INDvsNZ: న్యూజీలాండ్‌పై 372 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం - Newsreel

TeamIndia

ఫొటో సోర్స్, ICC

టీమిండియా న్యూజీలాండ్‌పై 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ముంబయిలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నాలుగో రోజునే భారత్ ఈ విజయం అందుకుంది.

దీంతో భారత్ 1-0 తేడాతో ఈ రెండు టెస్టుల సిరీస్ గెలుచుకుంది.

సోమవారం నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్ 140/5తో ఆట ప్రారంభించిన న్యూజీలాండ్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ భారత్ వశమైంది.

సోమవారం ఉదయం జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

అజాజ్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేయగా న్యూజీలాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలవుట్ అయింది.

అనంతరం న్యూజీలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 7 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

దీంతో 540 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజీలాండ్ 167 పరుగులకు ఆలవుట్ కావడంతో భారత్‌కు విజయం దక్కింది.

న్యూజీలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి ఆ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా కావడం.. రిచర్డ్ హాడ్లీని అశ్విన్ అధిగమించడం వంటివి ఈ మ్యాచ్‌లో రికార్డులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)