విరాట్ కోహ్లీ: ప్రపంచ నం. 1 టెస్ట్ బ్యాట్స్‌మన్

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో చేసిన సెంచరీతో విరాట్ ప్రపంచ ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్‌లో టాపర్‌గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు సాధించాడు.

దీంతో, 32 నెలలుగా టాప్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ స్థానం చెదిరిపోయింది. స్మిత్ బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు 12 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

ఇప్పటివరకు 67 మ్యాచుల్లో 22 సెంచరీలు చేసిన కోహ్లీ, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ ముగిసిన తరువాత, ఇంగ్లండ్‌లో తన తొలి సెంచరీకి ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించాడు.

సచిన్ టెండూల్కర్ 2011 జూన్‌లో ఐసిసి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న తరువాత, ఆ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.

ఇక, టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బర్మింగ్హామ్‌లో నాలుగు వికెట్లు తీసుకుని అగ్రస్థానంలో సుస్థిరంగా కొనసాగుతున్నాడు.

ఐసిసి టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్

1.విరాట్ కోహ్లీ (ఇండియా) 934 పాయింట్లు

2.స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 929

3.జోయ్ రూట్ (ఇంగ్లండ్) 865

4.కేన్ విలియమ్సన్ (న్యూజీలాండ్) 847

5.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 820

6.చేటేశ్వర్ పుజారా (ఇండియా) 791

7.దిముత్ కరుణరత్నే (శ్రీలంక) 754

8.దినేశ్ చండీమాల్ (శ్రీలంక( 733)

9.డీన్ ఎల్గార్ (దక్షిణాఫ్రికా) 724

10.ఏడెన్ మార్క్‌రమ్ (703)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)