రఫేల్ ఒప్పందం: తీర్పును సమీక్షించడంపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అవకతవకలేమీ లేవని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడంపై కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక అభ్యంతరాలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. అంటే ఈ ఒప్పందంపై గతంలో క్లీన్ చిట్ ఇస్తూ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి కోర్టు మళ్ళీ రఫేల్ కేసును విచారణకు స్వీకరిస్తుంది.
ఈ కేసులో కొత్త సాక్ష్యాధారాలను న్యాయస్థానం అనుమతించింది. కొత్త సాక్ష్యాధారాలను రివ్యూ పిటిషన్లో భాగంగా అనుమతించినట్లు తెలిపింది. ఈ విషయంలో కేంద్రం అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది.
ఇంతకుముందు, ఈ ఒప్పందంపై దర్యాప్తు చేయాలనే విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
పిటిషనర్లు కొత్త సాక్ష్యాధారాలతో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరారు. అందుకు ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ, సుప్రీంకోర్టు మాత్రం కొత్త సాక్ష్యాధారాలను అనుమతించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రివ్యూ పిటిషన్ మీద విచారణ తరువాత జరుగుతుందని చెప్పిన సుప్రీంకోర్టు, ప్రభుత్వ అభ్యంతరాల మీదే ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేసింది.
అపహరించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దనే ప్రభుత్వ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించామని, కోర్టు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొందని, ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిందని రివ్యూ పిటిషన్ వేసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి మీడియాతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మోదీ తప్పించుకోలేరు: కాంగ్రెస్
సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ- ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసింది.
"మోదీ మీరు ఎంత దూరం పారిపోయినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఏదోరోజు సత్యం బయటకు వస్తుంది. రఫేల్ కుంభకోణం బండారం బయటపడుతోంది. అధికార రహస్యాల చట్టం సాకుతో తప్పించుకోవడానికి వీల్లేదు" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కాలపరీక్షకు నిలిచిన న్యాయసూత్రాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని సుర్జేవాలా చెప్పారు.
రఫేల్ ఒప్పందంలో అవినీతిని స్వతంత్ర జర్నలిస్టులు బయటపెట్టిన తర్వాత మోదీ బెంబేలెత్తిపోయారని, వారిపై అధికార రహస్యాల చట్టం ప్రయోగిస్తామని బెదిరించారని ఆరోపించారు.
"మోదీ! మీరు కంగారు పడకండి. మీకు ఇష్టమున్నా, లేకపోయినా దర్యాప్తు జరగబోతోంది" అని ఆయన చెప్పారు.
సైన్యానికి మోదీ ద్రోహం చేశారు: అరవింద్ కేజ్రీవాల్
రఫేల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని ప్రధాని మోదీ చెప్పుకొంటున్నారని, కానీ ఇందులో అవకతవకలు జరిగాయని న్యాయస్థానం తాజా నిర్ణయంతో స్పష్టమైందని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ భారత సైన్యానికి ద్రోహం చేశారని, ఆయన నేరాన్ని కప్పిపుచ్చుకొనేందుకు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ: పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యం.. తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- ధవళేశ్వరం ఆనకట్ట: గోదావరి జిల్లాలను కరువు నుంచి సంపదలోకి తెచ్చిన ప్రాజెక్టు
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- రఫేల్ ఒప్పందం పత్రాలు చోరీ అయ్యాయి : సుప్రీం కోర్టులో కేంద్రం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








