విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు కుమార్తె - News reel

ఫొటో సోర్స్, facebook/virat.kohli
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు కుమార్తె పుట్టింది.
ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియాలో ప్రకటించారు.
సోమవారం మధ్యాహ్నం తమకు కుమార్తె పుట్టిందని, అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కోహ్లీ తెలిపారు.
తమ జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు తాము చాలా సంతోషిస్తున్నామని, ఈ పరిస్థితుల్లో తమ ప్రైవసీని గౌరవించాలని కోహ్లీ కోరారు.
విరుష్క అని అభిమానులు పిలిచే ఈ జంట 2017 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

ఫొటో సోర్స్, facebook/virat.kohli

ఫొటో సోర్స్, Getty Images
"ఈ వ్యవసాయ చట్టాలను కొంతకాలం ఆపవచ్చా?" - ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీజేఐ
వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దిల్లీ సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులను అక్కడి నుంచి తొలగించాలనే పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా "ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే, చాలా నిరాశాజనకంగా ఉంది" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అన్నారు.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను ఆయన "చర్చలు విఫలమయ్యాయా?" అని ప్రశ్నించారు.
"ఒక నెల నుంచి ఇదంతా జరుగుతోంది. ప్రభుత్వం, రైతుల మధ్య అసలు ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో మాకు అర్థం కావడం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
"ఇది ఒక సున్నితమైన పరిస్థితి. ఈ విషయంలో ఏదైనా స్నేహపూర్వక పరిష్కారంతో ముందుకు రావాలని మేం కోరుకుంటున్నాం" అన్నారు.
" ఈ వ్యవసాయ చట్టాలను కొంతకాలం ఆపవచ్చా?" అని చీఫ్ జస్టిస్ అటార్నీ జనరల్‌ను అడిగారు.
"దాఖలైన పిటిషన్లలో ఈ చట్టం మంచిదని చెప్పే పిటిషన్ ఒక్కటి కూడా లేదు" అని చీఫ్ జస్టిస్ అన్నారు.
అంతకు ముందు...
కొద్దిరోజులుగా వివాదాస్పదమై, రైతుల ఆందోళనలకు దారి తీసిన మూడు వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ చట్టాల విషయంలో రైతులు, ప్రభుత్వం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్రం తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
కేంద్రం తీసుకుంటున్న చర్యలు నిరాశాజనకంగా ఉన్నాయని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టిన సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ చట్టాల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వంటివారు పిటిషన్లు దాఖలు చేశారు.

అసలేం జరుగుతోంది?
కేంద్రం, రైతుల మధ్య చర్చల పట్ల మేం ఏమాత్రం సంతృప్తిగా లేం. వృద్ధులు, మహిళలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉద్యమంలో పాల్గొన్న కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు ఏం జరుగుతోంది అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను సీజేఐ ప్రశ్నించారు.
సమస్యకు పరిష్కారం కనుగొనాలని ధర్మాసనం సూచించింది. ఈ చట్టాలను కొన్నాళ్లు నిలిపివేయగలరా? అని అటార్నీ జనరల్‌ను అడిగింది.
ఈ చట్టాలకు మద్దతుగా ఒక్క పిటిషన్ కూడా రాలేదని.. సమస్య పరిష్కారానికి కమిటీ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








