లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా?

- రచయిత, విలియం పార్క్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగాకుండా వచ్చేశావే..
ఎవరినైనా చూడగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది.... ప్రపంచమే మర్చిపోయేలా చేస్తుంది.. అదే తొలిచూపు ప్రేమ. దాన్నే 'లవ్ అట్ ఫస్ట్ సైట్' అంటాం.
మీకు ఒకరిని చూడగానే.. వీళ్లు మన జీవితంలో లేకుంటే అసలు బతకడమే వృథా అనిపించేస్తుంది. తొలి చూపుకే జీవితమంతా చేయాల్సిన ప్లానింగ్ గురించి మనసులో అలజడి మొదలవుతుంది.
అదే విధంగా మనం చాలా మందిని మొదట చూడగానే వారు ఎలాంటివాళ్లా అని ఒక అంచనాకు వచ్చేస్తాం.
అయితే ఎదురుగా ఉన్న వారి గురించి మన మనసులో పడిన ఆ చిత్రం పూర్తిగా నిజం కాకపోవచ్చు. మనం వారి గురించి వేసుకున్న అంచనాలు తప్పు కూడా కావచ్చు.
కానీ ఒక మాటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్. సరే.. ఇప్పుడు ఈ మాట వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
ఎవరి ముఖమైనా ఒకసారి చూడగానే, వారిపై ఒక అభిప్రాయానికి రావడానికి మెదడుకు సెకనులో పదో వంతు సమయం పడుతుంది.
ఫస్ట్ ఇంప్రెషన్‌లో కేవలం ఆ వ్యక్తిలో ఆకర్షణ కోణాన్ని అంచనా వేయడమే కాదు, వారి వ్యక్తిత్వం గురించి చాలా కోణాలు ముందుకు వస్తాయి.
అంటే ఎవరైనా ఒక రాజకీయ నేత సామర్థ్యం గురించి ఆయన హావభావాలు, మాటలతో అంచనా వేయచ్చు.
వ్యక్తిగతంగా ఆయన గురించి తెలీకపోయినా మంచి రాజకీయ నేత అవుతారా, కాదా అని జనం ఆయన వ్యక్తిత్వం గురించి ఒక అంచనాకు వచ్చేస్తుంటారు.
రీసెర్చర్, 'ఫేస్ వాల్యూ' పుస్తక రచయిత అలగ్జాండర్ టొడొరోవ్ దాన్ని కొట్టిపారేస్తారు. ఆయన "మొదటి చూపులో ఏర్పడిన అభిప్రాయం తప్పు కూడా కావచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడూ అపరిచితులపై వస్తుంది. కాబట్టి దాని గురించి వచ్చే ఏ అభిప్రాయమైనా పైపైన కలిగేది మాత్రమే, అది కచ్చితమైనది కాదు" అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
మన చూపులను నిర్ణయించే ఆ మూడు
ప్రపంచవ్యాప్తంగా ఫేస్ వాల్యూ ఆధారంగా ఎవరైనా మూడు విషయాలను దృష్టిలో పెట్టుకుని వారిపై ఒక అభిప్రాయానికి వస్తారు.
మొదటిది ఆకర్షణ, రెండోది విశ్వసనీయత, మూడోది ప్రాధాన్యం
- ఆకర్షణ - దీనివల్ల నాణ్యమైన సెక్స్ చేయగలిగేలా ఉంటుంది.
- విశ్వసనీయత - దీనివల్ల బాధ్యతలు తీసుకోగల సాహసం ఉంటుంది.
- ప్రాధాన్యం - ఇందులో గొడవలు, ఒత్తిడి తగ్గించే సామర్థ్యం ఉంటుంది.
ఈ అధ్యయనం చేసినవారు ప్రాధాన్యానికి సంబంధించి శారీరకంగా బలంగా ఉండడం కూడా కలిపి చెబుతున్నారు. కానీ అందులో పురుషులు, మహిళల్లో ఒకే అభిప్రాయం ఏర్పడడం జరగదు.
ఉదాహరణకు ఒక కండలు తిరిగిన పురుషుడు ఉన్నప్పుడు, ఇది ఆయన ఫేవర్‌లో వెళ్తుంది. అదే ఒక మహిళ అలాగే బలంగా, ఎత్తుగా ఉంటే ఆమెను చూసి తప్పుగా అనుకుంటారు. కాబట్టి ముఖం చూసి ఒక అభిప్రాయానికి రావడం సరికాదు.

ఫొటో సోర్స్, Getty Images
విర్చువల్ వరల్డ్‌లో ఇంప్రెషన్
మేడ మీది నుంచి సైగలు చేసుకోవడం లేదా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ప్రేమ వ్యక్తం చేయడం లాంటి కాలం పోయింది.
ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది. ఇక్కడ విర్చువల్ వరల్డ్‌లో వాస్తవ బంధాలు కూడా ఏర్పరుచుకోవచ్చు.
ఇప్పుడు చాలా డేటింగ్ యాప్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని లక్షల మంది స్నేహం చేస్తున్నారు. అక్కడ ఒకరి ఫోటో ఏదైనా నచ్చగానే, ఇంకొకరిని రెజెక్ట్ చేసేస్తారు.
