రఫేల్ ఒప్పందం పత్రాలు చోరీ అయ్యాయి : సుప్రీం కోర్టులో కేంద్రం వాదన

ఫొటో సోర్స్, Getty Images
రఫేల్ కేసు రివ్యూ పిటిషన్ విచారణ సమయంలో సుప్రీం కోర్టు తమ పరిశీలన గురించి ఏ వ్యాఖ్యలూ చేయకుండా ఉండాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఎందుకంటే న్యాయస్థానం చేసే ప్రతి వ్యాఖ్యనూ ప్రభుత్వం లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యం చేసుకోడానికి ఉపయోగిస్తారని తెలిపింది.
ఈ కేసులో సుప్రీం కోర్టు ఒకే పక్షం వైపు ఎందుకు ఉండాలో కేంద్రం ప్రభుత్వం అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు.
సుప్రీం కోర్టు తన విచారణలో మొదట రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పింది.
వార్తా ఏజెన్సీ పీటీఐ కథనం ప్రకారం వేణుగోపాల్ ఇటీవల పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించినట్టు వచ్చిన వాదనలను కూడా ప్రస్తావించారు.
"మేం మన దేశం భద్రతను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎఫ్-16 విమానాలతో, బాంబులతో మనపై దాడి చేస్తే మనం ఏం చేయాలి, రఫేల్ లేకుండా మనం వాటిని ఎలా ఎదుర్కోగలం" అని వేణుగోపాల్ న్యాయస్థానాన్ని అడిగారు.
మిగ్-21 బైసన్ విమానాల గురించి చెప్పిన వేణుగోపాల్ " అవి 1960వ దశకం నాటి ఫైటర్ విమానాలు. అది ఎఫ్-16ను ఎదుర్కొన్నాయి, కానీ ఇప్పుడు మనకు రఫేల్ విమానాల అవసరం ఉంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్చి 14 వరకూ విచారణ వాయిదా
బుధవారం సుప్రీంకోర్టు.. ఫ్రాన్స్‌తో జరిగిన రఫేల్ ఒప్పందం విషయంలో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణను మార్చి 14 వరకూ వాయిదా వేసింది.
రఫేల్ ఒప్పందం కేసులో రివ్యూ పిటిషన్ విచారణ సమయంలో "ఈ యుద్ధ విమానం ఒప్పందానికి సంబంధించిన ప్రత్యేక పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీ అయ్యాయని" అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు చెప్పారు.
న్యాయస్థానంలో ప్రశాంత్ భూషణ్ ఒక నోట్ చదవడం ప్రారంభించినపుడు వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రఫేల్ ఒప్పందానికి సంబంధించిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చకూడదని ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎందుకంటే కీలకమైన వాస్తవాలను కేంద్రం అణగదొక్కలేదని వాదించారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కె కౌల్, కెఎం జోసెఫ్ బెంచ్ ఎదుట "రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు కీలక పత్రాలను చోరీ చేయడం వల్ల దీనిపై ఇప్పుడు విచారణ సాధ్యం కాదని" వేణుగోపాల్ వాదించారు. గోప్యతా చట్టం ప్రకారం చోరీ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను మార్చి 14 వరకూ వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టులో ఏం జరిగింది
రఫేల్ ఫైల్ చోరీ అయ్యిందని ఏజీ చెప్పారు, జాతీయ దినపత్రిక 'ది హిందూ' దానిని ప్రచురించిందన్నారు.
ప్రభుత్వం ఈ కేసులో ఏం దర్యాప్తు చేసిందని జస్టిస్ రంజన్ గొగోయ్‌ని ఏజీని ప్రశ్నించారు. సమాధానంగా ఫైల్ ఎలా చోరీ అయ్యిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని వేణుగోపాల్ చెప్పారు.
గోప్యంగా ఉంచాల్సిన ఫైల్ గురించి ది హిందూ పత్రిక ప్రచురించిందని ఏజీ చెప్పారు. "ఇటీవల ది హిందూ రఫెల్ ఒప్పందానికి సంబంధించిన చాలా రిపోర్టులు ప్రచురించింది. ఈ ఒప్పందం కోసం ప్రభుత్వం చాలా నిబంధనలు ఉల్లంఘించిందని అందులో రాశారని" తెలిపారు.
"రక్షణ ఒప్పందాలు దేశ భద్రత కోసం జరుగుతాయి. అది చాలా సున్నితమైన అంశం. అవన్నీ మీడియా, కోర్ట్, పబ్లిక్ డిబేట్‌లలో బయటికొస్తే, వేరే దేశాలు మనతో రక్షణ ఒప్పందం చేసుకోడానికి వెనకడుగు వేయచ్చు" అని చెప్పారు.
"రఫేల్ డీల్ గురించి మొదటి నుంచీ బహిరంగమైన పత్రాలనే తాము కోర్టుకు సమర్పించినట్లు" ప్రశాంత్ భూషణ్ సుప్రీంకు తెలిపారు. పిటిషనర్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఆయన తరఫున సంజయ్ హెగ్డే సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వాదనలు వినడానికి సీజేఐ నిరాకరించారు.
రివ్యూ పిటిషన్‌కు వ్యతిరేకంగా వాదించిన ఏజీ, దేశ సౌర్వభౌమాధికారం, ఏకత్వం, విదేశీ ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఎవరైనా ఒక వ్యక్తి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం అన్నారు. దీనిని గోప్యతా చట్టం ఉల్లంఘనగా భావించి రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి:
- రఫేల్ కేసులో సుప్రీం తీర్పు: "ఒప్పందంపై కోర్టు జోక్యం అవసరం లేదు..."
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- రఫేల్ డీల్ ఆడియో టేపు లీక్.. మొత్తం సంభాషణ ఇదే..
- ఆరోగ్యంపై హార్మోన్ల ప్రభావం గురించి మహిళలు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- ‘తమిళనాడులో టిక్‌టాక్’ యాప్‌ను నిషేధించాలని నిర్ణయం’
- హైదరాబాద్‌లో ఈ అమ్మాయి బైక్ విన్యాసాలు చూస్తే.. కళ్లు తిరుగుతాయ్
- హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. తమ ప్రేమను నిలబెట్టుకున్నారు
- ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడిపై ముగిసిన విచారణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో బ్‌స్క్రైబ్ చేయండి.)








