భారత్ వల్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాలపై అసలు లెక్కలు విడుదల చేయడం లేదా

కరోనా మరణాలు

ఫొటో సోర్స్, Getty Images

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో పెరుగుతోన్న కేసుల దృష్ట్యా కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. భారత్‌లో కూడా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి.

కరోనా మరణాల లెక్కింపులో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పాటించిన పద్ధతిపై భారత్ ప్రశ్నలు లేవనెత్తింది.

డబ్ల్యూహెచ్‌వో అనుసరించిన పద్ధతి భారత్‌ వంటి దేశానికి సరైనది కాదని శనివారం వ్యాఖ్యానించింది. పెద్ద సంఖ్యలో జనాభా నివసించే భారత్‌కు ఆ ఫార్ములా వాడకూడదని చెప్పింది.

కరోనా మరణాలు

ఫొటో సోర్స్, Getty Images

న్యూయార్క్ టైమ్స్‌లో ఆర్టికల్‌తో

నిజానికి, ఈ అంశంపై న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. కరోనా మరణాల కచ్చితమైన సంఖ్యను విడుదల చేయడంలో డబ్ల్యూహెచ్‌వోకు భారతదేశం సహకరించడం లేదని అందులో ఆరోపించింది.

దీని తర్వాత, దేశంలో కరోనా మరణాల సంఖ్య లెక్కింపు సంబంధించి భారత ఆరోగ్య శాఖ, డబ్ల్యూహెచ్‌వోకు ఆరు లేఖలు రాసింది.

ఈ అంశంపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలే చైనా, బంగ్లాదేశ్ కూడా వెలిబుచ్చాయి.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఏం చెప్పింది?

న్యూయార్క్ టైమ్స్ పత్రిక... '' ప్రపంచవ్యాప్త కోవిడ్ మరణాల సంఖ్యను వెల్లడించడానికి డబ్ల్యూహెచ్‌వో చేస్తోన్న ప్రయత్నాలను భారత్ ఆపుతోంది'' అనే శీర్షికతో ఏప్రిల్ 16న కథనాన్ని ప్రచురించింది.

కరోనా మహమ్మారి వల్ల 1.50 కోట్ల మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో తెలిపినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ అంచనా మునుపటి అంచనా కంటే చాలా ఎక్కువ. కానీ, ఇంకా దీన్ని విడుదల చేయలేదు.

''ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను లెక్కించే క్రమంలో మొత్తం మరణాల సంఖ్య, గతంలో వేసిన అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. కానీ, భారత్ వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాల రీత్యా కరోనా మరణాల తాజా నివేదికను మరికొన్ని నెలల పాటు విడుదల చేయలేని పరిస్థితి తలెత్తిందని'' ఆ కథనంలో పేర్కొన్నారు.

దీని తర్వాత భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. '' ఈ అంశంపై డబ్ల్యూహెచ్‌వోతో భారత్ నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. ఇరు వర్గాల మధ్య తరచుగా, లోతైన సాంకేతిక మార్పిడిలు జరుగుతున్నాయి'' అని ప్రకటనలో తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

భౌగోళిక పరిస్థితులు

''ఈ విశ్లేషణలో మరణాల సంఖ్యను టైర్ 1‌ కేటగిరీలో ఉన్న దేశాల ప్రకారం తీసుకున్నారు. ఆ దేశాలకు ఉపయోగించే గణన విధానాన్ని టైర్‌-2 దేశాలకు కూడా వినియోగించారు. భారత్, టైర్-2 కేటగిరీకి చెందిన దేశం. కరోనా మరణాల ఫలితాలపై భారత్ ఫిర్యాదు చేయట్లేదు. కేవలం వాటిని లెక్కించేందుకు అనుసరించిన పద్ధతినే మేం ప్రశ్నిస్తున్నాం'' అని భారత్ వ్యాఖ్యానించింది.

డబ్ల్యూహెచ్‌వోకు రాసిన ఆరు లేఖల్లో తమ ఆందోళనను భారత్ వ్యక్తపరిచింది. దీనితో పాటు చైనా, ఇరాన్, బంగ్లాదేశ్, సిరియా, ఇథియోపియా, ఈజిప్టు వంటి సభ్యదేశాలకు ఉపయోగించిన గణన పద్ధతిపై కూడా ప్రశ్నించింది.

భౌగోళిక స్థితి, జనసాంద్రతపై భారత్ ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేసింది.

''అతిపెద్ద భౌగోళిక విస్తీర్ణం, జనాభా ఉన్న భారత్‌ కోసం ఈ విధానాన్ని ఎలా ఉపయోగిస్తారు? ఈ విధానం తక్కువ జనాభా ఉండే చిన్న దేశాలకు సరిపోతుంది'' అని భారత్ లేఖలో పేర్కొంది.

''అదనపు మరణాలను అంచనా వేయడం కోసం... టైర్-1 దేశాల డేటాను, భారత్‌లోని 18 రాష్ట్రాలకు చెందిన ధ్రువీకృతం కాని డేటాను ఉపయోగిస్తే పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు వస్తాయి. ఇకవేళ ఈ విధానం పూర్తిగా విశ్వసనీయమైనదని మీరు భావిస్తే, దీన్ని టైర్-1 దేశాలకు వర్తింపజేసి వాటి ఫలితాలను ప్రచురించండి'' అని భారత్ వ్యాఖ్యానించింది.

కరోనా మరణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ విధానంలోని లోటుపాట్లు ఏంటి?

డబ్ల్యూహెచ్‌వో ఉపయోగించిన మోడల్‌లో ప్రతీ నెల ఉష్ణోగ్రతలకు, సగటు మరణాల రేటుకు మధ్య విలోమ సంబంధాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ, ఈ సంబంధాన్ని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

దీని ప్రకారం, భారత్‌లోని 18 రాష్ట్రాల డేటా ఆధారంగా దేశవ్యాప్తంగా మరణాల రేటును అంచనా వేయడం గణాంకాల పరంగా సరితూగలేదు.

భారతదేశ వ్యాప్తంగా ఏ సమయంలో కూడా కరోనా పాజిటివిటీ రేటు ఒకేలా లేదు.

అయితే, ఈ విషయమై డబ్ల్యూహెచ్‌వో నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రతిపక్షాల స్పందన

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ఈ విషయంలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ స్క్రీన్ షాట్‌ను ఆయన ట్వీట్ చేశారు.

''మోదీజీ నిజాలు మాట్లాడరు, ఇతరులను మాట్లాడనివ్వరు. ఆక్సీజన్ కొరత వల్ల ఎవరూ చనిపోలేదని ఆయన ఇప్పటికీ అబద్ధమే చెబుతారు. భారత్‌లో కరోనా వల్ల 5 లక్షలు కాదు... ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది మరణించారని నేను ముందే చెప్పాను. మోదీజీ మీ బాధ్యతను నిర్వర్తించండి. బాధిత కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించండి'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

సీనియర్ జర్నలిస్ట్ హిమానీ కూడా దీనిపై స్పందించారు. ''భారత ప్రభుత్వం ప్రకారం కరోనా మరణాలు 5.2 లక్షలు, అదే డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ఈ సంఖ్య 40 లక్షలు. భారత్‌లో అదనపు మరణాల సంఖ్యను తెలుసుకున్న న్యూయార్క్ టైమ్స్, ఇతర దేశాల మరణాలను అంచనా వేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది'' అని ఆమె ట్వీట్ చేశారు.

వీడియో క్యాప్షన్, ‘నాకు కరోనా వచ్చింది.. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)