కానీ, టెక్నాలజీ సాయంతో ఫొటోలను అందంగా లేక ఘోరంగా చేయవచ్చనే విషయం వారు మర్చిపోతున్నారు.
దానితోపాటూ ఆ ఫొటో ఏ యాంగిల్ నుంచి తీశారు అనేది కూడా కచ్చితంగా చూడాలి.
ఉదాహరణకు ఫొటోను లో-యాంగిల్ నుంచి తీసుంటే, ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తుల నేచర్ డామినేటింగ్ అనుకోవచ్చు. అది పురుషులకు అనుకూలంగా ఉంటే, మహిళకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆధిపత్యం చూపించే మహిళా ఫ్రెండ్ ఎవరికీ నచ్చదు.
అమెరికా వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లీసల్ షర్బీ "ఆన్‌లైన్ డేటింగ్ కోసం ఎలాంటి మాటలు ఉపయోగిస్తారో, వాటిని బట్టి వాళ్ల తర్వాత కలయిక ఉండడం జరుగుతుంది అన్నారు.
సాధారణంగా రొమాంటిక్ రిలేషన్‌షిప్ సంభాషణ ముందు పురుషుల వైపు నుంచే జరుగుతుంది. కానీ విర్చువల్ వరల్డ్‌లో ఈ తేడా కనిపించదు. ఇక్కడ ఇద్దరూ సమాన స్థాయిలో ఆ బంధాన్ని ప్రారంభిస్తారు. దాని ఆధారంగా వారెలాంటివారు అనేదానిపై ఒక కచ్చితమైన అభిప్రాయానికి రాలేం.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ ప్రపంచంలో బంధాలు
ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ లోకంలో బంధాలు చాలా వ్యూహాత్మకంగా ఏర్పరుచుకుంటారు. అందుకోసం సుమారు 18 రకాల డేటింగ్ స్ట్రాటజీలు ఉపయోగిస్తారని ఒక రీసెర్చ్ రిపోర్టులో చెప్పారు. ఆన్‌లైన్‌లో మొదటి కలయిక విజయవంతైతే, తర్వాత అది వారు మళ్లీ కలుసుకునేవరకూ వెళ్తుంది. అప్పుడు పార్ట్‌నర్స్ ఇద్దరూ తమ ఇష్టాలు, అయిష్టాల గురించి మాట్లాడుకుంటారు.
విషయం మరింత ముందుకు వెళ్తే తర్వాత స్టేటస్, డబ్బు, ప్రేమ గురించి మాట్లాడుకోడం ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే ఈ విషయాలన్నీ మాట్లాడుకునేస్తే, వ్యక్తిగతంగా కలుసుకోవడం సులభం అవుతుంది.
ఆన్‌లైన్ డేటింగ్ వల్ల అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే నిర్ణయం తీసుకోవడానికి మీకు కావల్సినంత సమయం దొరుకుతుంది. ఇటు దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఎవరినైనా కలవకుండానే వారి గురించి ఒక అభిప్రాయానికి వచ్చేస్తే అది మీ ఆశలపై నీళ్లు చల్లేయవచ్చు.
జనం తమ ఇష్టాలు, అయిష్టాలు చెబుతూ కూడా బోల్తా కొడతారు. ఉదాహరణకు ఒక పురుషుడు ఎప్పుడూ తనకు తెలివైన మహిళ ఇష్టం అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవానికి అతడికి తనకంటే తక్కువ తెలివి ఉన్న మహిళ తోడే నచ్చుతుంది. అప్పుడే అతడు ఎక్కువ తెలివైనవాడుగా తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోగలడు.
కానీ ఇది కూడా ప్రతి వ్యక్తి విషయంలో జరగదు. మనం మన జీవిత భాగస్వామిలో చాలా రకాల లక్షణాలు ఉండాలని అనుకుంటాం. కానీ చాలాసార్లు మనం అనుకున్న ఒక్క లక్షణం కూడా లేని వాళ్లు మనకు చాలా బాగా నచ్చేయచ్చు.
ఏదేమైనా, తొలిచూపులోనే ఒకరి గురించి ఏర్పడిన అభిప్రాయం ఎప్పుడూ కరెక్టేనని చెప్పడం చాలా కష్టం.
ఇక ప్రేమ విషయానికి వస్తే, అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపైన కలుగుతుందో ఎవరూ చెప్పలేం.
ప్రేమ బంధంలోకి రాగానే మనం అనుకున్న ఎన్నో పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే ఎవరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రేమించరు. అది అలా పుడుతుంది అంతే..
ఇవి కూడా చదవండి:
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- శ్రీలంక పేలుళ్ల ‘సూత్రధారిగా భావిస్తున్న హషీమ్’ చెల్లెలు ఏమంటున్నారంటే...
- భారత్‌లో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువుల పరిస్థితి ఎలా ఉంది?
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- ప్రేమ - శృంగారం - వైకల్యం
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








