మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ

మోదీ మంత్రిమండలిలో మహిళా మంత్రులు దర్శన జర్దోష్, ప్రతిమ భౌమిక్, శోభ కరంద్లాజె, స్మృతి ఇరానీ, నిర్మల సీతారామన్, భారతి పవార్, మీనాక్షి లేఖి, అనుప్రియ పటేల్, అన్నపూర్ణ దేవి

ఫొటో సోర్స్, NirmalaSitharaman

ఫొటో క్యాప్షన్, మోదీ మంత్రిమండలిలో మహిళా మంత్రులు దర్శన జర్దోష్, ప్రతిమ భౌమిక్, శోభ కరంద్లాజె, స్మృతి ఇరానీ, నిర్మల సీతారామన్, భారతి పవార్, మీనాక్షి లేఖి, అనుప్రియ పటేల్, అన్నపూర్ణ దేవి.

తాజా విస్తరణతో కేంద్ర మంత్రి మండలి స్వరూపంలో అనేక మార్పులొచ్చాయి. పెద్ద సంఖ్యలో కొత్త మంత్రులు రావడమే కాకుండా ఇప్పటికే ఉన్న మంత్రులలోనూ కొందరికి శాఖలు మారాయి. ఇప్పటి వరకు స్వతంత్ర హోదా, సహాయ మంత్రి హోదాలో ఉన్న కొందరికి కేబినెట్ మంత్రి హోదా దక్కింది.

విస్తరణకు ముందు మోదీ మంత్రి మండలిలో 53 మంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 77కి చేరింది. బుధవారం 43 మంది ప్రమాణ స్వీకారం చేయగా అందులో 36 మందిని కొత్తగా మంత్రి మండలిలోకి తీసుకున్నారు.

పాతవారిలో ముగ్గురు సహాయ మంత్రులు, నలుగురు స్వతంత్ర మంత్రులకు కేబినెట్‌లో స్థానం కల్పించారు.

ఇలా ప్రమోషన్ అందుకున్నవారిలో తెలంగాణకు చెందిన జి.కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకుర్, ఆర్.కె.సింగ్, హర్‌దీప్ సింగ్ పురి, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా ఉన్నారు.

కొత్తగా మంత్రులైనవారిలో అస్సాంకు చెందిన సర్వానంద్ సోనోవాల్, తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్ ప్రస్తుతం పార్లమెంటు సభ్యులుగా లేరు.

కాగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ, సుసంపన్నమైన భారత దేశ నిర్మాణానికి కలిసి పనిచేద్దామన్నారు.

కేంద్ర మంత్రి మండలి తాజా స్వరూపం ఇదీ..

కేబినెట్

నరేంద్ర మోదీ: ప్రధాన మంత్రి

రాజ్‌నాథ్ సింగ్: రక్షణ శాఖ

అమిత్ షా: హోం, సహకార

నిర్మల సీతారామన్: ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు

ఎస్.జయశంకర్: విదేశీ వ్యవహారాలు

నితిన్ గడ్కరీ: రహదారి రవాణా, జాతీయ రహదారులు

నరేంద్ర సింగ్ తోమర్: వ్యవసాయం, రైతుల సంక్షేమం

ప్రహ్లాద్ జోషి: పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనులు

గజేంద్ర సింగ్ షెకావత్: జల శక్తి

స్మృతి ఇరానీ: మహిళ, శిశు సంక్షేమం

పీయుష్ గోయల్: వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, జౌళి

అర్జున్ ముండా: గిరిజన వ్యవహారాలు

ధర్మేంద్ర ప్రధాన్: విద్య, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికం

నారాయణ్ రాణె: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు

సర్వానంద్ సోనోవాల్: ఓడ రేవులు, నౌకాయానం, జలమార్గాలు, ఆయుష్ శాఖ

ముఖ్తార్ అబ్బాస్ నక్వీ: మైనారిటీ వ్యవహారాలు

వీరేంద్ర కుమార్: సామాజిక న్యాయం, సాధికారత

గిరిరాజ్ సింగ్: గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్

జ్యోతిరాదిత్య సింథియా: పౌర విమానయానం

రామచంద్ర ప్రసాద్ సింగ్: ఉక్కు

అశ్విని వైష్ణవ్: రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్

పశుపతి కుమార్ పారస్: ఆహార శుద్ధి పరిశ్రమలు

కిరణ్ రిజిజు: న్యాయ శాఖ

రాజ్ కుమార్ సింగ్: విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు

హర్‌దీప్ సింగ్ పురి: పెట్రోలియం, సహజవాయువు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం

