన జాదవ్ ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగిగాడు.
16 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన జట్టు 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఆరో నంబర్‌లో ధోనీ బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికే 33 బంతుల్లో 41 పరుగులు చేసిన డుప్లెసిస్ అర్ధ సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ 18వ ఓవర్లో లైఫ్ పొందినా, మరుసటి బంతికి రిషబ్‌పంత్‌కు క్యాచ్ ఇచ్చి 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లకు 113 పరుగులు చేసింది.
రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు. 11 బంతుల్లో 54 పరుగులు అవసరమయ్యాయి. కానీ క్రీజులో ఉన్న ఇద్దరూ ఒత్తిడికి లోనయ్యారు. 19వ ఓవర్లో, ఇద్దరూ భారీ షాట్లకు ప్రయత్నించినా పరుగులు రాలేదు. చివరి ఓవర్ మూడో బంతికి ధోని వికెట్ కీపర్ చేతికి దొరికిపోయాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
ఇక చివరి బంతి కూడా దిల్లీ క్యాపిటల్స్‌కు అనుకూలంగా సాగింది. రబాడా విసిరిన బంతిని మిశ్రాకు క్యాచ్ ఇచ్చి జడేజా పెవిలియన్ బాటపడ్టాడు. దీంతో దిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అంతకు ముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది. పృథ్వీషా, శిఖర్ ధావన్ వేగంగా ఆడారు.
పృథ్వీషా అర్ధ సెంచరీ దాటిపోగా, శిఖర్ ధావన్ 35 పరుగులకు అవుటయ్యాడు. 94 పరుగులకు తొలి వికెట్ పడిన తరువాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ దిల్లీ క్యాపిటల్స్ స్కోరు వేగాన్ని మరింత పెంచాడు. కాసేపటికి 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పృథ్వీషా ఔటయ్యాడు.
పృథ్వీషా నిష్క్రమణ తరువాత రిషబ్ పంత్‌కు అండగా శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ జట్టు స్కోరును పెంచారు. కానీ 19వ ఓవర్లో సామ్ కరన్ విసిరిన బంతిని కొట్టబోయిన శ్రేయస్ ధోనికి క్యాచ్ ఇచ్చాడు.
161 పరుగుల వద్ద 3వ వికెట్‌ను కోల్పోయిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరకు 175 పరుగులు చేయగలిగింది. 25 బంతుల్లో 37 పరుగులు చేసిన రిషబ్‌పంత్ నాటౌట్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (1946-2020): నాలుగు దశాబ్దాల్ని అలరించిన సుమధుర గాత్రం
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








