అఖండ భారత్: ‘‘మోదీ కూడా పుతిన్‌లాగే ముందుకెళ్లాలి.. పీవోకే, సీవోకేలను భారత్‌లో కలిపేయాలి’’ - సోషల్ మీడియాలో డిమాండ్లు

మోదీ-పుతిన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, మేధావి అరోరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం, భారత్ కూడా అక్సాయ్ చిన్ (సీవోకే), పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లను అలానే వెనక్కితెచ్చుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

యుక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత్‌లో సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ దాడిని ఖండిస్తూ.. యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని పిలుపునిస్తున్నాయి.

మరికొందరు మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అడుగు జాడల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నడవాలని పిలుపునిస్తున్నారు.

పాకిస్తాన్ ఆధీనంలోనున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), చైనా ఆధీనంలోనున్న అక్సాయ్ చిన్‌లను సైనిక దాడి ద్వారా భారత్‌లో కలపాలని కొందరు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

మరికొందరైతే యుక్రెయిన్‌పై రష్యా దాడిని ‘‘అఖండ రష్యా’’ కోసమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతోపాటుగా అఖండ భారత్ మ్యాప్‌లను కూడా ట్వీట్ చేస్తున్నారు.

యుక్రెయిన్ సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

అఖండ భారత్ అంటే ఏమిటి?

అఖండ భారత్ అంటే.. చైనా, పాకిస్తాన్‌లోని వివాదాస్పద ప్రాంతాలతోపాటు భారత్ పొరుగునున్న దేశాలను కూడా భారత్‌లో కలిపి చూపించడం.

ఈ డిమాండ్‌ను ఇదివరకు కూడా బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు చాలాసార్లు చేశారు.

తాజాగా ఈ పేరు ఫేస్‌బుక్, ట్విటర్‌లలో మళ్లీ కనిపిస్తోంది. ట్విటర్‌లో కొన్ని వెరిఫైడ్ అకౌంట్ల నుంచి అఖండ భారత్ పేరుతో ట్వీట్లు చేస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో లక్షల మంది సభ్యులున్న గ్రూపులో దీనికి గురించి చర్చలు జరుగుతున్నాయి.

వీడియో క్యాప్షన్, రష్యాకు లొంగేదేలే: యుక్రెయిన్ అధ్యక్షుడు

ఆ పోస్టుల్లో ఏముంది?

మధ్య ప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ ఎంపీ హరి ఓం పాండే వెరిఫైడ్ అకౌంట్ నుంచి దీనిపై ఒక ట్వీట్ చేశారు. ఆయనకు ట్విటర్‌లో 80,000 మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బీజేపీ ఐటీ విభాగంలో పనిచేస్తున్న శివరాజ్ సింగ్ ఢాబి వెరిఫైడ్ అకౌంట్ నుంచి కూడా ఓ ట్వీట్ చేశారు. శివరాజ్‌కు 30,000 మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘‘యునైటెడ్ రష్యా కలను ఎలా సాకారం చేసుకోవాలో పుతిన్ మరోసారి చేసిచూపిస్తున్నారు. మాకు కూడా అఖండ భారత్ కావాలి. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు’’అని ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు 1,69,000కుపైగా ఫాలోవర్లు ఉన్న భావనా అరోరా కూడా ఓ పోస్టు చేశారు. ‘‘నాటో, ఐక్యరాజ్యసమితి బలమెంతో మనం చూశాం. ఇప్పుడు పీవోకేను వెనక్కి తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’అని ఆమె వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

‘‘పీవోకేను ఎలా వెనక్కి తెచ్చుకోవాలో మనకు ఇప్పుడు ఒక టెంప్లేట్ దొరికింది’’అని తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

మరోవైపు ఇనుము వేడిగా ఉన్నప్పుడే సుత్తితో కొట్టాలని మరో ట్విటర్ వినియోగదారుడు వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

ఇలాంటి వ్యాఖ్యలతోపాటు కొన్ని మీమ్‌లు కూడా ఆన్‌లైన్ షేర్ అవుతున్నాయి.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో దిక్కుతోచని స్థితిలో ప్రజలు

భారత్ ఖండించలేదు..

