రిహానా వ్యాఖ్యలపై ప్రభుత్వానికి మద్దతుగా సచిన్, విరాట్ సహా క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్ల ట్వీట్‌లు

ఫొటో సోర్స్, facebook/twitter
రైతుల ఆందోళనకు మద్దతుగా పాప్ గాయని రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సహా కొందరు ప్రపంచ సెలబ్రిటీలు చేసిన ట్వీట్‌లకు వ్యతిరేకంగా, అనుకూలంగా పలువురు భారత సెలబ్రిటీలు ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా సచిన్ తెందూల్కర్‌తోపాటు పలువురు క్రికెటర్లు ట్విటర్‌లో స్పందించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రిహానా ట్వీట్‌పై స్పందించగా, తాజాగా హోంమంత్రి అమిత్‌షా ఆమె ట్వీట్‌లను పరోక్షంగా విమర్శిస్తూ ట్విటర్‌లో స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారతదేశ ఐక్యతను ఏ ప్రచారం దెబ్బకొట్టలేదని, దేశం కొత్త ఎత్తులకు ఎదగడాన్ని ఏ ప్రచారమూ ఆపలేదని అమిత్ షా ట్విటర్‌లో అన్నారు.
అభివృద్ధి మాత్రమే దేశపు భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని, ఇలాంటి దుష్ప్రచారాలు ఏమీ చేయలేవని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
#IndiaAgainstPropaganda, #IndiaTogether హ్యాష్‌ట్యాగ్‌లతోపాటు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ విడుదల చేసిన ప్రకటనను షేర్ చేస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరోవైపు #IndiaStandsTogether #IndiaAgainstPropaganda, #IndiaTogether హ్యాష్‌ట్యాగ్‌లతో పలువురు క్రికెటర్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్ చేశారు.
భారత వ్యవహారాలలో విదేశీవ్యక్తులు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని సచిన్ తెందూల్కర్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై ఏం చేయాలో భారత్ నిర్ణయంచుకుంటుందని తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు సచిన్ .
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రైతుల ఆందోళన విషయంలో ఒక సామరస్య పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు.
ఇలాంటి సమయాల్లో అందరూ ఐక్యంగా ఉండి సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉందని విరాట్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇది దేశపు అంతర్గత వ్యవహారమని, ప్రయత్నిస్తే పరిష్కారం కాని సమస్య ఏదీ ఉండదని క్రికెటర్ అజింక్య రహానే అన్నారు.
ఈ సమస్యను అందరూ చర్చించి పరిష్కరించుకోవాలని తన ట్వీట్‌లో రహానే పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
దేశాభివృద్ధిలో రైతుల పాత్రను తీసేయలేమని మరో క్రికెటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు.
రైతుల సమస్యపై అంతా కలిసి పని చేస్తే పరిష్కారం దొరుకుతుందని, ఈ విషయంలో అందరూ ఐక్యంగా కృషి చేయాలని రోహిత్ శర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
మరోవైపు భారత మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి కూడా ఇది భారతదేశ అంతర్గత వ్యవహారమని, చర్చల ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తన దేశంలోని ఎలాంటి సమస్యనైనా అంతర్గతంగా చర్చల ద్వారా పరిష్కరించుకునే సత్తా ఉందని భారత క్రికెట్ మాజీ బౌలర్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
దేశంలో విభజన సృష్టించేవారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అన్నారు. రైతుల సమస్యకు సామరస్య పరిష్కారం కనుక్కోవాలని ఆయన సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునే సత్తా భారత్‌కు ఉందని సుప్రసిద్ధ గాయని లతామంగేష్కర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
తప్పుడు ప్రచారం చేసేవారి మాటలు నమ్మవద్దని మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ అన్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో అంతా కలిసి పని చేయాలని ఆయన సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
ప్రతి విషయాన్ని లోతుగా చూడాల్సి ఉందని, సగం నిజాలు మాత్రమే తెలియడం అత్యంత ప్రమాదకరమని నటుడు సునీల్ శెట్టి అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
ఇక బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ రిహానాకు మద్దతుగా ట్వీట్ చేశారు. రైతుల సమస్యలను పట్టించుకున్నందుకు ఆమెకు కృతజ్జతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలంతా దీనిపై స్పందించాలని మరో ట్వీట్‌లో ఆమె కోరారు.
