కరోనావైరస్: భారత్ ఆమోదించిన కోవాగ్జిన్‌పై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి? భారత్ బయోటెక్ ఏమంటోంది?

ఫొటో సోర్స్, SOPA Images via Getty Images
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా రెండు కోవిడ్-19 వ్యాక్సీన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఆమోదం పొందిన టీకాల్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉన్నాయి. కోవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేశాయి. మరోవైపు కోవాగ్జిన్ భారత్ దేశీయంగా తయారుచేసిన టీకా.
కోవిషీల్డ్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేస్తోంది. మరోవైపు కోవాగ్జిన్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సాయంతో భారత్ బయోటెక్ తయారుచేస్తోంది.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాల కోవిషీల్డ్‌ను అత్యవసరంగా ఉపయోగించేందుకు బ్రిటన్ ఆమోదం తెలిపిన అనంతరం భారత్ కూడా ఆమోదం తెలుపుతుందని అందరూ ఊహించారు. దానికి అనుగుణంగానే భారత్ ఆమోదం తెలిపింది.
అయితే, కోవాగ్జిన్‌కు ఇంత త్వరగా ఆమోదం లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. దీంతో ఆరోగ్య సిబ్బంది నుంచి కాంగ్రెస్ వరకు పలువురు దీనిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై భారత్ బయోటెక్ కూడా స్పందించింది. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ సంస్థ ఎం.డి. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, వ్యాక్సీన్ అంశాన్ని రాజకీయ చేయడం విచారకరమని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఎందుకు ప్రశ్నలు?
కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు ఆదివారం ఆమోదం లభించిన వెంటనే చాలా మంది ప్రశ్నలు సంధించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌పై సమాచారాన్ని బయటకు వెల్లడించకుండా ఎలా అనుమతులు జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మూడో దశలో భాగంగా భారీగా ఈ ఔషధాన్ని పరీక్షిస్తారు. ఎంత శాతం మందిపై ఈ టీకా పనిచేస్తుందో ఈ ఫలితాల్లో తెలుస్తుంది.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, బయోఎన్‌టెక్, మోడెర్నా వ్యాక్సీన్ల మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను విడుదల చేశారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ 70 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, కోవాగ్జిన్‌కు సంబంధించి ఈ డేటా విడుదల చేయలేదు.
కోవాగ్జిన్ మొదట దశ ట్రయల్స్ 800 మందిపై, రెండో దశ ట్రయల్స్ 1600 మందిపై మూడో దశ ట్రయల్స్ 22,500 మందిపై నిర్వహించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ టీకా ఎంత సామర్థ్యంతో పనిచేస్తుందో మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించిన డేటాను విడుదల చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్నలు అడుగుతున్నది ఎవరు?
అత్యవసరంగా కోవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ ట్వీట్ చేశారు.
‘‘మూడో దశ ట్రయల్స్ ఇంకా పూర్తికాలేదు. ముందుగానే అనుమతులు ఇచ్చేశారు. ఇది చాలా ప్రమాదకరం. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పందించాలి. పరీక్షలు పూర్తయ్యేవరకు వీటి అనుమతులు నిలిపివేయాలి. అప్పటివరకు ఆక్స్‌ఫర్డ్ టీకాను మాత్రమే వేసేందుకు అనుమతించాలి’’అని శశిథరూర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
శశి థరూర్ ట్వీట్ చేసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేశ్, ఎస్పీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ కూడా స్పందించారు. కోవాగ్జిన్‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండానే అనుమతులు ఇచ్చారంటూ ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రస్తుతం వైద్యుల పరిస్థితి చాలా కష్టంగా ఉంటోందని ముంబయిలోని సాంక్రమిక వ్యాధుల పరిశోధకుడు డాక్టర్ స్వప్నిల్ పారిఖ్ అన్నారు.
‘‘అనుమతులకు సంబంధించిన అవరోధాలను త్వరగా పూర్తిచేసి, వీలైనంత వేగంగా టీకాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలి’’అని ఆయన వివరించారు.
‘‘డేటా విషయానికి వస్తే ప్రభుత్వం, ప్రాధికార సంస్థలు పారదర్శకతను పాటించాలి. ముందే అన్ని సమీక్షలు నిర్వహించి అనుమతులు ఇవ్వాలి. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది’’అని పారిఖ్ చెప్పారు.
ప్రతిపక్షాలతోపాటు ఆరోగ్య సిబ్బంది కూడా ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వరుస ట్వీట్లు చేశారు.

ఫొటో సోర్స్, Twitter
‘‘సీరియస్ అంశంపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. శశి థరూర్, అఖిలేశ్ యాదవ్, జయరాం రమేశ్... టీకాలకు అనుమతి ఇవ్వడంలో అనుసరించిన ప్రోటోకాల్స్‌పై సందేహాలు అవసరంలేదు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. మిమ్మల్ని మీరే అపఖ్యాతి పాలు చేసుకుంటున్నారు’’అని హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత కోవాగ్జిన్‌కు మద్దతుగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. అయితే, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా గురించి మాత్రం ఆయన మాట్లాడలేదు.
