అనుష్క, విరాట్‌లు ఓ ఇంటివారయ్యింది ఇటలీలోని ఈ గ్రామంలోనే!

ఫొటో సోర్స్, Borgo Finocchieto
భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు భారత్‌కు వేలాది కిలోమీటర్ల దూరంలో ఇటలీలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్నారు.
సోమవారం నాడు ఇద్దరూ తమ పెళ్లి ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేయడం ద్వారా తమ వివాహం విషయంలో జోరుగా సాగుతున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
విరాట్, అనుష్కల పెళ్లి రిసెప్షన్ దిల్లీ, ముంబయి నగరాల్లో జరుగనుంది. డిసెంబర్ 21న దిల్లీలో, 26న ముంబయిలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ రెండు చోట్లా క్రికెట్, బాలీవుడ్ సహా వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులంతా హాజరవుతారని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Anushka Sharma Twitter
తమ పెళ్లి ఎక్కడ జరుగనుందనే విషయంలో విరాట్-అనుష్కల జోడీ చివరి నిమిషం దాకా సస్పెన్స్‌ను కొనసాగించింది. ఇటలీలోని మహానగరాలైన రోమ్ లేదా మిలాన్‌లో కాకుండా బోర్గో ఫినోషిటో రిసార్ట్‌లో వీరి వివాహం జరిగిందనే విషయం ఆఖరు క్షణంలోనే వెల్లడైంది.
ఇంతకూ ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏమిటి? ఎందుకు వీరిద్దరూ దీనినే తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2017లో కుటుంబ సమేతంగా సెలవుల్ని గడిపింది ఈ రిసార్ట్‌లోనే. టస్కనీ అనే పట్టణంలో బోర్గో ఫినోషిటో రిసార్ట్ ఉంటుంది.
వివాహ వేడుకలకు ప్రసిద్ధి గాంచిన ఈ రిసార్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్స్‌లో ఒకటి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
800 ఏళ్ల చరిత్ర గల గ్రామం
ఈ రిసార్ట్ మిలాన్ పట్టణానికి దాదాపు 4-5 గంటల దూరంలో ఉంటుంది. 800 ఏళ్ల క్రితం నాటి ఓ శిథిల గ్రామాన్ని మళ్లీ బాగు చేయడం ద్వారా దీనిని నిర్మించారు. అలా ఈ గ్రామానికి ఒక కొత్త లుక్ తీసుకొచ్చారు.
ఈ రిసార్ట్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటికీ ఒక గ్రామంలాగే కనిపించే ఈ రిసార్ట్‌ను 'బోర్గో ఫినోషిటో' అని పిలుస్తారు. అంటే 'చిట్టడవి లేదా తోటల గ్రామం' అని అర్థం.

ఫొటో సోర్స్, Tushar Ugale
వైన్‌కు ప్రసిద్ధి గాంచిన మోంటాల్కినోకు సమీపంలో ఉన్నందున ఈ రిసార్ట్‌కు చుట్టుపక్కల్లో చాలా ద్రాక్ష తోటలున్నాయి. ఇటలీలో అమెరికా మాజీ రాయబారి జాన్ ఫిలిప్స్ 2001లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆయనే దీన్నో అందమైన రిసార్ట్‌గా అభివృద్ధి చేశారు.
ఈ రిసార్ట్‌లో ఐదు విల్లాలతో పాటు కేవలం 22 గదులున్నాయి. బహుశా అందుకేనేమో.. అనుష్క-విరాట్‌ల వివాహానికి హాజరైన వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంది.
రుచికరమైన ఆహారంతో పాటు మంచి వైన్‌కు పేరు గాంచిన ఈ రిసార్ట్‌లో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలున్నాయి.
వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన వ్యక్తులెందరో ఈ రిసార్ట్‌లో గడిపారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








