పాకిస్తాన్‌లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్

అక్టోబర్ 2 నుంచి 8 వరకు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన ఫొటోలివి.

లావా కక్కుతున్న స్పెయిన్ కానరీ దీవుల్లోని ఒక అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, Carlos De Saa / EPA

ఫొటో క్యాప్షన్, స్పెయిన్ కానరీ దీవుల్లోని లా పామా ఐలాండ్‌లో కుంబ్రె వీజా అగ్నిపర్వతం బద్ధలైంది. దాని నుంచి వెలువడుతున్న లావా సమీపంలోని వందలాది ఇళ్లను నేటమట్టం చేసింది. ఆరు వేల మందిని నిరాశ్రయులను చేసింది. వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ అగ్నిపర్వతం సెప్టెంబర్ 19 నుంచి లావాను వెదజల్లుతోంది.
Transparent line
అక్టోబర్ 7న పాకిస్తాన్ లో వచ్చిన భూకంపం

ఫొటో సోర్స్, Banaras Khan / AFP

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో భూకంపం మిగిల్చిన విషాదం ఇది. అక్టోబర్ 7న 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పాకిస్తాన్‌లోని హర్నాయ్ జిల్లాలో పలు ఇళ్లు కూలిపోయాయి. కూలిన ఒక ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా తీసిన ఫొటో ఇది. ఈ భూకంపంలో 20 మంది చనిపోగా, 300 మంది గాయపడ్డారు.
Transparent line
Transparent line
భారత్‌లోని అమృత్‌సర్‌లో రోడ్డు పక్కన యోగా చేస్తున్న ఒక వ్యక్తి

ఫొటో సోర్స్, Narinder Nanu / AFP

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని అమృత్‌సర్‌లో రోడ్డు పక్కన యోగా చేస్తున్న ఒక వ్యక్తి
Transparent line
ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి

ఫొటో సోర్స్, Jabin Botsford / Pool via Getty Images

ఫొటో క్యాప్షన్, భద్రత కంటే అభివృద్ధికే ఫేస్‌బుక్‌ ప్రాధాన్యం ఇచ్చిందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ చెప్పారు. ఫేస్‌బుక్‌కు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను తానే లీక్ చేశానని అన్నారు. వాషింగ్టన్ డీసీలోని కాపిటిల్ హిల్‌లో ఇంటర్నెట్ భద్రతపై విచారణ సందర్భంగా ఆమె తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అప్పుడు తీసిన ఫొటో ఇది. అయితే, ఈ లీకులు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఫేస్‌బుక్ పేర్కొంది.
Transparent line
బెంగాల్ టైగర్

ఫొటో సోర్స్, Ulises Ruiz / AFP

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది ప్రారంభంలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన బెంగాల్ టైగర్ ఇది. మెక్సికోలో జెలిస్కో రాష్ట్రంలోని గ్వాడలజారా జూలో ఇలా ఫొటోకు చిక్కింది.
Transparent line
రష్యా నటి యులియా

ఫొటో సోర్స్, Sergei Savostyanov \ TASS via Getty Images

ఫొటో క్యాప్షన్, కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్‌కు బయలుదేరి వెళ్తున్నప్పుడు రష్యా నటి యులియా పెరెలిల్డ్ ఇలా బస్సు నుంచి ముద్దు పెట్టారు. సోయుజ్ ఎంఎస్-19 అంతరిక్ష నౌకలో ఈమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఒక సినిమా కోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
Transparent line
రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి సహ విజేత బెంజమిన్ లిస్ట్‌

ఫొటో సోర్స్, Ina Fassbender / AFP

ఫొటో క్యాప్షన్, రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి సహ విజేత బెంజమిన్ లిస్ట్‌ను జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ సహచరులు అభినందిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, స్కాట్లాండ్‌కు చెందిన డెవిడ్ మెక్‌ మిలన్‌లకు సంయుక్తంగా ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.
Transparent line
చైనీస్ ఒపెరా సభ్యులు

ఫొటో సోర్స్, ATHIT PERAWONGMETHA / REUTERS

ఫొటో క్యాప్షన్, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో చైనీస్‌ ఒపెరా బృంద సభ్యులు రిహార్సల్స్ చేస్తుండగా తీసిన ఫొటో ఇది. బ్యాంకాక్‌లో వెజిటేరియన్ ఫెస్టివల్ కోసం వీళ్లు రిహార్సల్స్ చేస్తున్నారు. అయితే, కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఇలా మాస్కులు ధరించారు.
బ్యాట్‌మ్యాన్

ఫొటో సోర్స్, Alexi Rosenfeld / Getty Images

ఫొటో క్యాప్షన్, 2020లో కరోనావైరస్‌ కారణంగా రద్దయిన పాప్ కల్చర్ కన్వెన్షన్‌ను ఈ ఏడాది తిరిగి నిర్వహిస్తున్నారు. బ్యాట్‌మ్యాన్ డ్రెస్ వేసుకుని న్యూయార్క్‌లోని కామిక్ కాన్ దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తి ఇలా ఫొటోకు చిక్కారు.

అక్టోబర్ 2 నుంచి 8 వరకు జరిగిన సంఘటనల చిత్రమాలిక ఇది.