కరోనా 'ఇండియా వేరియంట్' అనే మాటను సోషల్ మీడియాలో తొలగించాలని కోరిన భారత్

ఫొటో సోర్స్, Reuters
కోవిడ్-19 వైరస్‌కు సంబంధించి 'భారత వేరియంట్' అని సూచించే ఎలాంటి కంటెంట్ అయినా తొలగించాలని భారత ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలను కోరింది.
B.1.617 వేరియంట్‌ను తమ జాబితాలో చేర్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, దానిని 'భారత వేరియంట్'గా చెప్పిందనడం నిజం కాదని భారత ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పింది.
బ్రిటన్, బ్రెజిల్ వేరియంట్లతోపాటూ మిగతా ఎన్నో వేరియంట్ల గురించి చెప్పడానికి భౌగోళిక పదాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.
కోవిడ్-19 పరిస్థితిని అదుపు చేయలేకపోవడం గురించి భారత ప్రభుత్వం విమర్శలు ఎదుర్కుంటోంది.
మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో తాము చేపట్టిన చర్యలను విమర్శిస్తూ పెట్టిన పోస్టులను తొలగించాలని ప్రభుత్వం గత నెల ట్విటర్‌ను ఆదేశించడంపై ఆగ్రహం వ్యక్తమైంది.
మార్చి తర్వాత దేశంలో కొత్త వేరియంట్ కేసులు పెరిగాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం భారత్ ఇప్పుడు 2.60 కోట్ల కరోనా కేసులతో అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
భారత్‌లో కోవిడ్ మృతులు 3 లక్షలకు చేరువయ్యాయి. భారత్ మృతుల సంఖ్యలో అమెరికా, బ్రెజిల్ తర్వాత స్థానంలో ఉంది. అయితే, దేశంలో మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తప్పుడు ప్రకటనలు
సోషల్ మీడియా సంస్థలకు పలు సూచనలు ఇస్తూ భారత ఐటీ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక జీవో జారీ చేసింది. దానిని బయటపెట్టలేదు. కానీ కొన్ని వార్తా ఏజెన్సీలు ఆ జీవోను సంపాదించాయి.
'భారత వేరియంట్' అనే పేరుతో, లేదా అలా సూచించే మొత్తం కంటెంట్‌ను మీ ప్లాట్‌ఫాంల నుంచి తక్షణం తొలగించాలని కోరుతున్నాం" అని అందులో సోషల్ మీడియా సంస్థలకు చెప్పారని పీటీఐ చెప్పింది.
"వివిధ దేశాల్లో 'భారత వేరియంట్' వ్యాపిస్తోందని సూచిస్తూ ఆన్‌లైన్లో ఒక తప్పుడు ప్రకటన సర్కులేట్ అవుతున్నట్లు మాకు తెలిసింది. అది పూర్తిగా అవాస్తవం" అని అందులో పేర్కొన్నారని ఏఎఫ్‌పీ తెలిపింది.
"B.1.617 వేరియంట్, దానికి సంబంధించిన ఏ నివేదికతోనూ 'భారత్ వేరియంట్' అనే మాటకు సంబంధం లేదని అందులో చెప్పారు.
భారత వేరియంట్ అని చెప్పే అన్నిటినీ తొలగించడమనేది చాల కష్టం అని ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ తమకు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.
B.1.617 అనే వేగంగా వ్యాపించే వేరియంట్‌ను మొదట గత ఏడాది భారత్‌లో గుర్తించారు. తర్వాత ఇది పదుల సంఖ్యలో దేశాలకు వ్యాపించింది. చాలా దేశాలు భారత్‌కు రాకపోకలు నిషేధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా సంస్థలకు భారత్ ఒక భారీ మార్కెట్. జనవరిలో విడుదలైన గణాంకాల ప్రకారం ట్విటర్‌కు భారత్‌ను మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా గత ఏడాది భారత ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
'చట్టవిరుద్ధంగా' అనిపించే మెటీరియల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో కనిపిస్తే, ఆ కంపెనీకి టేక్ డౌన్ ఆర్డర్ ఇవ్వవచ్చు. గడువులోపు దానిని పాటించకపోతే, అది కోర్టు విచారణలు ఎదుర్కునే అవకాశం ఉంది.
యూజర్లు పోస్ట్ చేసేవాటికి తమకు ఎలాంటి బాధ్యత లేదని కంపెనీలు తప్పించుకోలేవని ఈ నియమాలు చెబుతున్నాయి.
ఈ మార్గదర్శకాలు సెన్సార్‌షిప్‌ను మరింత ప్రోత్సహిస్తాయా, భావప్రకటనా స్వేచ్ఛను బలహీనపరుస్తాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
మీడియా స్వేచ్ఛపై నిరంతరం జరిగే దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందని మీడియాలో కచ్చితంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
కోవిడ్-19ను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను విమర్శిస్తూ వచ్చిన కొన్ని పోస్టులను తొలగించాలని గత నెల ట్విటర్, ఫేస్‌బుక్‌లకు ప్రభుత్వం సూచించింది.
కొందరు భారత రాజకీయ నాయకుల పోస్టులకు 'మానిపులేటెడ్ మీడియా' అని లేబుల్ ఇవ్వడంపై ప్రభుత్వం ట్విటర్‌ను శుక్రవారం విమర్శించింది. తప్పుడు సమాచారం, మోసాలను సూచించడానికి ట్విటర్ దీనిని ఉపయోగిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








