ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM
ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు సరికాదని హైకోర్టు తెలిపింది.
ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే.. అవి కోవిడ్-19 టీకా కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తాయని అభిప్రాయపడింది.
రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించలేదని, తనంతటతానుగా నిర్ణయం తీసుకుందని వివరించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం
ఫిబ్రవరి 5 నుంచి నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని ఈనెల 8వ తేదీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 5,9,13,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించారు.
అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.
‘‘కోవిడ్-19 కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఎన్డీఎంఏ)ను విధించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మేం అనుసరిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టం’’అని ఆదిత్యనాథ్ తెలిపారు.
కాగా, టీకా కార్యక్రమం ప్రారంభం కానున్నందున ఈ ఎన్నికల నిర్వహణలో తాము పాల్గొనలేమని పలు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. కూతురు పుట్టిందని ప్రకటన
- సిడ్నీ టెస్ట్ డ్రా.. సిరీస్‌లో సమ ఉజ్జీలుగా నిలిచిన భారత్, ఆస్ట్రేలియా
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- ఇండోనేసియా విమాన ప్రమాదం: ‘పిడుగు పడినట్లుగా భారీ శబ్దంతో సముద్రంలో కూలిపోయింది’
- సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