మరోవైపు 'farmer genocide' హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండవుతున్న పోస్ట్‌ను వెంటనే నిలిపేయాలంటూ కేంద్రం ట్విటర్‌కు లేఖ రాసిందని 'ది హిందూ' పత్రిక పేర్కొంది.
ఈ పోస్ట్ ద్వారా తప్పుడు సమాచారం ప్రచారమవుతోందని, దేశంలో అలజడి సృష్టించేలా ఉందని తన లేఖలో కేంద్రం ట్విటర్‌కు తెలిపింది.
ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్న ఎకౌంట్లను నిషేధించకపోతే జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా కేంద్రం హెచ్చరించినట్లు 'ది హిందూ' పేర్కొంది.
అయితే న్యాయపరమైన ఇబ్బందుల పేరుతో బ్లాక్ చేసిన 250 ఎకౌంట్లను కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ తెరుస్తున్నట్లు ట్విటర్ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమైన ట్విటర్ అధికారులు, ఇవి తమ నియమావళికి విరుద్ధంగా ఏమీ లేవని, కాబట్టి వీటిని నిషేధించలేమని తేల్చిచెప్పినట్లు 'ది హిందూ' పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
అంతకుముందు బ్రిటన్ ఎంపీ తన్మన్ జీత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు రైతు ఆందోళనలపై స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 13
తాజాగా పాప్ స్టార్ రిహానా ఈ ఆందోళనపై ట్వీట్ చేయగా, అది సోషల్ మీడియాలో యుద్ధంగా మారింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 14
రైతుల ఆందోళనపై ఫిబ్రవరి 2న రిహానా ట్వీట్ చేశారు. సీఎన్ఎన్‌లో వచ్చిన ఒక కథనాన్ని షేర్ చేస్తూ ఆమె ‘‘ ఈ అంశంపై మనం ఎందుకు చర్చించడం లేదు’’ అని ప్రశ్నించారు.
దీనికి #FarmersProtest అని హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారు.
రిహానా ట్వీట్ కు 66.9 వేల రియాక్షన్లు, 156.4 వేలకు పైగా లైక్‌లు, 14వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. రిహానా ట్వీట్ భారత్ లో ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 15
రిహానా ట్వీట్ పై ప్రజల స్పందన ఎలా ఉంది?
రిహానా రైతు సమస్యలపై స్పందించారని కొందరు మెచ్చుకోగా, మరికొందరు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని విమర్శించారు. కిసాన్ ఏక్తా మోర్చా తన ట్విటర్ హ్యాండిల్ నుంచి రిహానాకు కృతజ్ఞతలు తెలిపింది.
‘‘రైతు ఉద్యమానికి మద్ధతుగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మా నిరసనను ప్రపంచమంతా చూస్తోంది. కానీ ప్రభుత్వం ఎందుకు చూడటం లేదు ?’’ అని కిసాన్ ఏక్తా మోర్చా తన ట్వీట్ లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 16
అయితే రిహానా ట్వీట్‌పై మండిపడ్డ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆమెను ‘ఫూల్’ అని తిట్టారు.
‘‘ఎవరూ ఎందుకు మాట్లాడటంలేదంటే ఇది రైతుల ఉద్యమం కాదు. దేశాన్ని విభజించే టెర్రరిస్టుల ఉద్యమం. దేశం ముక్కలైతే చైనా సులభంగా ఆక్రమించుకోగలదు’’ అని వ్యాఖ్యానించారు కంగనా.

