జమ్మూ-కశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ సమావేశం...రాష్ట్ర హోదా, ఎన్నికల నిర్వహణపైనే ప్రధాన చర్చ

జమ్మూ-కశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి చర్చలు జరిపారు.

ఫొటో సోర్స్, TWITTER @PMOINDIA

ఫొటో క్యాప్షన్, జమ్మూ-కశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి చర్చలు జరిపారు.

జమ్మూ-కశ్మీర్‌ కు చెందిన 14మంది అఖిలపక్ష నాయకులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం చర్చలు జరిపారు. సుమారు 3 గంటలపాటు ఈ సమావేశం జరిగింది.

దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతోపాటు జమ్మూ-కశ్మీర్‌ కు చెందిన సీనియర్ డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ గుప్కార్ కూటమి నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గురువారం నాటి సమావేశంపై ప్రధాన మంత్రి స్పందించారు. జమ్మూ-కశ్మీర్ అభివృద్ధిలో ఈ సమావేశం కీలకమైన ఘట్టమని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అఖిలపక్ష నాయకులతో ప్రధానమంత్రి మోదీ చర్చలు

ఫొటో సోర్స్, TWITTER @PMOINDIA

ఫొటో క్యాప్షన్, అఖిలపక్ష నాయకులతో ప్రధానమంత్రి మోదీ చర్చలు

’’ఇవాళ జరిగిన చర్చల సందర్భంగా నేతలందరూ జమ్మూ-కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పాలనపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు’’ అని సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.

నియోజక వర్గాల పునర్విభజన, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణతోనే ఇది సాధ్యమవుతుందని అమిత్ షా అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ సమావేశంలో స్వాగతోపన్యాసం చేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, గత రెండేళ్లలో జమ్మూ కాశ్మీర్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివరిగా ప్రధానమంత్రి మాట్లాడారు.

''ఆర్ధికంగా జమ్మూకశ్మీర్ అభివృద్ధి గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రభుత్వం మాట్లాడింది. ఆర్టికల్ 370 అంశం కోర్టులో ఉన్నందున దాని ప్రస్తావన రాలేదు'' అని జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి ముజఫర్ బేగ్ వెల్లడించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులందరూ జమ్మూ-కశ్మీర్‌ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్‌ చేశారని ముజఫర్ బేగ్ వెల్లడించినట్లు పీటీఐ పేర్కొంది. ఇక్కడ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహించాలన్న దానిపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయానికి రాలేదని కూడా ఆయన తెలిపినట్లు పీటీఐ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

జమ్మూ-కశ్మీర్‌లో శాంతి నెలకొనేందుకు కావాల్సినది ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాన మంత్రి చెప్పారని ముజఫర్ బేగ్ వెల్లడించారు.

అయిదు ప్రధాన డిమాండ్లతో తాము ఈ సమావేశానికి హాజరయ్యామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, ఎన్నికలు నిర్వహించడం, కశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించడం, రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించడం అనే డిమాండ్లను ప్రధాని మంత్రి ముందు ఉంచినట్లు గులాం నబీ ఆజాద్ వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

''జమ్మూకశ్మీర్ ఉజ్వల భవిష్యత్తు గురించి సమావేశంలో చర్చించారు. నాయకులందరూ ఎన్నికల గురించి చర్చించారు. డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతాయని ప్రధాని హామీ ఇచ్చారు''అని బీజేపీ నేత కవిందర్ గుప్తా అన్నారు.

''ఈ చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. ప్రధానమంత్రి మేం చెప్పిన సమస్యలను శ్రద్ధగా విన్నారు. నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు'' అని సమావేశం అనంతరం జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలకు అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలకు అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి మోదీ

జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించాల్సిన అవసరమేమి వచ్చిందో , దానివల్ల దేశానికి వచ్చిన లాభమేంటో అర్ధం కావడం లేదని ఈ చర్చలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్లు పీటీఐ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు ?

ఫరూక్ అబ్దుల్లా, గులాంనబీ ఆజాద్, మెహబూబా ముఫ్తీ, రవీంద్ర రైనా, కవిందర్ గుప్తా, నిర్మల్ సింగ్, సజ్జాద్ లోన్, భీమ్ సింగ్ తదితర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వీరితోపాటు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశానికి ముందు అఖిలపక్ష నేతలను ప్రధానమంత్రి పరిచయం చేసుకున్నారని ఏఎన్ఐ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

ఎందుకు చర్చలు?

2019 ఆగస్టు 5 న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది. ఆ తర్వాత మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో సహా పలువురు కీలక నేతలను నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉంచారు.

దాదాపు రెండేళ్ల తరువాత మోడీ ప్రభుత్వం అదే నాయకులను ఆహ్వానించి చర్చలు జరిపింది.

''మే సమస్యల గురించి మాట్లాడుతాం. ప్రధానమంత్రి, హోంమంత్రి మా మాటలను ఆలకిస్తారని ఆశిస్తున్నాము. అప్పుడే ఈ చర్చలు ఫలిస్తాయి. రాష్ట్రంలో శాంతి ఏర్పడి ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతారు'' అని సమావేశానికి ముందు ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)