సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నుంచి రియా చక్రవర్తి అరెస్ట్ వరకూ.. ఎప్పుడు ఏం జరిగింది?

సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి

ఫొటో సోర్స్, SARANG GUPTA/HINDUSTAN TIMES/SUJIT JAISWAL/AFP

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి దాదాపు మూడు నెలలు అయ్యింది. ఈ కేసు విచారణలో ఒకవైపు సీబీఐ, మరోవైపు ఈడీ, ఎన్‌సీబీ పలువురిని విచారిస్తున్నాయి.

సుశాంత్ కేసులో ఎప్పుడు ఏం జరిగింది:

జూన్ 14: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబయి బాంద్రాలో ఉన్న తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. ఆయనతో ఆ ఇంట్లో స్నేహితుడు సిద్దార్థ్ పిఠానీ, సహాయకుడు దీపేష్ సావంత్, కుక్ నీరజ్ సింగ్, మరో సిబ్బంది కేశవ్ బచ్నేర్ ఉంటారు.

జూన్ 15: నటి కంగనా రనౌత్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేసి సుశాంత్ మృతికి బాలీవుడ్‌లోని ఒక గ్యాంగ్ కారణమన్నారు. ఆ గ్యాంగ్ బంధుప్రీతిని ప్రోత్సహిస్తోందని అందులో చెప్పారు.

జూన్ 16: ముంబయి పోలీసులు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, రియా చక్రవర్తి, బాలీవుడ్‌లోని చాలామందిని విచారించేందుకు సిద్ధమయ్యారు.

కంగన రనౌత్

ఫొటో సోర్స్, PRODIP GUHA

జూన్ 17: సుశాంత్ మృతి తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి అంశం చర్చనీయంగా మారింది. బిహార్‌లో ఒక న్యాయవాది బాలీవుడ్‌లో 8 మందిపై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ జాబితాలో కరణ్ జోహార్, ఏక్‌తా కపూర్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ సహా మరికొందరి పేర్లున్నాయి.

జూన్ 18: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారణ కోసం పిలిపించారు. రియను విచారణకు పిలవడం అదే మొదటిసారి.

జూన్ 24: సుశాంత్ చివరి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో కారణం ఎస్ఫిక్సియా (ఊపిరి ఆడకపోవడం) అని చెప్పారు. నివేదికలో దానిని సూసైడ్ కేసుగా చెప్పారు.

జూన్ 30: పట్నాలో శేఖర్ సుమన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం తేజస్వి ఒక లేఖ కూడా రాశారు.

జులై 7: డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ వాంగ్మూలం ఇవ్వడానికి బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తను సుశాంత్‌కు నాలుగు సినిమాలు ఆఫర్ చేశానని, కానీ ఏ కారణాల వల్లో ఆయన తన సినిమాలు చేయలేకపోయారని చెప్పాడు.

సుశాంత్, రియా

ఫొటో సోర్స్, Rhea chakraborty

జూలై 9: సుశాంత్ కేసు గురించి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కూడా మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసిన ఆయన ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

జూలై 16: రియా చక్రవర్తి ట్విటర్‌లో హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. హోంమంత్రికి ట్వీట్ చేసిన రియా తనను తాను సుశాంత్ గర్ల్ ఫ్రెండునని చెప్పుకున్నారు. సుశాంత్‌తో తన బంధాన్ని రియా బహిరంగంగా అంగీకరించడం అదే మొదటిసారి.

జూలై 24: సుశాంత్ చివరి సినిమా దిల్ బేచారా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలయ్యింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

జులై 27: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విస్రా రిపోర్ట్ వచ్చింది. ఆయన శరీరంలో ఏదైనా విషం కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆ నివేదిక పేర్కొంది.

జూలై 28: సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా రాజీవ్‌నగర్ పోలీస్ స్టేషన్లో రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియా డబ్బుల లావాదేవీల్లో అవకతవకలు చేసిందని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని ఆరోపణలు చేశారు.

జూలై 29: ఈ కేసును పట్నా నుంచి ముంబయి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఆగస్టు 1: ఈ కేసును ముంబయి పోలీసులతో పాటూ పట్నా పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. బిహార్ పోలీస్ ఐపీఎస్ వినయ్ తివారీ ముంబయి వచ్చినపుడు బీఎంసీ ఆయన్ను క్వారంటీన్ చేసింది. నిబంధనలు పాటించాలని చెప్పింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఆగస్టు 5: ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న బిహార్ ప్రభుత్వం సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఆగస్టు 6: ఈ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. ఏడుగురికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ రియా చక్రవర్తి, రియా తండ్రి ఇంద్రజిత్, తల్లి సంధ్య, సోదరుడు శోవిక్, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, మాజీ మేనేజర్ శ్రుతి మోదీపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఆగస్టు 7: మనీ లాండరింగ్ గురించి ఈడీ రియా చక్రవర్తి, శోవిక్ చక్రవర్తిలను విచారించింది.

ఆగస్టు 13: సోషల్ మీడియా ట్రయల్‌ను అడ్డుకోవాలని కోరుతూ రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ఆగస్టు 31: సీబీఐ రియాను మరోసారి విచారించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సెప్టెంబర్ 4: మాదక ద్రవ్యాల కోణం వెలుగు చూసిన తర్వాత నార్కోటిక్స్ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించింది. ఎన్‌సీబీ శోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరాందాలను రిమాండులోకి తీసుకుంది.

సెప్టెంబర్ 5: ఎన్‌సీబీ సుశాంత్ ఇంట్లో సహాయకుడు దీపేష్ సావంత్‌ను డ్రగ్స్ క్రయవిక్రయాల ఆరోపణలతో అరెస్టు చేసింది.

సెప్టెంబర్ 6: రియా చక్రవర్తిని ఎన్‌సీబీ సుమారు 8 గంటలు విచారించింది. రియా చాలా కీలక సమాచారం బయటపెట్టినట్లు చెబుతున్నారు.

సెప్టెంబర్ 7: కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేసింది.

సెప్టెంబర్ 8: మాదకద్రవ్యాల లావాదేవీల కేసులో ఎన్‌సీబీ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)