ఫొటో సోర్స్, ANI
అయితే కంగనా చేసిన ట్వీట్‌పై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు ఇలాంటి రియాక్షన్లు రాయవద్దని ఆమెకు సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 17
బీజేపీ నేత మనోజ్ తివారీ రిహానా ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎక్కడున్నావ్ రిహానా...ఈ నిజాల గురించి మేం మాట్లాడుతున్నది’’ అంటూ ఓ పోలీస్ అధికారిపై కత్తి దూస్తున్న ఓ సిక్కు వ్యక్తి ఫొటోను తివారి పోస్ట్ చేశారు.
రిహానా ట్వీట్‌పై స్పందిస్తూ ‘‘తనకు తెలియని విషయంపై ఎవరూ మాట్లాడకూడదు’’ అని పోలీస్ అధికారి ప్రణవ్ మహాజన్ సూచించారు.
ప్రణవ్ మహాజన్ రియాక్షన్ పై స్పందించిన సుప్రీం కోర్టు న్యాయవాది రోహిణి సింగ్ ‘‘ ఈ ట్వీట్ ద్వారా రిహన్నాకు 3.5 మిలియన్ డాలర్లు దక్కాయని భక్తమండలి వాదిస్తోంది. కానీ రిహానా కోసం రూ.2 కే ట్వీట్ చేస్తున్నవారి గురించి భక్తులకు పట్టింపు లేదనుకుంటా’’ అని ట్వీట్ చేశారు.
‘‘రైతుల ఆందోళనపై ఎందుకు చర్చించడం లేదని ఓ సెలబ్రిటీ అడిగింది. అందుకు అందరూ ఆ సెలబ్రిటీ మీద చర్చిస్తున్నారు’’ అని కార్టూనిస్ట్ మంజుల వ్యాఖ్యానించారు.
#RihannaSupportsIndianFarmers అనే హ్యాష్‌ట్యాగ్‌తో జిగ్నేష్ మేవాని కూడా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 18
మరోవైపు పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బెర్గ్ కూడా రైతులు ఆందోళనపై స్పందించారు.
భారత్ లో రైతుల నిరసనలకు మద్దతు పలుకుతున్నట్లు ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.
తొమ్మిదేళ్ల పర్యావరణ కార్యకర్త లిసిప్రియా కూడా రిహానా ట్వీట్‌కు మద్దతు ఇచ్చారు.
అయితే రైతుల వ్యవహారాన్ని కొందరు యూజర్లు భారతదేశ అంతర్గత వ్యవహారమని వాదించారు. రిహానాలాంటివారు దీనికి దూరంగా ఉండాలని ఫాల్గుణి అనే యూజర్ తన హ్యాండిల్ లో రాశారు.

ఫొటో సోర్స్, TWITTER/RIHANNA
పెయిడ్ ట్వీట్ అంటూ కొందరు ఈ వాదనను కొట్టి పారేశారు. ‘‘మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. కానీ ఇలాంటి మతపరమైన ఉగ్రవాదం సరికాదు’’ అని ఓ యూజర్ విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్విట్టర్‌లో ట్రెండింగ్
రైతుల నిరసనలపై రిహానా ట్వీట్ చేసినప్పటి నుంచి అది ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
అయితే #FarmersProtest , Kangana అనేవి రెండు మూడు స్థానాల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి.
రిహానా ఎవరు?
వెస్టిండీస్ దీవుల్లోని బార్బడోస్ కు చెందిన 32 ఏళ్ల రిహానా పాప్ సింగర్‌గా సుపరిచితురాలు.
పదేళ్ల కిందట ఆమె తన మ్యూజికల్ కెరీర్ ను ప్రారంభించారు.
బిల్ బోర్డ్ హాట్ 100 లో కనిపించిన అతి పిన్న వయస్కురాలు రిహానా. ఇప్పటి వరకు 8సార్లు గ్రామీ అవార్డులను అందుకున్నారామె. గాయనిగానే కాక సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా కూడా రిహానా పేరు తెచ్చుకున్నారు.
