సచిన్ తెందూల్కర్ మొదటి కారు మారుతి-800 ఎక్కడ... ఎవరైనా చెప్పగలరా?

ఫొటో సోర్స్, AFP
సచిన్ టెండూల్కర్ తన అభిమానులను ఓ కోరిక కోరాడు. తన మొదటి కారు ఇప్పుడు ఎక్కడుందో కనుక్కోవడంలో సాయపడాలని ఆయన వారిని అభ్యర్థించారు.
సచిన్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన మొదటిసారిగా కొనుక్కున్న కారు మారుతి 800. మారుతి కారు అంటే 1990లలో చాలా క్రేజ్ ఉండేది.
ఆ కారును ఎక్కడైనా ఎవరైనా చూస్తే ఆ వివరాలు తనకు తెలియజేయాలని సచిన్ తన అభిమానులను కోరారు. అయితే, ఆ కారు గురించి ఆయన మరిన్ని వివరాలేమీ తెలపలేదు.
సచిన్ క్రికెట్ నుంచి 2013లో రిటైర్ అయినప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలో క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్.
అంతర్జాతీయ క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించిన వెంటనే ఆ మొదటి కారు కొనుక్కున్నానని ఒక వెబ్ సంభాషణ కార్యక్రమంలో సచిన్ చెప్పారు.
అప్పట్లో మారుతి 800 కొనుక్కోవడం ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఒక కల సాకారం కావడం. అంతేకాదు, అప్పట్లో ఆ కారును హోదాకు చిహ్నంగా భావించేవారు.
2014లో ఈ మోడల్ కార్ల ఉత్పత్తిని ఆపివేస్తున్నామని మారుతి సంస్థ ప్రకటించినప్పుడు ఎంతోమంది తమ కుటుంబ భాగస్వామిని కోల్పోయినంత బాధపడ్డారు. మారుతి 800 ఒక వాహనం మాత్రమే కాదు. అది వారి జీవితాల్లో ఒక భాగం.
అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న కొద్దీ కొత్త కొత్త కార్లు కొనుకున్నానని, అప్పుడు ఆ మారుతి 800 ను అమ్మేశానని సచిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
కార్లంటే తనకు అంత మక్కువ ఎలా ఏర్పడిందో వివరిస్తూ ఆయన, మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఓపెన్ సినిమా హాల్ ఉండేది. మన కారుతో పాటు లోపలికి వెళ్లి, దాన్ని అక్కడే నిలిపి, కార్లో కూర్చునే సినిమా చూడొచ్చు. నేను, నా సోదరుడు మా బాల్కనీలో నిల్చుని గంటలతరబడి అక్కడికి వచ్చే కార్లను చూస్తుండేవాళ్లం" అని సచిన్ చెప్పారు.
198 టెస్టు మ్యాచుల్లో 15,837 పరుగులతో, 463 వన్డేల్లో 18,426 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డ్ సృష్టించారు.
1989 లో 16 యేళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 2012 లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.
రెండుసార్లు ఇండియా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
తెండూల్కర్ పరుగుల వివరాలు
టెస్ట్ మ్యాచ్‌లు (198)
53.86 సగటు స్కోరుతో 15,837 పరుగులు చేసారు. 51 శతకాలు, 67 అర్థ శతకాలు సాధించారు. 2004 లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచులో 248 పరుగుల అత్యధిక స్కోరు సాధించారు.
వన్-డే అంతర్జాతీయ మ్యాచ్‌లు (463)
44.83 సగటు స్కోరుతో, 86.23 స్ట్రైక్ రేటుతో 18,426 పరుగులు చేసారు. 49 శతకాలు (అత్యధిక స్కోరు 200), 96 అర్థ శతకాలు సాధించారు.
2006 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో ఒకే ఒక్క అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్ ఆడారు. అందులో 15 బంతుల్లో 12 పరుగులు చేశారు.
ఇవి కూడా చదవండి
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- తండ్రి అమ్మేశాడు... ముగ్గురితో పెళ్లి... ముగ్గురు పిల్లలు... 16 మంది అత్యాచార నిందితులు
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
- పోర్న్‌హబ్‌లో ఎన్నికల ప్రచారం.. ఓట్లేయాలని అభ్యర్థన
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- గిరిజన గ్రామాల్లో తాగునీటి కొరత.. చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల నడక
- దేశ ఎన్నికల్లో అదానీ ‘బొగ్గు’ కుంపటి.. భారత్‌లో కాదు, ఆస్ట్రేలియాలో..
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- భారత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్లో ఉత్కంఠ ఎందుకు
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








