వాట్సాప్: అప్‌డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
"వాట్సాప్ అప్లికేషన్‌పై దాడి" అని పతాక శీర్షికల్లో రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కలవరపెట్టే విషయం. ఎందుకంటే, ఈ యాప్‌ను 150 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
వాట్సాప్‌లో ఉన్న ఒక లోపాన్ని ఆసరాగా చేసుకుని వినియోగదారుల ఫోన్ల మీద హ్యాకర్లు దాడి చేశారని ఆ సంస్థ తెలిపింది. ఫోన్లలో వాట్సాప్ ద్వారా నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయగలిగారని వెల్లడించింది.
’’కొద్ది మంది వినియోగదారులను’’ లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక సైబర్ నిపుణుడు ఈ దాడికి పాల్పడ్డారని వాట్సాప్ చెబుతోంది. ఎంతమంది ఫోన్లపై దాడి జరిగిందన్న సంఖ్యను పక్కనపెడితే... ఇలాంటి హ్యాకింగ్‌ల బారిన పడకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవడం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
అప్‌డేట్
హ్యాకర్లు దాడి చేసేందుకు వీలు కల్పించిన తన యాప్‌లోని లోపాన్ని సవరించినట్లు వాట్సాప్ తెలిపింది. అందరూ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని 150 కోట్ల మంది వినియోగదారులకు ఆ సంస్థ సోమవారం సూచించింది.
మరి మీరు అప్‌డేట్ చేశారా? ఇంకా చేయకపోతే తొందరగా చేసేయండి. తరచూ చేస్తూ ఉండండి.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాకప్
సమాచారాన్ని సురక్షితంగా ఉంచేందుకు 'ఎండ్- టు - ఎండ్ ఎన్‌క్రిప్షన్' సాంకేతికతను వినియోగిస్తున్నామని వాట్సాప్ తరచూ చెబుతుంటుంది.
అయితే, ఆ భద్రత వాట్సాప్‌లోని సమాచారానికి మాత్రమే ఉంటుంది. కానీ, చాలామంది తమ చాటింగ్ డేటాను బ్యాకప్ తీసి గూగుల్ డ్రైవ్ లేదా యాపిల్ ఐక్లౌడ్‌లో స్టోర్ చేస్తారు. బ్యాకప్‌కు వాట్సాప్‌లోని ఎండ్- టు- ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత వర్తించదు.
అంటే, మీ బ్యాకప్ స్టోరేజీలోకి లాగిన్ అయ్యి ఎవరైనా మీ వ్యక్తిగత చాటింగ్ చరిత్రను చూసే వీలుంటుంది.
కాబట్టి, మీ వాట్సాప్ చాటింగ్ డేటా భద్రంగా, గోప్యంగా ఉండాలంటే బ్యాకప్ తీయడం ఆపేయండి. అందుకోసం వాట్సాప్‌లో సెట్టింగ్స్ మార్చుకోవాలి.

ఫొటో సోర్స్, Anjaiah Thaviti
రెండంచెల భద్రత
మీరు వాడే యాప్‌లో టూ- ఫ్యాక్టర్- అథెంటికేషన్ (2FA) ఫీచర్ ఉంటే దానిని ఎంచుకోవడం మీ డేటాను భద్రంగా ఉంచుకునేందుకు ఉత్తమ మార్గం. ఈ ఫీచర్ వాట్సాప్‌లో కూడా ఉంది.
వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'అకౌంట్'ను క్లిక్ చేస్తే ఈ ఫీచర్ కనిపిస్తుంది.
ఇది భద్రతను రెట్టింపు చేస్తుంది. మీ ఖాతాలోకి ఎవరూ అక్రమంగా చొరబడకుండా అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఈ ఫీచర్‌ను ఎంచుకున్నాక మీరు మీ సోషల్ మీడియా ఖాతాలోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసిన తర్వాత మీ వేలిముద్ర లేదా వాయిస్ కమాండ్ లేదా మొబైల్ ఓటీపీ ద్వారా నిర్ధరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీరు చదువుకున్న పాఠశాల పేరు, మీ తల్లి పేరు, మీరు పెంచుకునే జంతువు, మీరు కొన్న తొలి బైకు పేరు... లాంటి అదనపు వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
గోప్యత
వాట్సాప్‌తో పాటు అనేక యాప్‌లలో భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కొన్ని ఫీచర్లు ఉన్నాయి.
వాట్సాప్‌లో Settings > Account > Privacy చూడండి. ఇందులో మీరు చివరిగా ఎప్పుడు వాట్సాప్ వాడారు అన్నది "last seen", మీ ప్రొఫైల్ పిక్, లైవ్ లొకేషన్‌ను ఎవరెవరు చూడొచ్చో ఎంచుకోవచ్చు.
అలాగే, మీకు వచ్చిన సందేశాన్ని చదివారా? లేదా అన్నది ఆ సందేశం పంపిన వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటే 'నీలి రంగు టిక్' మార్కును ఆఫ్ చేయొచ్చు.
ఫలానా వ్యక్తి నుంచి తనకు వాట్సాప్‌లో సందేశాలు, కాల్స్ రాకూడదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వాట్సాప్ నంబర్‌ను బ్లాక్ చేసేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- 'పదో తరగతిలో 60 శాతం మార్కులు... మా బాబు బంగారం'
- బ్రూనై: ఈ ఇస్లాం దేశంలో రాజు మాటే శాసనం
- చైనా మూన్ మిషన్- చంద్రుని ‘అంధకార ప్రాంతం’పై విజయవంతంగా దిగిన అంతరిక్ష వాహనం - BBC News తెలుగు
- బ్రెస్ట్ కేన్సర్ వైద్యురాలికే... బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది
- ఈమె ఎవరో తెలుసా? షోలే 'బసంతి'కి డూప్.. బాలీవుడ్ తొలి స్టంట్ ఉమన్
- వారణాసిలో ముస్లింల ఇళ్లు కూల్చేస్తే.. హిందూ ఆలయాలు బయటపడ్డాయా
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- భారతదేశమే భూగోళం మీద అత్యంత వేడి ప్రాంతమా...
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