మాన్‌సుఖ్ మాండవీయ: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు

భూపేందర్ యాదవ్: పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, కార్మిక, ఉపాధి

మహేంద్రనాథ్ పాండే: భారీ పరిశ్రమలు

పురుషోత్తం రూపాలా: మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ

జి.కిషన్ రెడ్డి: సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి

అనురాగ్ ఠాకుర్: సమాచార, ప్రసార శాఖలు, క్రీడలు, యువజన వ్యవహారాలు

స్వతంత్ర హోదా సహాయ మంత్రులు

రావ్ ఇంద్రజిత్ సింగ్: ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు(స్వతంత్ర హదా). కార్పొరేట్ వ్యవహారాలు(సహాయ హోదా)

జితేంద్ర సింగ్: శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, భూవిజ్ఞాన శాస్త్రం(స్వతంత్ర హోదా).

ప్రధాని కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం(సహాయ హోదా)

సహాయ మంత్రులు

శ్రీపాద యశో నాయక్: ఓడ రేవులు, నౌకాయానం, జల మార్గాలు, పర్యటకం

ఫగన్ సింగ్ కులస్థె: ఉక్కు, గ్రామీణాభివృద్ధి

ప్రహ్లాద్ సింగ్ పటేల్: జల్ శక్తి, ఆహార శుద్ధి పరిశ్రమలు

అశ్విని కుమార్ చౌబె: పర్యావరణం, అడవులు, వాతావరణ శాఖ

అర్జున్ రామ్ మేఘ్‌వాల్: పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతికం

వీకే సింగ్: రహదారి రవాణా, జాతీయ రహదారులు, పౌర విమానయానం

క్రిషన్ పాల్: విద్యుత్, భారీ పరిశ్రమలు

దన్వే రావ్ సాహెబ్ దాదా రావ్: రైల్వే, బొగ్గు గనులు

రామ్‌దాస్ అథావలె: సామాజిక న్యాయం, సాధికారత

సాధ్వి నిరంజన్ జ్యోతి: వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి

సంజీవ్ కుమార్ బాల్యాన్: మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ

నిత్యానంద్ రాయ్: హోం

పంకజ్ చౌదరి: ఆర్థిక

అనుప్రియ పటేల్: పరిశ్రమలు, వాణిజ్యం

ఎస్.పి.సింగ్ బఘేల్: న్యాయ

రాజీవ్ చంద్రశేఖర్: నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికం, ఎలక్ట్రానిక్స్, ఐటీ

శోభ కరంద్లాజె: వ్యవసాయం, రైతుల సంక్షేమం

భానుప్రతాప్ సింగ్ వర్మ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు

దర్శన విక్రమ్ జర్దోస్: జౌళి, రైల్వే

వి.మురళీధరన్: విదేశీ వ్యవహారాలు

మీనాక్షి లేఖి: విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక

సోమ్ ప్రకాశ్: వాణిజ్యం, పరిశ్రమలు

రేణుక సింగ్ సరూతా: గిరిజన వ్యవహారాలు

రామేశ్వర్ తేలి: పెట్రోలియం, సహజ వాయు, కార్మక ఉపాధి

కైలాస్ చౌదరి: వ్యవసాయం, రైతుల సంక్షేమం

అన్నపూర్ణ దేవి: విద్య

ఎ.నారాయణస్వామి: సామాజిక న్యాయం, సాధికారత

కౌశల్ కిశోర్: గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి

అజయ్ భట్: రక్షణ, పర్యటకం

బీఎల్ వర్మ: ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార

అజయ్ కుమార్: హోం

దేవ్ సిన్హా చౌహాన్: కమ్యూనికేషన్స్

భగవంత కుబ: ఎరువులు, రసాయనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు

కపిల్ మోరేశ్వర్ పాటిల్: పంచాయతీ రాజ్

ప్రతిమ భౌమిక్: సామాజిక న్యాయం, సాధికారత

సుభాష్ సర్కార్: విద్య

భగవత్ కిషన్ రావ్ కరాడ్: ఆర్థిక

రాజ్ కుమార్ రంజన్ సింగ్: విదేశీ వ్యవహరాలు, విద్య

భారతి ప్రవీణ్ పవార్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

విశ్వేశ్వర్ టుడు: గిరిజన వ్యవహారాలు జలశక్తి

శంతన్ ఠాకుర్: ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాలు

ముంజపర మహేంద్రబాయి: మహిళ, శిశు సంక్షేమం, ఆయుష్

జాన్ బార్ల: మైనారిటీ వ్యవహారాలు

ఎల్. మురుగన్: మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, సమాచారచ, ప్రసార

