దుబయ్‌‌తో కశ్మీర్ ఒప్పందం.. పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ కానుందా?

జమ్ము కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై దుబయ్ ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ పాలకవర్గాలు సంతకం చేశాయి. నిత్యం హింస చెలరేగే జమ్మూ కశ్మీర్‌లో ఈ ఒప్పందం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

ఇది పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బలాంటిదని పాకిస్తాన్ దౌత్యవేత్తలు అంటున్నారు. ఇస్లామిక్ దేశమైన యూఏఈలో దుబయ్ కూడా ఒక భాగం. కశ్మీర్ అంశంలో, ఇస్లామిక్ సంబంధాలను జోడిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే, పాకిస్తాన్ ఇంతవరకు ఇందులో విజయం సాధించలేకపోయింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ బహిరంగంగా మద్దతు పలికినా, మిగిలిన దేశాలు మాత్రం నిరాశ పరిచాయి.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా పాకిస్తాన్‌ వాదనలకు యూఏఈ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత, కశ్మీర్‌లో పెట్టుబడులకు దుబయ్ ఒప్పందం కుదుర్చుకోవడం అంటే దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడం లాంటిదని భావిస్తున్నారు. ఇది పాకిస్తాన్‌కు వ్యూహాత్మక ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో దుబయ్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనుంది. వీటిలో ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ టవర్స్, మల్టీపర్పస్ టవర్, లాజిస్టిక్స్, మెడికల్ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఉన్నాయి.

అయితే, ఈ ఒప్పందం మొత్తం విలువ ఎంత అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.

దుబయ్ ఈ ఒప్పందంపై సంతకం చేసిందని వార్తా సంస్థ రాయిటర్స్ చెప్పింది. జమ్మూ కశ్మీర్‌కున్న స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత విదేశీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి.

ప్రకటనలో ఏం ఉంది?

జమ్మూ కశ్మీర్ అభివృద్ధి వేగంగా దూసుకుపోతున్నట్లు ప్రపంచం గుర్తిస్తోందనడానికి, దుబయ్ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూనే నిదర్శనమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.

"ఈ అవగాహన ఒప్పందం ప్రపంచం మొత్తానికి బలమైన సంకేతాన్ని పంపుతుంది. భారతదేశం ప్రపంచ శక్తిగా మారుతోంది. ఇందులో జమ్మూ కశ్మీర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది"

"ఈ ఎంఓయూ ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి అభివృద్ధి చేయడానికి భారీగా అవకాశాలు వస్తాయని తెలిపారు. దుబాయ్‌లోని వివిధ ప్రాంతాలు పెట్టుబడులపై ఆసక్తిని కనబరిచాయి. అన్ని వైపుల నుండి వృద్ధిని ఆశిస్తున్నాము. మేము సరైన మార్గంలో ఉన్నాము"

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు గోయల్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఇటీవల రూ.28,400 కోట్ల పారిశ్రామిక ప్యాకేజీ అభివృద్ధికి నిదర్శనమని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ ఎంఓయూ కేంద్రపాలిత ప్రాంతానికి ఓ సువర్ణావకాశమని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభివర్ణించారు. పారిశ్రామికీకరణ, స్థిరమైన అభివృద్ధిలో జమ్మూ కశ్మీర్‌ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు.

ఇదిలా ఉండగా, భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించిన ప్రాంతంలో పెట్టుబడులు ప్రమాదాలతో కూడుకున్నవని రాయిటర్స్ వార్తా సంస్థ రాసింది. ఇటీవలి కాలంలో పౌరులపై అనేక తీవ్రవాద దాడులు జరిగాయి. భద్రతా దళాలు ప్రతిగా ఆపరేషన్లు చేపట్టాయి. ఫలితంగా చాలా మంది మరణించారు.

ఒకదాని తర్వాత ఒకటిగా లక్ష్యంగా చేసుకుని జరిగిన అనేక హత్యల తర్వాత, సోమవారం, భారత పరిపాలన యంత్రాంగం వేలాది మంది వలస కార్మికులను కశ్మీర్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వందలాది మంది కార్మికులు కశ్మీర్‌ని విడిచిపెట్టి వెళ్లారు.

పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఏం అంటున్నారు?

భారత ప్రభుత్వం దీనిని ఒక పెద్ద విజయంగా చూస్తుండగా, ఈ ఘటనపైన పాకిస్తాన్‌ కూడా దృష్టిపెట్టింది. ఎందుకంటే రెండు దేశాలు కశ్మీర్‌పై తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి.

ఈ ఎంఓయూ వెలువడిన తర్వాత పాకిస్తాన్ నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ పాక్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మరోసారి కశ్మీర్ గురించి ట్వీట్ చేశారు.

భారత పాలిత కశ్మీర్‌లో నిరంతరాయంగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. "భారతదేశం ప్రాయోజిత ఉగ్రవాదం, క్రూరమైన సైనిక చర్యల వల్ల కశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడాలనే సంకల్పం విచ్ఛిన్నం కాబోదు" అని పేర్కొన్నారు. షా మెహమూద్ వాదనలకు పాకిస్తాన్ గట్టిగా మద్దతు ఇస్తుంది.