వాస్తవాలు తెలుసుకోకుడా విదేశీ సెలబ్రిటీలు వ్యాఖ్యానిస్తున్నారు: భారత విదేశీ వ్యవహారాల శాఖ
వ్యవసాయ సంస్కరణల చట్టాలపై దేశంలో కొన్ని ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు నిరసన తెలుపుతున్నారని.. ఈ అంశాన్ని పరిష్కరించడానికి రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని.. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా విదేశీ సెలబ్రిటీలు, సంస్థలు వ్యాఖ్యలు చేయటం బాధ్యతాయుతం కాదని భారత విదేశీ వ్యవహారాల శాఖ తప్పుపట్టింది.
ఈ మేరకు విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది.
''భారత పార్లమెంటు పూర్తిగా చర్చించి, సంప్రదించిన తర్వాత వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఆమోదించింది. ఈ సంస్కరణలు రైతుల మార్కెట్‌ను విస్తరించటంతో పాటు మరింత సరళతను అందిస్తాయి. ఆర్థికంగానూ పర్యావరణపరంగానూ సుస్థిర వ్యవసాయానికి బాటలు పరుస్తుంది.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా కొద్దిమంది రైతులు మాత్రమే ఈ సంస్కరణలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. నిరసనకారుల మనోభావాలను గౌరవిస్తూ భారత ప్రభుత్వం వారి ప్రతినిధులతో చర్చల ప్రక్రియ ప్రారంభించింది. ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు భాగంగా ఉన్నారు. ఇప్పటికే 11 విడతల చర్చలు జరిగాయి. ఈ చట్టాలను నిలిపి ఉంచుతామని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. భారత ప్రధానమంత్రి స్వయంగా ఈ ప్రతిపాదన చేశారు.
ఈ నిరసనల మీద స్వార్థశక్తులు తమ అజెండాను రుద్ది, వాటిని పక్కదారి పట్టించటానికి ప్రయత్నించటం దురదృష్టకరం. ఇది జనవరి 26వ తేదీ భారత గణతంత్ర దినోత్సవం రోజున బాగా కనిపించింది. దేశ రాధానిలో హింస, లూటీ జరిగాయి.
ఈ స్వార్థ శక్తులు కొన్ని భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టటానికి కూడా ప్రయత్నించాయి. అటువంటి విద్రోహ శక్తుల ప్రేరేపణతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలను అవమానించారు. ఇది భారతదేశానికి, మిగతా పౌర సమాజానికి చాలా ఆందోళన కలిగించే విషయం.
ఈ నిరసనలతో భారత పోలీసు బలగాలు అత్యంత సంయమనంతో వ్యవహరించాయి. పోలీసు విభాగంలో పనిచేస్తున్న వందలాది మంది పురుషులు, మహిళలపై భౌతికంగా దాడి జరిగింది. కొన్ని ఉదంతాల్లో వారు కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డారు కూడా.
ఈ నిరసనలను, ప్రతిష్టంభనను పరిష్కరించటానికి భారత ప్రభుత్వం, సంబంధిత రైతుల బృందాలు చేస్తున్న కృషిని భారతదేశపు ప్రజాస్వామిక విలువలు, రాజకీయాల నేపథ్యంలో చూడాలని మేం ఉద్ఘాటిస్తున్నాం.
ఇటువంటి అంశాలపై వ్యాఖ్యానించటానికి ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని, విషయాలను సరిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇతరులు సంచలనాత్మక సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లు, కామెంట్లు పెట్టాలనే ఆతృత.. వాస్తవం కాదు. బాధ్యతాయుతమైనదీ కాదు'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బడ్జెట్ 2021: కరోనా మహమ్మారితో భారత ఆర్థికవ్యవస్థకు ఎంత నష్టం... ఏంటి పరిష్కారం?
- దక్షిణ కోస్తా రైల్వే జోన్: ప్రకటించి రెండేళ్లు అవుతున్నా పనులు ఎందుకు మొదలు కాలేదు... అడ్డం పడుతున్నదేంటి ?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)