IPL 2019: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం, ప్రపంచకప్‌కు బయల్దేరిన వార్నర్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
- హోదా, బీబీసీ కోసం
ఐపీఎల్-12లో సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 81 పరుగుల ఇన్నింగ్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఆ జట్టుకు ఘన విజయం అందించింది.
వార్నర్ అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్ పంజాబ్‌ను 45 పరుగుల తేడాతో ఓడించింది.
పంజాబ్ ముందు 213 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. కానీ అది నిర్ధారిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 రన్స్ మాత్రమే చేయగలిగింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ధారిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు. అతడితోపాటు మనీష్ పాండే 36, వృద్ధిమాన్ సాహా 28 పరుగులు చేశారు.
పంజాబ్ బౌలర్సు మహమ్మద్ షమీ, కెప్టెన్ ఆర్ అశ్విన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
గెలుపు కానుక
ఈ విజయంతో హైదరాబాద్ సొంత మైదానంలో ఆడిన డేవిడ్ వార్నర్‌కు వీడ్కోలు పలికిందా.. లేక తన అద్భుత బ్యాటింగ్‌తో డేవిడ్ వార్నరే హైదరాబాద్‌కు ఈ విజయం కానుకగా అందించాడా.
ఈ రెండూ నిజమే అనుకోవచ్చు
నిజానికి డేవిడ్ వార్నర్ ప్రపంచకప్ సన్నాహాల కోసం స్వదేశం ఆస్ట్రేలియాకు బయల్దేరాడు.

ఫొటో సోర్స్, KINGS xi PUNJAB/FACEBOOK
వికెట్లు పడిపోతున్నా పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం హైదరాబాద్ బౌలర్లను ఎదుర్కుంటూ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు.
18.2 ఓవర్లో అతడు అవుటైనప్పుడు పంజాబ్ స్కోరు ఆరు వికెట్లకు 160 పరుగులు. క్రీజులో ఉన్న సమయంలో కేఎల్ రాహుల్‌కు ఎవరి నుంచీ తగినంత సహకారం అందలేదు.
దాంతో మ్యాచ్‌పై చివరి వరకూ హైదరాబాద్ పట్టు కొనసాగింది.
డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ కేవలం 4 రన్స్ చేసి మూడో ఓవరుకే పెవిలియన్ చేరడంతో పంజాబ్ కష్టాలు మొదలయ్యాయి.
ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ 27, నికొలస్ పూరన్ 21, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 16 రన్స్ చేశారు. కానీ వారితో రాహుల్ భాగస్వామ్యాలు జట్టుకు విజయం అందించలేకపోయాయి.
హైదరాబాద్ బౌలర్లు ఖలీల్ అహ్మద్ 40 పరుగులకు 3, రషీద్ ఖాన్ 21 పరుగులకు 3, సందీప్ శర్మ 33 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ ఐపీఎల్‌లో మొదటిసారి అద్భుతంగా బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

ఫొటో సోర్స్, SunRisers Hyderabad/FACEBOOK
డేవిడ్ వార్నర్ పేరున నిలిచిన మ్యాచ్.
సోమవారం మ్యాచ్ డేవిడ్ వార్నర్ పేరునే నిలిచింది.
జట్టుకు గెలుపు కీలకం అయిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ బ్యాట్ మెరుపులు మెరిపించింది.
ఐపీఎల్-12 పాయింట్ల పట్టికలో నాలుగు జట్లు 10 పాయింట్ల దగ్గరే ఉండడమే దీనికి కారణం. అయితే 11 మ్యాచుల్లో 5 గెలిచిన హైదరాబాద్ మెరుగైన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో నిలిచింది.
ఇప్పుడు కింగ్స్ పంజాబ్ లెవన్‌పై గెలిచాక 12 మ్యాచుల్లో ఆరు విజయాలతో సన్ రైజర్స్‌కు 12 పాయింట్లు లభించాయి.
ఈ విజయానికి పూర్తి క్రెడిట్ డేవిడ్ వార్నర్‌కే ఇవ్వాలి.
ఒక బ్యాట్స్‌మెన్ ఈ మొత్తం ఐపీఎల్‌పై ఎలాంటి ప్రభావం చూపించాడు అనడానికి వార్నర్ ఒక అద్భుతమైన ఉదాహరణ
ఈ ఐపీఎల్ వార్నర్ బ్యాట్ మెరుపులతోనే ప్రారంభమైంది.
మొదటి మ్యాచ్‌లోనే రాయల్ చాలెంజర్స్‌తో బెంగళూరుపై 100 రన్స్ చేసిన వార్నర్ నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత ఈ టోర్నీ మొత్తం అదే జోరు కొనసాగించాడు.
పంజాబ్‌పై 70 నాటౌట్, దిల్లీపై 51, చెన్నైపై 50, కోల్‌కతాపై 67, చెన్నై మరోసారి 57, తాజా మ్యాచ్‌లో పంజాబ్‌పై 81 రన్స్ చేసిన వార్నర్ తన సత్తా చూపాడు.

