మిథాలీ మా మోడలంటున్న హైదరాబాద్ అమ్మాయిలు
హైదరాబాద్‌లోని ఓ క్రికెట్ కోచింగ్ క్లబ్బులో అమ్మాయిలు చెమటలు చిందిస్తున్నారు. వారిలో చాలా మందికి మిథాలీ రాజ్ రోల్‌మోడల్.
ఆమె నాయకత్వంలో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకున్న తర్వాత అమ్మాయిల్లో క్రికెట్ పట్ల క్రేజ్ బాగా పెరిగింది. మహిళల క్రికెట్ పట్ల ప్రజల్లో చాలా అనుమానాలుండేవని మిథాలీ రాజ్ అంటారు.
అయితే మహిళలు టోర్నీల్లో విజయాలు సాధిస్తున్నా కొద్దీ ఆలోచనా తీరు మారుతోందని ఆమె బీబీసీతో అన్నారు. హైదరాబాద్ నుంచి బీబీసీ తెలుగు ప్రతినిధి సంగీతం ప్రభాకర్ అందిస్తున్న రిపోర్ట్.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)