కరోనా వైరస్: ఇంట్లోనే చేసుకునే కోవిడ్-19 టెస్ట్ కిట్‌కు ఐసీఎంఆర్ అనుమతి, ఎలా చేసుకోవాలి

ఫొటో సోర్స్, Reuters
ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకునే ఆర్ఏటీ కిట్‌లకు అనుమతులు ఇచ్చిన ఐసీఎంఆర్, కోవిడ్-19 ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్(ఆర్ఏటీ) ప్రాధాన్యం గురించి మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా లక్షణాలు ఉన్నవారు, కరోనా పాజిటివ్ రోగులకు సన్నిహితంగా మెలిగిన వారు సులభంగా ఉపయోగించే ఆర్ఏటీ కిట్ ద్వారా తమకు కోవిడ్-19 ఉందా లేదా అనేది ఇంట్లోనే పరీక్ష చేసి తెలుసుకోవచ్చని చెప్పింది..
ఐసీఎంఆర్ తాజా సూచనల ప్రకారం ఇంట్లో టెస్ట్ చేసుకునే ఆర్ఏటీ కిట్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిని కూడా కోవిడ్ పాజిటివ్ రోగిగా భావించాలి. వారికి మరోసారి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఈ ఆర్ఏటీ కిట్ ఉపయోగించాలని, ఎలాంటి సంకోచం లేకుండా వారు ఈ పరీక్ష చేసుకోవచ్చని ఐసీఎంఆర్ చెప్పింది..
"కానీ, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఒకవేళ ఆర్ఏటీ టెస్ట్‌లో నెగటివ్ వస్తే, వారు వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, వైరస్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఆర్ఏటీ పరీక్షల్లో చాలా మందికి కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధరణ కాక పోవడం మేం చాలాసార్లు చూశాం" అని తెలిపింది.
"కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన జాగ్రత్తలను పాటించాలి. వారిని కరోనా రోగులుగానే భావించాలి" అని కూడా ఐసీఎంఆర్ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంట్లో ఎలా టెస్ట్ చేసుకోవాలి
ఆర్ఏటీ కిట్‌తోపాటూ, కోవిడ్-19 పరీక్ష ఎలా చేసుకోవాలో వివరిస్తూ ఒక యూజర్ మాన్యువల్ ఉంటుందని, దానిని పూర్తిగా చదివి, అందులో చెప్పిన ప్రకారమే ఇంట్లో పరీక్ష చేసుకోవాలని ఐసీఎంఆర్ చెప్పింది.
ఐసీఎంఆర్ వివరాల ప్రకారం గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి 'హోమ్ టెస్టింగ్' యాప్స్ ఉన్నాయి. ఆర్ఏటీ కిట్‌తో ఇంట్లో పరీక్ష చేసుకునేవారు వాటిని మొదట డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఇంట్లో చేసుకున్న కోవిడ్-19 పరీక్ష ఫొటోను తమ మొబైల్ ఫోన్ ద్వారా ఆ యాప్‌లో అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలన్నీ ఒక సెక్యూర్డ్ సర్వర్‌లో ఉంటాయని, దానిని ఐసీఎంఆర్ కోవిడ్-19 పోర్టల్‌తో అనుసంధానించామని సంస్థ చెప్పింది.
తమకు లభించే మొత్తం డేటాను సేకరిస్తామని, ఈ కొత్త ప్రక్రియలో కూడా రోగుల వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపింది.
ఐసీఎంఆర్ వివరాల ప్రకారం ప్రస్తుతం ఇంట్లోనే కోవిడ్-19 పరీక్ష చేసుకోడానికి ఒక ఆర్ఏటీ కిట్‌కు భారత్‌లో అనుమతులు ఇచ్చారు.
పుణెలోని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ తయారు చేసిన కోవిసెల్ఫ్ (పాథొకాచ్) కోవిడ్-19 ఓటీసీ యాంటీజెన్ ఎల్ఎఫ్, ద్వారా కరోనా పరీక్షలు ఇంట్లోనే చేసుకోవచ్చని ఐసీఎంఆర్ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