యుక్రెయిన్‌లో దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు.

హింసను విడిచిపెట్టి దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు దాడిని మోదీ ఖండించలేదు కూడా.

రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది.

యుక్రెయిన్‌పై రష్యా దాడిని పీవోకే, సీవోకేలతో పోలుస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల విషయానికి వస్తే.. ఇలా పోల్చడం కాస్త కష్టమే.

యుక్రెయిన్ సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకంటే 1990లలోనే యుక్రెయిన్ తమ అణ్వాయుధాలను విడిచిపెట్టేసింది. కానీ, ఇటు పాకిస్తాన్, అటు చైనా రెండు అణ్వాయుధ దేశాలే.

పీవోకే, సీవోకేలు భారత్‌లో అంతర్భాగమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, హోం మంత్రి అమిత్ షా సహా చాలా మంది భారత్ నాయకులు చాలా వేదికలపై పునరుద్ఘాటించారు.

ఇటు భారత్, అటు పాకిస్తాన్.. రెండు దేశాలూ కశ్మీర్ మొత్తం తమదేనని చెబుతుంటాయి. అయితే, కశ్మీర్‌లో కొంత భాగం రెండు దేశాల ఆధీనంలోనూ ఉంది.

కశ్మీర్‌ కోసం భారత్, పాకిస్తాన్ ఇప్పటివరకు రెండు యుద్ధాలకు దిగాయి. కానీ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు.

మరోవైపు తూర్పు లద్దాఖ్‌లో భాగమైన అక్సాయ్ చిన్‌.. చైనా పాలనలో ఉంది. ఇది వ్యూహాత్మకంగా చైనాకు చాలా ముఖ్యమైన ప్రాంతం. ఎందుకంటే పశ్చిమ టిబెట్‌తో షిన్‌జియాంగ్ ప్రాంతాన్ని ఇది అనుసంధానిస్తోంది.

వీడియో క్యాప్షన్, రష్యా-జర్మనీ మధ్య ఈ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ ఎందుకు?

ఈ రెండు సమస్యలను పోల్చగలమా?

పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు వివాదాలను యుక్రెయిన్‌పై రష్యా దాడితో పోల్చి చూడకూడదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఈ సమస్యలకు ఎలాంటి పోలికా లేదని వారు అంటున్నారు.

ఈ రెండు ప్రాంతాలకూ ఎలాంటి సారూప్యతాలేదని రక్షణ రంగ నిపుణుడు, మాజీ మేజర్ జనరల్ హర్ష్ కక్కర్ వ్యాఖ్యానించారు. ‘‘భద్రతా పరమైన కారణాలను సాకుగా చూపిస్తూ యుక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. కానీ, భారత్ విషయంలో అలాంటి భద్రతా పరమైన ముప్పులు కనిపిండం లేదు. అణ్వాయుధాలు, సైనిక శక్తి ఇలా విషయాల్లో ఈ రెండు సమస్యలకు భారీ తేడా ఉంది. పీవోకే లేదా సీవోకేలో యుద్ధ ట్యాంకులు తిరగాలని ఎవరూ కోరుకోరు’’అని ఆయన అన్నారు.

‘‘భారత ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లడం కంటే అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.’’

యుక్రెయిన్‌లో సమస్యకు దౌత్యం, చర్చలే పరిష్కారమని పుతిన్‌తో సంభాషణలో మోదీ కూడా నొక్కి చెప్పారు. యుక్రెయిన్ విషయంలో భారత్ విచారం వ్యక్తంచేసింది. కానీ, రష్యా దాడిని మాత్రం ఖండించలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

అయితే, భారత ప్రభుత్వ దౌత్యపరంగా భారీ తప్పును చేస్తోందని, దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేశారు. యుక్రెయిన్ గురించి నేరుగా స్పందించకుండా.. పాకిస్తాన్, చైనా, రష్యాలో వార్తలను ఆయన పోస్ట్ చేశారు.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)