మరోవైపు కొత్తరకం కరోనావైరస్‌పై కూడా కోవాగ్జిన్ పనిచేస్తుందని హర్షవర్ధన్ చెప్పారు.
కొన్ని షరతులపై మాత్రమే కోవాగ్జిన్‌కు ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ (ఈయూఏ) లభించిందని ఆయన వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘వదంతులు వ్యాపింపచేస్తున్న వారు ఈ విషయం తెలుసుకోవాలి. కోవిషీల్డ్‌తో పోలిస్తే కోవాగ్జిన్ అనుమతులు భిన్నమైనవి. క్లినికల్ ట్రయల్ విధానంలోనే మేం అనుమతులు జారీచేశాం. కోవాగ్జిన్ తీసుకున్న అందరినీ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లే ట్రాక్ చేస్తాం’’అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
భారత్ బయోటెక్ ఏం చెబుతోంది?
‘‘నేడు ప్రపంచ జనాభాకు అవసరమైన టీకాను అందించడమే మా లక్ష్యం. కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తుందనే డేటా చెబుతోంది. శక్తిమంతమైన రోగ నిరోధక స్పందనలను మా టీకా కలుగ చేస్తోంది’’అని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు.
వ్యాక్సీన్ అనుమతులకు రాజకీయ రంగు పులమడం విచారకరమని, కొందరు దీనిని మంచినీళ్లతో పోల్చడం బాధ కలిగిస్తోందని ఆయన సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
తమ కుటుంబంలో ఎవరికీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పిన కృష్ణ, "సైన్సే నాకు ఆక్సిజన్, నేను తమిళనాడుకు చెందిన ఓ రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి వ్యాపారంలో అసలేమాత్రం ప్రవేశం లేదు. మా సంస్థకు టీకాల తయారీలో విశేషానుభవం ఉంది. బ్రిటన్‌తో పాటూ మొత్తం 12 దేశాల్లో మేం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం" అని అన్నారు.
ఫైజర్ కంపెనీతో పోల్చుకుంటే తమ టీకా ఏరకంగానూ తక్కువకాదని, కరోనా టీకా తయారీ ప్రక్రియపై ఐదు పరిశోధనా పత్రాలు ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని కూడా ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే, ఇటు భారత్ బయోటెక్, అటు డీసీజీఐ డేటాను మాత్రం వెల్లడించలేదు. ఎంత శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సీన్ పనిచేస్తుందో తెలపలేదు. ఈ వ్యాక్సీన్‌ను రెండు డోసులు తీసుకుంటే 60 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది.
‘‘కేసులు విపరీతంగా పెరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్ కోసం కోవాగ్జిన్ ఉపయోగించాలి. కోవిషీల్డ్ సామర్థ్యంపై మనకు స్పష్టతలేనప్పుడు ఇది బ్యాకప్‌లా ఉపయోగపడుతుంది’’అని దిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు.
‘‘అసలు బ్యాకప్ ఏమిటి? వ్యాక్సీన్‌ను కూడా బ్యాకప్‌లా పెట్టుకుంటే.. దాన్ని ఉపయోగించడం ఎందుకు?’’అని రణ్‌దీప్‌కు సీనియర్ జర్నలిస్టు తవ్లీన్ సింగ్ ట్వీట్‌చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
జాతీయవాదంతో...
కోవాగ్జిన్ తయారీ మొదలైనప్పటి నుంచీ దీన్ని దేశీయ వ్యాక్సీన్‌గా కొందరు చెబుతున్నారు. కోవిషీల్డ్‌ను కూడా భారత్‌లో తయారుచేస్తున్నారు. అయితే దీని రూపకర్తలు మాత్రం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ద్వయమే.
అయితే, ఈ రెండు వ్యాక్సీన్లకు అనుమతి లభించిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ రెండింటికీ అత్యవసర వినియోగం కోసం ఆమోదం తెలిపామని, ఈ రెండింటినీ భారత్‌లోనే తయారుచేస్తున్నారని చెప్పారు. భారత్ స్వావలంబన లక్ష్యం నెరవేరుతోందని వివరించారు.
ఈ వ్యాక్సీన్లు ‘‘మేడిన్ ఇండియా’’అని చెబుతూ.. వీటి పట్ల గర్వంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు.
మరోవైపు రెండు వ్యాక్సీన్లు 110 శాతం సురక్షితమైనవేనని డీసీజీఐ వేణు గోపాల్ జీ సోమాని చెప్పారు.
అత్యవసర అనుమతులు లభించడంతో.. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదట ఈ వ్యాక్సీన్ ఇస్తారు.
ఈ ఏడాది జులై నాటికి 30 కోట్ల మందికి ఈ టీకాలు వేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








