విరాట్ కోహ్లీ: ‘అవును.. అనుష్కతో నా పెళ్లయ్యింది’

ఫొటో సోర్స్, AnushkaSharma/Twitter
బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నట్లు క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రకటించారు.
గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోమవారం ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘జీవితాంతం ప్రేమకు కట్టుబడి ఉండాలని మేమిద్దరం ఈ రోజు వాగ్దానం చేశాం. ఈ వార్తను మీతో పంచుకోవటం ఆనందంగా ఉంది. ‘మా అభిమానులు, శ్రేయోభిలాషుల కుటుంబం’ మద్దతు, ప్రేమతో ఈ అందమైన రోజు మరింత ప్రత్యేకం అయ్యింది. మా ప్రయాణంలో భాగం అయినందుకు కృతజ్ఞతలు’ అని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమతమ ట్విటర్ అకౌంట్ల ద్వారా తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సోషల్ మీడియాలో వీడియోలు
కాగా, విరాట్ కోహ్లీ, అనుష్కల పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5
అనుష్క శర్మ
- అనుష్క శర్మ 1988 మే 1వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించారు. తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ ఆర్మీ అధికారి. తల్లి ఆషిమా శర్మ.
- అనుష్క బెంగళూరులో పెరిగారు. తర్వాత మోడల్‌గా మారి ముంబయికి వెళ్లి స్థిరపడ్డారు.
- షారూఖ్ ఖాన్ హీరోగా 2008లో విడుదలైన ‘రబ్ నే బనా ది జోడీ’ చిత్రంలో బాలీవుడ్‌లో ప్రవేశించారు.
- 2015లో విడుదలైన ‘ఎన్‌హెచ్ 10’ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు.

ఫొటో సోర్స్, imVkohli/Twitter
విరాట్ కోహ్లీ
- విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5వ తేదీన ఢిల్లీలో జన్మించారు. తండ్రి ప్రేమ్ కోహ్లీ న్యాయవాది. తల్లి సరోజ్ కోహ్లీ.
- మూడేళ్ల వయసున్నప్పటి నుంచే విరాట్‌కు బ్యాటింగ్ చేయటం ఇష్టమని, క్రికెట్ బ్యాట్ పట్టుకుని.. బౌలింగ్ చేయమని తండ్రిని అడిగేవాడని కుటుంబ సభ్యులు అంటుంటారు.
- ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో పెరిగిన కోహ్లీ 1998లో పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడెమీ తొలి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. గల్లీ క్రికెట్ ఆడుతూ సమయం వృధా చేసుకోవద్దని ఇరుగుపొరుగువాళ్లు చెప్పటంతో విరాట్‌ను ఆయన తండ్రి అకాడెమీలో చేర్పించారు.
- ఢిల్లీ అండర్ 15 జట్టులో తొలిసారిగా 2002 అక్టోబర్‌లో ఉమ్రిగర్ ట్రోఫీలో కోహ్లీ ఆడారు. 2003-04 సంవత్సరంలో ఉమ్రిగర్ ట్రోఫీలో ఆడుతున్న ఢిల్లీ జట్టుకు కోహ్లీ కెప్టెన్ అయ్యారు.
- మలేషియాలో 2008వ సంవత్సరంలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. 19 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి ప్రవేశించిన కోహ్లీ తన తొలి మ్యాచ్‌ను శ్రీలంకపై ఆడారు.
- మహేంద్రసింగ్ ధోనీ తప్పుకోవటంతో.. 2014లో భారత టెస్టు జట్టుకు, ఈ ఏడాది భారత వన్డే జట్టుకు కోహ్లీ కెప్టెన్ అయ్యారు.

ఫొటో సోర్స్, Yashraj Films
21న ఢిల్లీలో, 26న ముంబయిలో రిసెప్షన్
విరాట్, అనుష్కల పెళ్లి ఇటలీలోని టస్కనీ నగరంలో ఉన్న ఒక రిసార్ట్‌లో జరిగింది. పలువురు బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.
తమ స్నేహితులు, బంధువులు, క్రికెట్, బాలీవుడ్ ప్రముఖుల కోసం ఈనెల 21వ తేదీన ఢిల్లీలో విరాట్ కోహ్లీ, 26వ తేదీన ముంబయిలో అనుష్క శర్మ విందు ఇవ్వనున్నారు.
అనంతరం విరాట్-అనుష్కలు దక్షిణ అమెరికా వెళ్లి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు.
జనవరి మొదటి వారంలో అనుష్క తిరిగి షూటింగ్‌కి హాజరవుతుంది. పెళ్లి తర్వాత ఆమె షూటింగ్ చేస్తున్న చిత్రంలో షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తుండగా ఆనంద్ ఎల్ రాయ్ తీస్తున్నారు.

ఫొటో సోర్స్, Anushkasfanclub/twitter
‘విరాట్ ఇక వైస్ కెప్టెన్’
కాగా, అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, వారి అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
‘ఇక నుంచి ఇంట్లో విరాట్ కోహ్లీ సంతోషంగా వైస్ కెప్టెన్ అవుతాడు. కొత్త కెప్టెన్ అనుష్క శర్మను అభినందనలు’ అంటూ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
‘ఇప్పుడు అర్థం అవుతోంది. టీమిండియా నిన్న ఇటలీలో విరాట్ కోహ్లీ పెళ్లికి వెళ్లాలనే తొందర్లో ఉంది’ అంటూ శ్రీలంకపై పరాజయాన్ని ఉద్దేశించి సర్ రవీంద్ర జడేజా పేరిట ఒకరు ఇలా ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, SirJadeja/Twitter
మా ఇతర కథనాలు:
- ఇటలీలో పెళ్లి, ముంబయిలో దావత్!
- వేడుకగా కోహ్లీ పుట్టిన రోజు
- కోహ్లీ డబుల్ ధమాకా
- భర్తను హత్య చేసిన భార్య: ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి.. భర్తగా చూపించాలనుకుంది. కానీ, ఆధార్ పట్టించింది
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
- ఆమె ప్రిన్స్‌ని పెళ్లి చేసుకున్నా.. యువరాణి కాలేదు
- ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
- .. అందుకే పెళ్లి చేసుకోమనేది!
- పెళ్లి ఖర్చుల కోసం ఎర్రచందనం స్మగ్లింగ్
- డబ్బులిస్తే వికలాంగుల్ని పెళ్లి చేసుకుంటారా?
- ఈ పెళ్లిళ్లను ఆపడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)