ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం వచ్చింది: కేంద్రం - Newsreel

మాస్క్

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ముఖ్యమైన సూచన చేసింది.

ప్రజలు తమ ఇంట్లో తాము ఉన్నా కూడా మాస్కు ధరించాలని చెప్పింది.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తిపై నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ ఈ సూచన చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ అనవసరంగా బయటకు వెళ్లొద్దు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించండి. ఎవరినీ ఇంటికి ఆహ్వానించొద్దు'' అని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భౌతిక దూరం పాటించకపోతే ఒక వ్యక్తి నుంచి 30 రోజులలో 406 మందికి వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయని అధికారులు చెప్పారు.

పాట్ కమిన్స్

ఫొటో సోర్స్, Getty Images

పాట్ కమిన్స్: 'పీఎం కేర్స్ ఫండ్'కు విరాళమిచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్

ఆస్ట్రేలియా క్రికెటర్, ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న పాట్ కమిన్స్ భారత్‌లోని ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో 'పీఎం కేర్స్ ఫండ్'కు 50,000 డాలర్లు విరాళం ఇచ్చారు. ఇది భారతీయ కరెన్సీలో రూ. 37 లక్షలకు పైమాటే.

ఆక్సిజన్ సరఫరా పెంచడానికి ఈ నిధులు వినియోగించాలని ఆయన కోరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''నేను ప్రేమించే భారతదేశంలో చాలామంది ప్రజలు బాధల్లో ఉండడం నన్ను బాధపెడుతోంది.

కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో ఐపీఎల్ కొనసాగించడం అవసరమా అన్న చర్చ కూడా ఉంది. అయితే, వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో ఇళ్లకే పరిమితమయ్యే ప్రజలకు కొద్దిగంటల పాటు తమ ఆట ఆనందాన్నిస్తుందనుకుంటున్నాను.

ఇండియాలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా పెంచడానికి తోడ్పడేలా నేను 'పీఎం కేర్స్ ఫండ్'కు 50,000 డాలర్లు విరాళం ఇస్తున్నాను.

మిగతా ఐపీఎల్ ఆటగాళ్లు కూడా విరాళాలు అందించాలని కోరుకుంటున్నాను'' అంటూ కమిన్స్ ట్వీట్ చేశాడు.

బారులు తీరిన ఓటర్లు

ఫొటో సోర్స్, Samiratmaj mishra

కరోనావైరస్ సెకండ్‌ వేవ్‌కి పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్‌దే: మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్‌ తీవ్ర రూపం దాల్చడానికి ఎలక్షన్ కమిషనే కారణమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.

ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.

దేశంలో కరోనావైరస్ రెండో వేవ్ మొదలైనప్పటికీ రాజకీయ పార్టీల సభలకు అనుమతులు ఇవ్వడంపై కోర్టు ఆగ్రహించింది.

ఓట్ల లెక్కింపు సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా కోర్టు ఆదేశాలు జారీచేయాలంటూ ఓ ప్రజాప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఎన్నికల ప్రచార సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడడంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది.

''ప్రచారం జరుగుతున్న సమయంలో ఎన్నికల అధికారులు ఏమైనా ఇతర గ్రహాలలో ఉన్నారా?'' అంటూ న్యాయమూర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు.

మద్రాస్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మద్రాస్ హైకోర్టు

ప్రజారోగ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని రాజ్యాంగ సంస్థలు గుర్తుంచుకోవాలని.. కనీసం లెక్కింపు సందర్భంగానైనా కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించేలా ప్రణాళికలు వేయకపోతే కౌంటింగ్ నిలిపివేయిస్తామని కోర్టు హెచ్చరించింది.

మే 2న కౌంటింగ్ సందర్భంగా తీసుకోబోయే కోవిడ్ జాగ్రత్త చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, తమిళనాడు ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించి ఏప్రిల్ 30న కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)