ఫొటో సోర్స్, SunRisers Hyderabad/FACEBOOK
జానీ బెయిర్‌స్టోతో కుదిరిన జోడీ
ఈసారీ ఐపీఎల్‌లో వార్నర్‌కు జానీ బెయిర్‌స్టో రూపంలో ఒక చక్కటి పార్ట్‌నర్ దొరికాడు.
బెయిర్‌స్టో కూడా ఈ ఐపీఎల్‌లో ఒక సెంచరీతోపాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
అంతే కాదు, బెయిర్ స్టో 40 నుంచి 50 పరుగుల లోపు స్కోరుతో మూడు కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు.
జానీ బెయిర్‌స్టో ఈ ఐపీఎల్‌లో మొత్తం 10 ఇన్నింగ్సుల్లో 445 రన్స్ చేశాడు. ప్రపంచ కప్ సన్నాహాల కోసం అతడు ఇప్పటికే తిరిగి ఇంగ్లండ్ చేరుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన వార్నర్ "జట్టు కోసం ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేశాను" అని చెప్పాడు.
ఆస్ట్రేలియా వెళ్లే ముందు వార్నర్ 12 మ్యాచుల్లో మొత్తం 692 పరుగులు చేశాడు. సోమవారం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ కూడా అతడిని గౌరవించి, హత్తుకున్నాడు.

ఫొటో సోర్స్, SunRisers Hyderabad/FACEBOOK
హైదరాబాద్‌లో మిగిలిన సత్తా ఎంత
బంతిని ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలతో ఒక ఏడాది సస్పెన్షన్ కూడా ఎదుర్కున్న వార్నర్ లాంటి ఆటగాడు ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతాడనేది ఎవరూ ఊహించని విషయం.
అతడితోపాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా సస్పెన్షన్ ఎదుర్కున్నాడు. కానీ, అతడు కూడా రాజస్థాన్ రాయల్స్ కోసం అద్భుత బ్యాటింగ్ చేశాడు.
స్టీవ్ స్మిత్ 11 మ్యాచుల్లో మొత్తం 319 రన్స్ చేశాడు.
ఇటు తనెంత పరుగుల దాహంతో ఉన్నాడో డేవిడ్ వార్నర్ ఈ ఐపీఎల్‌లో చూపించాడు.
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో స్వదేశానికి చేరుకోవడంతో మిగిలిన మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను విజయ తీరాలవైపు ఎవరు తీసుకెళ్లగలరో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- ఫొని తుపాను విజృంభిస్తే ఏపీలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
- ‘బంగాళాదుంపలు’ పండించారని భారతీయ రైతులపై కోట్ల రూపాయల దావా వేసిన ‘లేస్’
- శ్రీలంక పేలుళ్లు: ముసుగులపై నిషేధం
- సోషల్ మీడియాపై శ్రీలంక నిషేధం: మంచిదేనా? ప్రజలు ఏమనుకొంటున్నారు?
- మోదీపై ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయట్లేదు?
- ‘అచ్రేకర్ సర్‌తో నా అద్భుత ప్రయాణం అలా మొదలైంది’ - సచిన్ తెండూల్కర్
- కిరణ్ బేడీని ఇందిరా గాంధీ లంచ్‌కు ఎందుకు ఆహ్వానించారు?
- మీ ఆలోచనల్ని చదివి, మాటల రూపంలో వినిపించే పరికరం... శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








