రోహిత్ శర్మ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఒకప్పుడు సునీల్ గవాస్కర్.. ఆయన తర్వాత సచిన్ తెందూల్కర్.. విరాట్ కోహ్లీ.. అలాగే టీమిండియాకు దొరికిన మరో స్టార్ రోహిత్.
గవాస్కర్ కాలంలో గుండప్ప విశ్వనాథ్ ఫ్లిక్ షాట్‌లకు పెట్టింది పేరు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వన్డేల్లో రోహిత్ కూడా లాంగ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్నాడు.
అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 2014 నవంబర్ 13వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డు నమోదు చేశాడు.
అంతకు ముందు 2013 నవంబర్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 209 పరుగులు చేశాడు.
తర్వాత 2017 డిసెంబర్ 13వ తేదీన శ్రీలంకతో మోహాలీలో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వన్డేల్లో టాప్ 10 అత్యధిక వ్యక్తిగత స్కోర్లు.. సాధించిన బ్యాట్స్‌మెన్

ఫొటో సోర్స్, Getty Images
రోహిత్ కాకుండా వన్డేల్లో ద్విశతకాలు సాధించిన భారత ఆటగాళ్లు సచిన్ తెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్.
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదైంది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరిటే. 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ సరిగ్గా 200 పరుగులు చేశాడు.
ఆ తర్వాత 2011లో వెస్టిండీస్‌తో జరిగిన పోరులో వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగుల చేసి ఔరా! అనిపించాడు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP/Getty Images
'నాకంత పవర్ లేదు'
ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఎలా ఆడగలుగుతున్నారు? ఈ క్రికెటర్ల ఆట వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అన్నది చాలా మంది మెదళ్లను తొలిచే ప్రశ్న.
మొహాలీ వేదికగా మూడో ద్విశతకం సాధించిన సందర్భంగా రోహిత్ ఇలా సమాధానం చెప్పాడు.
"ప్రారంభంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అందువల్ల నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకోవాలనుకున్నా. నేను ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వాడినేమీ కాదు. నాకు అంత పవర్ లేదు."

ఫొటో సోర్స్, Getty Images
"ఫీల్డ్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం అనుసరించేందుకు కొంచెం బుర్ర ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆట కోసం నా శక్తి మేరకు ప్రయత్నిస్తుంటాను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 140 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు శతకాలు, ఒక అర్ధ శతకం సాధించాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల రోహిత్ మాట్లాడుతూ.. ఫోర్లు, సిక్సులు అలా బాదడం సులువైన పనేమీ కాదని అన్నాడు.
"సిక్సులు కొట్టడం అంత సులువేమీ కాదు. ఎంతో ప్రాక్టీస్, హార్డ్ వర్క్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. క్రికెట్‌లో ఏదీ సులువు కాదు. టీవీలో చూస్తుంటే అది సులువుగానే కనిపించొచ్చు!"

ఫొటో సోర్స్, AFP
వంద దాటితే ఆగడు!
రోహిత్ తన పన్నెండేళ్ల కెరీర్‌లో 24 శతకాలు సాధించాడు. అందులో మూడింటిని 200 మార్కును దాటించాడు.
ఇటీవల డబుల్ సెంచరీలే కాకుండా, గతంలో 171, 152, 150, 147, 140.. పరుగులు కూడా చేశాడు. దీన్ని బట్టి చూస్తే 100 పరుగుల మార్కును చేరుకున్న తర్వాత, రోహిత్ అంత సులువుగా క్రీజు నుంచి బయటకొచ్చే రకం కాదని అర్థం చేసుకోవచ్చు.
పరుగుల వేగంలో సచిన్, కోహ్లీ, ధోనీల బాటలోనే రోహిత్ వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు.
ఏ బంతిని షాట్ కొట్టాలి? ఏ వైపున బౌండరీ దాటించాలి? అని ఆలోచించడంలో రోహిత్ దిట్ట. అసాధ్యమనుకునే షాట్‌తోనూ సులువుగా సిక్స్‌లు ఖాతాలో వేసుకుంటాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మా ఇతర కథనాలు:
- అనుష్క, విరాట్ల పెళ్లి జరిగింది ఇటలీలోని ఈ గ్రామంలోనే!
- IPL 2019: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విజయంతో ప్రపంచకప్‌కు బయల్దేరిన వార్నర్
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- విరాట్ కోహ్లీ: ప్రపంచ నం. 1 టెస్ట్ బ్యాట్స్‌మన్
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- విరాట్ కోహ్లీకి ధోనీ ఎంత అవసరం?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- ‘బంగాళాదుంపలు’ పండించారని భారతీయ రైతులపై కోట్ల రూపాయల దావా వేసిన ‘లేస్’
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- ‘రామసేతు’పై మళ్లీ వివాదం!
- సిస్టమ్‌లో బ్లూ స్క్రీన్ వచ్చిందా! మరేం భయం లేదు!
- తెలుగులో వాడుక భాషకు పట్టం గట్టిందెవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










