ముస్లింల ఇళ్లు కూల్చేస్తే.. హిందూ ఆలయాలు బయటపడ్డాయా? - Fact Check

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
పురాతన భవనాలను కూల్చేసినట్లు చూపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం వారణాసిలో 80 ముస్లింల ఇళ్లను కూల్చేశారని పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
"కాశీ విశ్వనాథ్ ఆలయం నుంచి గంగానది వరకు రహదారిని విస్తరించేందుకు ఆ మార్గంలో అడ్డుగా వస్తున్న ముస్లింలకు చెందిన 80 ఇళ్ల కొనుగోలును మోదీ ప్రారంభించారు. ఆ ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించగానే 45 పురాతన ఆలయాలు బయటపడ్డాయి" అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఈ వైరల్ వీడియోను ఫేస్‌బుక్, ట్విటర్‌లో వేలమంది షేర్ చేశారు.
ఈ వీడియోను పరిశీలించి దాని ప్రామాణికతను తెలియజేయాలంటూ మా పాఠకుడు ఒకరు మాకు పంపించారు.
ఈ వీడియోకు పెడుతున్న క్యాప్షన్లు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మా పరిశీలనలో తేలింది.
మోదీ "కలల ప్రాజెక్టు"గా భావించే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రధాన లక్ష్యం... గంగానది నుంచి 18వ శతాబ్దం నాటి శైవ క్షేత్రమైన కాశీ విశ్వనాథ్ ఆలయానికి భక్తుల రాకపోకలను సులభతరం చేయడం. ఈ ప్రాజెక్టు పనుల కోసం 2019 మార్చి 8న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
వాస్తవం ఏంటి?
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ కాశీ విశ్వనాథ్ స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
ఈ వీడియోకు సంబంధించిన వాదనల్లో వాస్తవమేంటో తెలుసుకునేందుకు ఆ బోర్డు సీఈవో విశాల్ సింగ్‌తో మేం మాట్లాడాం.
"ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 204 ఇళ్లు కొనుగోలు చేశాం. ఆ ఇళ్లన్నీ హిందువులకు చెందినవే. అందులో ఇప్పటి వరకు 183 ఇళ్లను కూల్చివేయగా, చిన్నవి పెద్దవి కలిపి 23 ఆలయాలు బయటపడ్డాయి" అని ఆయన బీబీసీకి చెప్పారు.
ఒక ఆలయం సమీపంలో మసీదు ఉంది. కానీ, ఆలయ సుందరీకరణ, రోడ్డు విస్తరణ కోసం అక్కడ ఒక్క ముస్లిం ఇల్లు కూడా కూల్చలేదు.

అసలు అక్కడేం జరుగుతోంది?
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు, దుకాణాలను తొలగించి రోడ్డును విస్తరించడంతో పాటు, గంగా నది వెంట ఘాట్లను పునరుద్ధరిస్తారు. యాత్రికుల కోసం మూత్రశాలలు, మ్యూజియం, ఆడిటోరియం నిర్మిస్తారు.
రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న ప్రదేశానికి బీబీసీ ప్రతినిధి సమీరాత్మాజ్ మిశ్రా స్వయంగా వెళ్లి పరిశీలించారు.
"ఆ ప్రాంతమంతా హిందువుల నివాసాలే ఉన్నాయి. అక్కడ ఒక్క ముస్లిం ఇల్లు కూడా కూల్చలేదు" అని ఆయన చెప్పారు.
ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న హిందువులు కూడా ఈ పనుల పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు. "వారణాసిలోని ఇరుకైన వీధులను చూసేందుకు యాత్రికులు ఇక్కడికి వస్తారు. అంతేకానీ, ఇక్కడ భారీ మాల్స్, పార్కులను చూసేందుకు కాదు" అని ఒక స్థానిక వ్యక్తి అన్నారు.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి
- రోహిత్ శర్మ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
- కిమ్-పుతిన్: తొలిసారిగా భేటీ కానున్న ఉత్తర కొరియా, రష్యా నాయకులు
- శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