నిశిత్ ప్రామాణిక్: హోం, యువజన వ్యవహారాలు, క్రీడలు

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కొత్తగా స్థానం సంపాదించిన వారు వీరే:

  • నారాయణ్ తాటు రాణె
  • సర్బానంద్ సోనోవాల్
  • డాక్టర్ వీరేంద్ర కుమార్
  • జ్యోతిరాదిత్య ఎం. సింధియా
  • రామచంద్ర ప్రసాద్ సింగ్
  • అశ్వినీ వైష్ణవ్
  • పశుపతి కుమార్ పరాస్
  • కిరెణ్ రిజిజు
  • రాజ్‌కుమార్ సింగ్
  • హర్దీప్‌ సింగ్ పురి
  • మన్‌సుఖ్ మాండవీయ
  • భూపేందర్ యాదవ్
  • పర్షోత్తమ్ రూపాలా
  • జి.కిషన్ రెడ్డి
  • అనురాగ్ సింగ్ ఠాకూర్
  • పంకజ్ చౌదరి
  • అనుప్రియా సింగ్ పటేల్
  • సత్యపాల్ సింగ్ బఘెల్
  • రాజీవ్ చంద్రశేఖర్
  • శోభ కరంద్లాజె
  • భాను ప్రతాప్ సింగ్ వర్మ
  • దర్శన విక్రమ్ జార్దోష్
  • మీనాక్షి లేఖి
  • అన్నపూర్ణాదేవి
  • నారాయణ స్వామి
  • కౌషల్ కిశోర్
  • అజయ్ భట్
  • బి.ఎల్. వర్మ
  • అజయ్ కుమార్
  • చౌహాన్ దేవుసిన్హ్
  • భగవంత్ ఖుబా
  • కపిల్ మోరేశ్వర్ పాటిల్
  • ప్రతిమా భౌమిక్
  • సుభాష్ సర్కార్
  • భగవత్ కిషన్ రావ్ కరాడ్
  • డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్
  • భారతీ ప్రవీణ్ పవార్
  • బిశ్వేశ్వర్ తుడు
  • శంతను ఠాకూర్
  • ముంజ్‌పార మహేంద్రభాయ్
  • జాన్ బర్లా
  • ఎల్. మురుగన్
  • నిశిత్ ప్రమాణిక్

అందరూ ఊహించినట్లుగానే జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద్ సోనోవాల్, అనుప్రియా సింగ్ పటేల్‌లాంటి పలువురు నేతలకు మంత్రి వర్గంలో స్థానం దక్కింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

జి.కిషన్ రెడ్డి

గంగాపురం కిషన్ రెడ్డి బీజేపీలో అనేక హోదాల్లో పనిచేశారు. జనతా పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా, ఆ వెంటనే బీజేపీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో చేరారు.

1982 నుంచి 2001 వరకు దాదాపు 20 ఏళ్ల పాటూ బీజేపీ యువజన విభాగంలో వివిధ హోదాల్లో ఉన్నారు కిషన్ రెడ్డి.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తరువాత, ఒడిశా బీజేపీ ప్రముఖ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కంటే ముందు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు.

2002-2005 మధ్య ఆయన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా, 2001 నుంచి బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

కిషన్ రెడ్డి

ఫొటో సోర్స్, G Kishan Reddy/twitter

ఫొటో క్యాప్షన్, కిషన్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి రెండు సార్లు, తెలంగాణకు ఒకసారి రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. 2010-2014 వరకు ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు, 2014-16 తెలంగాణకు ఒకసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.

2004లో మొదటిసారి హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రాష్ట్ర విభజన తరువాత 2014లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం అంబర్‌పేట నుంచి టీఆరెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. అప్పటి వరకు ఆ స్థానంలో బండారు దత్తాత్రేయ ఉండేవారు. మోదీ కేబినెట్‌లో హోం శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తరువాత తెలంగాణ అసెంబ్లీల్లో బీజేపీ పక్ష నేతగా కిషన్ రెడ్డి వ్యవహరించారు. 2004-10, 2016-2018 మధ్య ఆయన శాసనసభా పక్ష నేతగా ఉన్నారు.

రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపురంలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన కిషన్ రెడ్డి, ఇంటర్ తరువాత హైదరాబాద్ బాలానగర్ టూల్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్లో డిప్లొమా చేశారు.

ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటూ చదువు కొనసాగించి కేంద్ర మంత్రి వరకు ఎదిగారు.

