కల్యాణ్ సింగ్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

కల్యాణ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్ శనివారం రాత్రి మరణించారు.

తీవ్ర అనారోగ్యం పాలైన ఆయనను జులై 4న లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేర్పించారు.

సుదీర్ఘ కాలం పాటు అనారోగ్యంతో బాధపడిన ఆయన అవయవాలు వైఫల్యం కావడంతో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సీనియర్ బీజేపీ నాయకుడైన ఆయన రెండు సార్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారు.

కల్యాణ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

బాబ్రీ కేసులో ఆరోపణలు

బాబ్రీ కూల్చివేత సమయంలో కరసేవకులను కావాలనే పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

మసీదు కూల్చివేతకు కుట్ర పన్నినట్లు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న 13 మందిలో కల్యాణ్ సింగ్ కూడా ఒకరు.

ఆ తర్వాత కాలంలో ఆయన బీజేపీ నుంచి వేరుపడి, రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు. కొంతకాలానికి మళ్లీ బీజేపీ గూటికే చేరారు.

హిందూ నాయకుడిగా పేరు

హిందూ నాయకుడిగా కల్యాణ్ సింగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ హవా నడుస్తున్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

మొదట జన సంఘ్, ఆ తర్వాత జనతా పార్టీ, చివరగా బీజేపీలోనూ ఆయన పనిచేశారు.

1935 జనవరి 5న అలీగఢ్‌ జిల్లాలోని మధౌలీలో ఆయన జన్మించారు. చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరారు.

ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం ఆయన టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)