భారతదేశంలో పాకిస్తాన్ హై కమిషనర్‌గా గతంలో పనిచేసిన అబ్దుల్ బాసిత్, దుబయ్‌తో చేసుకున్న ఒప్పందం భారతదేశానికి ఒక పెద్ద విజయంగా అభివర్ణించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

జమ్మూ కశ్మీర్‌లో విదేశీ హై కమిషన్‌లను ఏర్పాటు చేయాలని, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇతర దేశాలను ఒప్పించడానికి భారతదేశం ఎల్లప్పుడూ ప్రయత్నించింది. తద్వారా ఓఐసీ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌)లో కశ్మీర్ సమస్యను బలహీనపరచవచ్చు అని భారత్ భావించింది అని బాసిత్ వ్యాఖ్యానించారు. .

"దుబయ్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. కానీ అది కేవలం ఎంఓయూ మాత్రమే కాబట్టి దానిపై ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు. జమ్మూ కశ్మీర్, పాకిస్తాన్‌ నేపథ్యంలో భారతదేశానికి ఇది గొప్ప విజయం" అని అబ్దుల్ బాసిత్ తన యూట్యూబ్ వీడియోలో చెప్పారు.

"ముస్లిం దేశాలు, ఓఐసీ సభ్య దేశాలు ఎల్లప్పుడూ పాకిస్తాన్, కశ్మీరీ మనోభావాల గురించి ఆందోళన చెందుతాయి. అయితే వీరు పాకిస్తాన్‌కు మద్దతుగాలేరని చూపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి"

"ఈ ఎంఓయూ అంశం మన చేజారిపోతోంది. నిజం ఏమిటంటే కశ్మీర్‌పై మాకు ఇప్పుడు ఎలాంటి విధానం లేదు. కశ్మీర్ పట్ల ప్రస్తుత పాక్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరి భవిష్యత్తుపై ఆందోళన కలిగించేలా ఉంది. గత ప్రభుత్వాలు కూడా కశ్మీర్‌పై విధానాలను బలహీనపరచడంలో ఏమాత్రం తీసిపోలేదు"

అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ కశ్మీర్ సమస్యకు పరిష్కారం అనేది భారత్, పాకిస్తాన్ ఇద్దరి చేతుల్లో ఉంది. అయితే పాకిస్తాన్ ఏకపక్షంగా భారతదేశానికి అన్నీ అప్పజెప్పుతుందా అనేదే ప్రశ్న.

"ఈ ఎంఓయూ కుదిరింది. రేపు యూఏఈ, ఇరాన్ కూడా కశ్మీర్‌లో తమ కాన్సులేట్‌ను తెరిచే అవకాశం ఉంది. మన దౌత్యం ఇలాగే ఉంటే, రేపు ఏదైనా జరగవచ్చు"

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

దీనితో పాటు, అఫ్గానిస్తాన్‌కు సంబంధించి పాకిస్తాన్ దౌత్యంపై బాసిత్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఒకప్పుడు పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ సమస్యపై విజయం సాధించినట్లు అనిపించిందని, కానీ ఇప్పుడు అంత మెరుగ్గా లేనట్టు అనిపిస్తుందని ఆయన అన్నారు.

"అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ రాజీనామా చేశారు. అమెరికా మాస్కో ఫోరమ్‌కు వెళ్లడం లేదు. తాలిబాన్లను గుర్తించే విషయం కూడా చల్లబడింది. ఇదే అంశంపై పాకిస్తాన్ ఏమీ చేయడం లేదు"

"పాకిస్తాన్ ఏ సమస్యను సక్రమంగా పరిష్కరించలేకపోయింది. మేము జమ్మూ కశ్మీర్‌పై డాక్యుమెంట్‌ను సమర్పించాము. కానీ దానితో ఏమి జరగలేదు. ప్రతీది ఒక చెవితో విని మరో చెవితో వదిలేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఫాలో అప్‌ చేయడంలో చాలా బలహీనంగా ఉన్నాము. ఇది మా ప్రాథమిక సమస్య. కశ్మీర్, అఫ్గానిస్తాన్, చైనాలో మనం కోరుకున్న ఫలితాలను సాధించలేకపోవడానికి ఇతర ఏ కారణం లేదు"

భారతదేశం, పాకిస్తాన్ మధ్య యూఏఈ పాత్ర

ఓఐసీలో ముస్లిం దేశాలు కశ్మీర్ సమస్యను లేవనెత్తుతున్నాయి. కానీ అన్ని ముస్లిం దేశాలు శాంతియుత పరిష్కారానికి మొగ్గు చూపుతున్నాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలుగజేసుకుని వాటిని తగ్గించడానికి ప్రయత్నించింది.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, అమెరికాలోని యూఏఈ రాయబారి యూసుఫ్ అల్-ఒటైబా మాట్లాడుతూ.. భారతదేశం, పాకిస్తాన్ మధ్య మంచి సంబంధాలను నెలకొల్పడానికి యూఏఈ ప్రయత్నిస్తోందని చెప్పారు.

వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఒటైబా స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఇండియా, పాకిస్తాన్ ఉన్నత స్థాయి అధికారుల మధ్య జనవరిలో చర్చలు జరిగాయి.

కశ్మీర్‌లో ఉద్రిక్తతలను తగ్గించడం, కాల్పుల విరమణను అమలు చేయడంలో యూఏఈ ప్రముఖ పాత్ర పోషిస్తోందని, సంబంధాలు ఆరోగ్యకరమైన స్థాయికి తిరిగి వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

"వారు మంచి స్నేహితులు కాకపోవచ్చు, కానీ కనీసం వారు ఒకరితో ఒకరు చర్చించుకునేలా మంచి సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మేము కోరుకుంటున్నాము."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)