కశ్మీర్‌లో హింస: ముగ్గురు మిలిటెంట్లు సహా ఆరుగురి మృతి

ఫొటో సోర్స్, EPA/FAROOQ KHAN
- రచయిత, రియాజ్ మస్రూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్
జమ్ము-కశ్మీర్‌లో జరిగిన వేరువేరు హింసాత్మక ఘటనల్లో పాకిస్తాన్ మద్దతున్న ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడ్డ ముగ్గురు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక దాడిలో స్థానిక దుకాణదారుడు కూడా గాయపడ్డారు.
యూరోపియన్ దౌత్యవేత్తల బృందం కశ్మీర్ లోయలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి.
మరోవైపు, ఒక హిందూ రెస్టారెంట్ మీద దాడి చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు శుక్రవారం చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మంగళవారం సాయంత్రం రెస్టారెంట్ మీద జరిగిన ఈ దాడిలో నిర్వాహకుడు ఆకాశ్ మెహ్రా గాయపడ్డారు.
15 యూరోపియన్ దేశాల ప్రతినిధి మండలి శ్రీనగర్ చేరుకున్న కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది.
శ్రీనగర్‌కు దక్షిణం వైపున 60 కిలోమీటర్ల దూరంలోని సోపియాలో శుక్రవారం ఉదయం జరిగిన ఒక భీకర ఎన్‌కౌంటర్‌లో స్థానిక సాయుధ మిలిటెంట్లు ముగ్గురు చనిపోయారు.
ఆయుధాలు వీడి, లొంగిపోవాలని భద్రతాదళాలు కోరినా మిలిటెంట్లు వినలేదని జమ్ము-కశ్మీర్ పోలీస్ ఐజీ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
మిలిటెంట్లు భద్రతాదళాలపై దాడి చేయడంతో, వారు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టామని, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఒక మిలిటెంట్ కొన్ని రోజుల క్రితమే తీవ్రవాది మారాడని ఐజీ తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
ఇటు, బడ్గాం జిల్లాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
ఎన్‌కౌంటర్ సమయంలో వాంటెడ్ తీవ్రవాది కమాండర్ యూసుఫ్ కంటరూ భద్రతాబలగాల నుంచి తప్పించుకుని పారిపోయాడని, కాల్పుల్లో అతడు గాయపడ్డాడని పోలీసులు చెప్పారు.
"మేం రక్తపు మరకలను అనుసరిస్తూ వెళ్లాం. మరో గ్రామాన్ని చుట్టుముట్టాం" అని ఐజీ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే, శ్రీనగర్ శివార్లలోని బాగాత్‌లో అనుమానిత తీవ్రవాదులు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు చనిపోయారు.
వేసవి ప్రారంభానికి ముందే హింసాత్మక కార్యకాలాపాలు పెరగడంపై ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.

ఫొటో సోర్స్, TWITTER/JMUKMRPOLICE
"వేసవిలో హింసను అడ్డుకోడానికి మా కౌంటర్ ప్లాన్ సిద్ధంగా ఉంది. తీవ్రవాదులు తమ విధానాలు మార్చుకున్నారని మాకు తెలుసు. అదే విధంగా మేం కూడా, మా పనిచేసుకుంటూ వెళ్తున్నాం" అన్నారు.
2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసిన భారత ప్రభుత్వం, జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
కశ్మీర్‌లో సుదీర్ఘ కర్ఫ్యూ, సమాచార సేవల స్తంభన, షట్‌డౌన్ తర్వాత... 2019 చివర్లో స్థానికులకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా ఆ ప్రాంతంలోని అగ్ర నేతలను గృహనిర్బంధం చేశారు. కొన్ని నెలల తర్వాత గత ఏడాది వారిని విడుదల చేశారు.

ఫొటో సోర్స్, ANI
భారత ప్రభుత్వం కశ్మీర్‌లో పర్యటించాలని విదేశీ దౌత్యవేత్తలను ఆహ్వానిస్తూనే ఉంది. అయితే, పౌరుల భావ వ్యక్తీకరణ, ప్రయాణాలపై ఆంక్షల మధ్య దౌత్యవేత్తలను ఎంపిక చేసిన ప్రాంతాలకు తీసుకెళ్లడాన్ని కశ్మీర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
2019 ఆగస్టు 5 తర్వాత నుంచి విదేశీ దౌత్యవేత్తల బృందం కశ్మీర్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి. ఈ బృందంలో కనీసం 15 దేశాల దౌత్యవేత్తలు ఉన్నారు. వీరిలో ఆరుగురు ముస్లిం దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు.
2019తో పోలిస్తే కశ్మీర్‌లో హింస భారీగా తగ్గిపోయిందని అధికారులు దౌత్యవేత్తలకు చెప్పారు.
"కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో 2019తో పోలిస్తే కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు 60 శాతం తగ్గాయి. భద్రతాదళాలకు ఇంతకు ముందు కంటే నష్టం 25 శాతం తగ్గిందని మేం దౌత్యవేత్తలకు చెప్పాం" అని ఒక టాప్ భద్రతా అధికారి బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









