బ్రెజిల్‌లో చిలుకను అరెస్టు చేసిన పోలీసులు

చిలుక

మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకునేందుకు దాడులు చేపట్టిన బ్రెజిల్ పోలీసులు ఓ రామ చిలుకను అరెస్టు చేశారు.

పోలీసులు వచ్చినప్పుడు అప్రమత్తం చేసేలా మాదక ద్రవ్యాల వ్యాపారులు ఈ చిలుకకు శిక్షణ ఇచ్చినట్లు వారు గుర్తించారు.

తాము తనిఖీలకు వెళ్లినప్పుడు ఈ చిలుక ''పోలీస్.. పోలీస్'' అంటూ గట్టిగా అరవడం ప్రారంభించిందని పోలీసులు తెలిపారు.

విచారణ కోసం దాన్ని కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

అయితే, ఆ చిలుక నుంచి పోలీసులు ఎలాంటి సమాచారమూ రాబట్టుకోలేకపోయారు.

విచారణకు ఆ పక్షి సహకరించలేదని, పోలీసులు దగ్గరికి వెళ్లినప్పుడు మౌనంగానే ఉందని స్థానిక జంతు వైద్యుడు అలెగ్జాండర్ క్లార్క్ తెలిపారు.

పోలీసులు ఆ చిలుకను స్థానికంగా ఉన్న జూకు అప్పగించినట్లు బ్రెజిల్‌లోని వార్తా సంస్థ గ్లోబో తెలిపింది.

అక్కడ మూడు నెలల పాటు ఆ పక్షికి ఎగరడంలో శిక్షణ ఇస్తారని, ఆ తర్వాత దాన్ని విడిచిపెడతారని పేర్కొంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)