ప్రకాశ్‌రాజ్ - మా ఎన్నికలు: 'నేను తెలుగు బిడ్డను కాదన్నారు అందుకే రాజీనామా చేస్తున్నా' - Newsreel

ప్రకాశ్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు.

ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని, అతిథిగానే వచ్చాను, అతిథిగానే ఉంటానని ఆయన చెప్పారు.

ఓటమిని జీర్ణించుకున్నాను కాబట్టే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలుగు బిడ్డను ఎన్నుకున్నారని, తెలుగు వ్యక్తే 'మా' అధ్యక్షునిగా ఉండాలని సభ్యులు కోరుకున్నారని ఆయన చెప్పారు.

"నేను తెలుగు బిడ్డను కాదన్నారు కాబట్టే రాజీనామా చేస్తున్నాను. ఇలాంటి ఐడియాలజీ ఉన్న అసోసియేషన్‌లో ఉండి పని చేయలేను, అవసరమైతే బయట ఉండి పని చేస్తాను. రాజకీయ సపోర్ట్ అవసరం లేదనుకున్నాను, కానీ అవసరం ఉందని నిరూపించారు. దీంతో అయిపోలేదు, అలా మొదలయ్యింది కాదు, ఇప్పుడే మొదలయ్యింది" అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, 'నేను తెలుగు బిడ్డను కాదన్నారు అందుకే 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా'

అయితే, తెలుగు సినిమాల్లో నటిస్తుంటానని, వారితో కలిసి పని చేస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మా సభ్యత్వం లేకపోతే నన్ను నటించేందుకు అనుమతించరా? అని ఆయన ప్రశ్నించారు.

'మా' తో తనకు 21 ఏళ్ల అనుబంధం ఉందని 'మా' ఎన్నికల ఫలితాలపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన అన్నారు.

ప్రాంతీయతగానే ఎన్నికలు జరిగాయి. ఇలాంటి(ప్రాంతీయత) ఎజెండాతో ఉన్నఅసోసియేషన్‌లో నేను ఉండలేను. అబద్దాలు చెప్పలేను. అలాంటి వాతావరణంలో ఉండలేను అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, మా ఎన్నికల్లో చర్చకు రావాల్సిన అంశాలేంటి.. చర్చిస్తున్నదేంటి? - వీక్లీ షో విత్ జీఎస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)