'కబీర్ సింగ్' దర్శకుడు సందీప్ వంగా వ్యాఖ్యలపై సమంత, చిన్మయిల విమర్శలు

కబీర్ సింగ్

ఫొటో సోర్స్, FACEBOOK/KABIRSINGHMOVIE

"పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు అందులో నిజాయతీ ఉంటుంది. ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే అక్కడ ఏమీ ఉండదు."

"మీ మహిళా భాగస్వామిని చెంప దెబ్బ కొట్టలేకపోతే, అమ్మాయిని ఎక్కడ కావాలంటే అక్కడ టచ్ చేయలేకపోతే, ముద్దు పెట్టుకోలేకపోతే, అసభ్యంగా మాట్లాడలేకపోతే... అక్కడ నాకైతే ఎలాంటి ఎమోషన్స్ కనిపించడం లేదు"

'కబీర్‌ సింగ్' సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలివి.

'ఫిల్మ్ కంపానియన్' చానల్ కోసం అనుపమ చోప్రా చేసిన ఇంటర్వ్యూలో సందీప్ వంగా ఇలా అన్నారు. కబీర్‌ సింగ్ సినిమాపై వస్తున్న విమర్శలన్నీ సూడో విమర్శలని అన్నారు.

సమంతా అక్కినేని

ఫొటో సోర్స్, FB/Samantha

సోషల్ మీడియాలో చర్చ

సందీప్ వంగా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన వాఖ్యలను కొంతమంది మహిళలు తప్పుబడుతున్నారు.

నటి సమంత సందీప్ ఇంటర్వ్యూ స్క్రీన్‌ షాట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, చాలా అభ్యంతరకరంగా ఉందంటూ రాసినట్లు ఇండియాటుడే పేర్కొంది. (ఆ పోస్టు ఇప్పుడు కనిపించడం లేదు.)

అయితే, అర్జున్ రెడ్డి సినిమాను మెచ్చుకుంటూ ఆమె పెట్టిన ట్వీట్‌ స్క్రీన్ షాట్లు పోస్టు చేసి ట్విటర్‌లో కొందరు సమంతని ట్రోల్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దాంతో "సినిమాని ఇష్టపడటం, ఒక కామెంట్‌పై విభేదించడం రెండు వేర్వేరు. నాకు అర్జున్ రెడ్డి సినిమా నచ్చింది. కానీ ప్రేమంటే కొట్టే స్వేచ్ఛ ఉండడమేనని చెప్పడం నాకు నచ్చలేదు" అని సమంతా ట్వీట్ చేసింది.

చిన్మయి శ్రీపాద

ఫొటో సోర్స్, FB / Chinmayi Sripada

'ప్రేమను నిరూపించుకునేందుకు కొట్టాల్సిన పనిలేదు'

సందీప్ రెడ్డి వంగా మాటలను సింగర్ చిన్మయి శ్రీపాద కూడా తప్పుబట్టారు.

"నా భర్త నన్ను ప్రేమిస్తారు. కానీ దాన్ని నిరూపించుకునేందుకు నన్ను కొట్టాల్సిన పని లేదు" అని చిన్మయి అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

'ఒక వ్యక్తికి మీపై ఎనలేని ప్రేమ ఉన్నట్లయితే, మీ మీద అతను చేయి చేసుకోడు. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని టచ్ కూడా చేయడు' అంటూ చిన్మయి ట్వీట్ చేసింది.

"ఫెమినిజం సమాన హక్కులు కోరుతుంది. దెబ్బలు తినడం ఎవరికీ ఇష్టం ఉండదు. అలాంటి రిలేషన్‌షిప్‌లో ఉండాలని ఎవరూ కోరుకోరు" అని కూడా చిన్మయి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

'నేను మొదట్లోనే ఖండించా.. ఇప్పుడు నాకు అండగా ఉన్నారు'

చిన్మయి ట్వీట్‌పై నటి, జబర్దస్త్ ఫేం అనసూయ భరద్వాజ్‌ స్పందించారు.

అనసూయ

ఫొటో సోర్స్, FB/Anasuya Bharadwaj

మొదట్లో నేను దీన్ని ఖండించినప్పుడు మీరు నాకు అండగా నిలవలేదు. ఇప్పుడు నాకు కాస్త బాధేసింది. కానీ మీరిప్పుడు ఇలా మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది, నాకు బలం చేకూరినట్లు అనిపిస్తోంది అని అనసూయ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

సందీప్‌లో నిజాయతీ, ధైర్యం ఉన్నాయి: వర్మ

అయితే, దర్శకుడు రాం గోపాల్ వర్మ సందీప్‌ రెడ్డి వంగాకి బాసటగా నిలిచారు.

"అమాయకమైన నిజాయతీ, నిజమైన ధైర్యం అతనిలో ఉన్నాయి" అంటూ వర్మ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: సందీప్

తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తన భావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని సందీప్ వివరణ ఇచ్చారు.

ఆ తర్వాత సమంత, చిన్మయి, జ్వాలలను కొందరు ట్రోల్ చేశారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా బాగుందంటూ వాళ్లు పెట్టిన ట్వీట్ స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.

తెలుగు 'అర్జున్ రెడ్డి' సినిమాకు 'కబీర్ సింగ్' హిందీ రీమేక్.

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్‌ సింగ్‌ పేరుతో రీమేక్ చేశారు.

'అర్జున్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే బాలీవుడ్‌లోనూ డైరెక్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)