జ్యోతిరాదిత్య సింధియా

ఫొటో సోర్స్, JYOTIRADITYA M SCINDIA @FACEBOOK

ఫొటో క్యాప్షన్, జ్యోతిరాదిత్య సింధియా

జ్యోతిరాదిత్య సింధియా

కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా గత ఏడాది మార్చిలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బీజేపీలో చేరారు. అయితే, మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం వల్లే ఆయన బీజేపీలోకి వచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. సింధియా కాంగ్రెస్‌ను వీడటంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం అయ్యింది.

దివంగత కాంగ్రెస్ నేత మాధవ్ రావ్ సింధియా కుమారుడైన జ్యోతిరాదిత్య సింధియాకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీల వారసత్వం ఉంది. జ్యోతిరాదిత్య సింధియా నాయనమ్మ విజయ రాజె సింధియా జనసంఘ్, ఆ తర్వాత బీజేపీలో పని చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

2002 నుంచి 2019 వరకు ఎంపీగా పని చేసిన ఆయన, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు. 2019లో గుణ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ద డూన్ స్కూల్, హార్వర్డ్ కాలేజ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో జ్యోతిరాదిత్య చదువుకున్నారు. ఆయనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు.

సర్బానంద సోనోవాల్

ఫొటో సోర్స్, Sarbananda Sonowal

ఫొటో క్యాప్షన్, సర్బానంద సోనోవాల్

సర్బానంద సోనోవాల్

2011లో బీజేపీలో చేరిన అస్సామీ నేత సర్బానంద సోనోవాల్ మరుసటి సంవత్సరమే భారతీయ జనతా పార్టీ అస్సాం శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

2014లో బీజేపీ అభ్యర్ధిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మోదీ మొదటి దఫా ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పని చేశారు.

2016లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఆయన అస్సాం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. అస్సాంకు తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుల కెక్కారు.

మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు స్థానం లభిస్తుందని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లుగానే ఆయనకు మంత్రి పదవి దక్కింది.

Shobha Karandlaje

ఫొటో సోర్స్, Shobha Karandlaje

ఫొటో క్యాప్షన్, శోభ కరంద్లాజె

శోభ కరంద్లాజె

ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కన్నడ నేత శోభ కరంద్లాజె 1994 నుంచి కర్నాటక బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. దక్షిణ కర్నాటకలోని పుత్తూరులో పుట్టిన ఆమె, చిన్నతనంలోనే ఆరెస్సెస్‌లో చేరారు.

ప్రస్తుతం కర్నాటక బీజేపీ ఉపాధ్యక్షురాలిగా శోభ పని చేస్తున్నారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో ఉడిపి చిక్‌మగళూరు నియోజకవర్గం నుంచి ఆమె వరసగా రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

2008-2009, 2010-2012 మధ్య కాలంలో ఆమె యడ్యూరప్ప మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అత్యంత సన్నిహిత నేతల్లో ఆమె ఒకరని చెబుతారు.

బీజేపీ నుంచి విడిపోయి యడ్యూరప్ప ఏర్పాటు చేసిన కర్నాటక జనతా పక్ష పార్టీలో కూడా ఆమె చేరారు. 2014లో కర్నాటక జనతా పక్ష పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది. ప్రజాసేవ కోసం తాను వివాహం చేసుకోవడం లేదని ప్రకటించిన శోభ, సోషియాలజీలో ఎం.ఏ చేశారు.

కిరణ్ రిజుజు

ఫొటో సోర్స్, Kiren Rijiju

ఫొటో క్యాప్షన్, కిరణ్ రిజుజు

కిరణ్ రిజిజు

ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్న కిరణ్‌ రిజిజు అరుణాచల్ ప్రదేశ్‌ నుంచి వచ్చిన బీజేపీ యువ నాయకుడు.

యూత్ లీడర్‌గా స్కూల్, కాలేజీ రోజుల నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు కిరెణ్ రిజిజు. ఆటల్లోనూ ప్రతిభ చూపిన రిజిజు నేషనల్ గేమ్స్‌లో కూడా పాల్గొన్నారు.

యువజన నాయకుడిగా అనేక దేశాలు సందర్శించిన ఆయన, 14వ లోక్‌సభలో అత్యంత చురుకుగా వ్యవహరించిన ఎంపీగా పేరు తెచ్చుకున్నారు.

2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన 2004 జనరల్ ఎలక్షన్లలో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

2014లో రెండోసారి గెలిచిన ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన క్రీడలు, యువజన వ్యవహారాల శాఖను, మైనారిటీ వ్యవహారాల శాఖను చూస్తున్నారు.

బి.ఎ, ఎల్.ఎల్.బి. చదివిన కిరెణ్ రిజిజు దిల్లీ యూనివర్సిటీ విద్యార్ధి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)