#SRHvsRR రాజస్థాన్‌రాయల్స్‌ను బతికించిన సన్‌రైజర్స్.. హైదరాబాద్ జట్టు ఎందుకు ఓడిపోయిందంటే..

ఫొటో సోర్స్, sunrisershyderabad/facebook
పన్నెండు ఓవర్లు ముగిశాయి.. ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయారు.. అప్పటికి 103 పరుగులు చేశారు.. చేతిలో ఇంకా 9 వికెట్లున్నాయి.
హిట్టింగ్‌కు మారుపేరైన టీ20ల్లో ఏ జట్టయినా ఇలాంటి పటిష్టమైన స్థితిలో ఎవరైనా ఏమనుకుంటారు?
జట్టు స్కోరు 200 దాటడం ఖాయమనుకుంటారు. కానీ, ఆ జట్టు 20 ఓవర్లలో 160 పరుగులతోనే సరిపెట్టుకుంది. ప్రారంభంలోని జోరును ముగింపు వరకు కొనసాగించలేకపోవడంతో తక్కువ లక్ష్యమిచ్చి ఓటమి పాలైంది.
ఇదీ నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి. మిడిల్ ఆర్డర్ మొదలుకుని ఆ తరువాత వచ్చినవారు వచ్చినట్లు తిరిగి పెవిలియన్ చేరుకోవడంతో సన్‌రైజర్స్ భారీ లక్ష్యం నిర్దేశించడంలో విఫలమైంది. ఫలితం ప్లేఆఫ్ రేసులో తాడోపేడో అంటూ పోరాడుతున్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది.

ఫొటో సోర్స్, facebook/Rajasthan Royals
ఓపెనింగ్, మూడో వికెట్ భాగస్వామ్యమే గెలిపించింది
రాజస్థాన్ రాయల్స్ జట్టులో బౌలర్లు, బ్యాట్స్‌మెన్ కూడా కలసికట్టుగా రాణించడంతో ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు అజింక్యా రహానె, లివింగ్‌స్టన్‌లు నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. రహానే 34 బంతుల్లో 39 పరుగులు చేయగా.. లివింగ్‌స్టన్ 22 బంతుల్లో 44 పరుగులు చేశాడు. లివింగ్‌స్టన్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో సంజుశాంసన్(48; 32 బంతుల్లో 4x4, 1x6), స్టీవ్‌స్మిత్(22; 16 బంతుల్లో 3x4) కూడా మంచి భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. పరుగుల జోరు తగ్గకుండా అందించిన రెండు భాగస్వామ్యాలు మ్యాచ్‌ను గెలిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్క ఫోరూ కొట్టని వార్నర్.. కట్టుదిట్టంగా రాజస్థాన్ బౌలింగ్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే విలియమ్సన్ వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ మనీష్ పాండే, డేవిడ్ వార్నర్‌లో వికెట్ ఇవ్వకుండా పరుగులు తీయగలిగారు. పాండే 61, వార్నర్ 37 పరుగులు చేసినప్పటికీ ఇద్దరిలో ఎవరూ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. వార్నర్ అయితే తన సహజ సిద్ధమైన ఆటకు భిన్నంగా సింగిల్స్, డబుల్స్ తిరుగుతూ స్కోర్ నడిపాడు. సిక్సరే కాదు ఆయన బ్యాట్ నుంచి కనీసం ఫోర్ కూడా రాలేదు.
పాండే 36 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేయగా వార్నర్ 32 బంతులాడి ఒక్కటి కూడా బౌండరీ దాటించకుండా 37 పరుగులు చేశాడు.
భారీ షాట్లు లేనప్పటికీ స్కోరు మెరుగ్గా ఉండడం.. వికెట్లు కోల్పోకుండా ఆడడంతో హైదరాబాద్ జట్టు 200 చేస్తుందని అంతా భావించారు. కానీ, 13వ ఓవర్లో వార్నర్ అవుటయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
విజయ్ శంకర్(8), షకీబ్(9), దీపక్ హూడా(0), వృద్ధిమాన్ సాహా(5), భువనేశ్వర్ కుమార్(1).. ఇలా వచ్చినవారు వచ్చినట్లే తిరిగి పెవిలియన్‌కు చేరుకున్నారు. చివర్లో రషీద్ ఖాన్ మాత్రం 8 బంతులాడి 17 పరుగులు చేశాడు. ఒక ఫోర్, సిక్సర్ బాది స్కోరు బోర్డుకు మళ్లీ జోరు తెచ్చాడు. దీంతో 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 160 పరుగులు చేయగలిగింది.
13 నుంచి 19 ఓవర్ల మధ్య హైదరాబాద్ జట్టు 39 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.

ఫొటో సోర్స్, SunRisers Hyderabad
సన్‌రైజర్స్ బౌలర్లదీ అదే దారి..
161 పరుగుల సులభ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ను కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో షకీబ్ అల్‌హసన్, రషీద్‌ఖాన్, ఖలీల్ అహ్మద్ తప్ప ఇంకెవరూ వికెట్లు తీయలేకపోయారు. వీరు ముగ్గురూ తలో వికెట్ తీయగలిగారు.
భువనేశ్వర్ కుమార్ వికెట్లు సాధించనప్పటికీ పరుగులు తక్కువగా ఇచ్చాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇవ్వగా మిగతావారంతా ఓవరుకు సగటున 8 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు.
సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ బౌండరీల మోత మోగించారు. ఏకంగా 4 ఓవర్లలో 48 పరుగులు రాబట్టారు.

ఫొటో సోర్స్, Rajasthanroyals/twitter
రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
ఈ మ్యాచ్‌లో విజయంతో రాజస్థాన్ జట్టు తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచగలిగింది. 12 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది ఐదో విజయం. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన రాజస్థాన్ అందులో ఏ ఒక్కటి ఓడినా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లడం కష్టమే.
మరోవైపు తాజా ఓటమితో సన్‌రైజర్స్ జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు 10 మ్యాచుల్లో 5 విజయాలు, 10 పాయింట్లతో సురక్షిత స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలవాల్సిన పరిస్థితి.
చెన్నై 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ప్లేఆఫ్‌కి చేరగా ముంబయి, దిల్లీలు చెరో 14 పాయింట్లతో ఆ తరువాత స్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్లకు ఇంకా మూడేసి మ్యాచ్‌లున్నాయి.
అదేసమయంలో హైదరాబాద్‌తో సమానంగా పాయింట్లు ఉన్న పంజాబ్ జట్టుకు కూడా మరో మూడు మ్యాచ్‌లు, రాజస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండడంతో సన్ రైజర్స్ పరిస్థితి మిగతా మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లేఆఫ్‌కు చేరుతుందన్నట్లుగా మారింది.
పాయింట్ల పట్టికలో ఎవరెక్కడ
ఇవి కూడా చదవండి:
- లైంగిక వేధింపుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు: నాలుగు ప్రశ్నలు
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
- లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- రఫేల్ తీర్పు సమీక్షపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








