జయప్రకాశ్ రెడ్డి: అధ్యాపక వృత్తి నుంచి వచ్చి వెండితెరపై వెలిగిన నటుడు

ఫొటో సోర్స్, facebook/nandamuribalakrishna
తెలుగు సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మంగళవారం ఉదయం గుండెపోటుతో గుంటూరులో మరణించారు. ఆయనకు 74 ఏళ్లు.
జయప్రకాశ్ రెడ్డి 1946లో కర్నూలు జిల్లాలో జన్మించారు. నటనా రంగంలోకి రావడానికి ముందు ఆయన అధ్యాపకుడిగా పని చేశారు. నాటక రంగం నుంచి ఆయన నటనా ప్రస్థానం మొదలైంది.
1988లో బ్రహ్మ పుత్రుడు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆయనకు నటన, కళలంటే స్వతహాగా ఆసక్తి.
ఆ తరువాత అయిదేళ్ల పాటు సినిమా రంగం నుంచి విరామం తీసుకుని మళ్లీ అధ్యాపక వృత్తి చేపట్టి కొన్ని అప్పులు తీర్చుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో జయప్రకాశ్ చెప్పారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన తిరిగి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.
సమరసింహారెడ్డితో మరింత పాపులర్
బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహా రెడ్డి ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత ఆయన పూర్తిగా సినిమా రంగంలో స్థిరపడ్డారు.
'జయం మనదేరా', 'చెన్నకేశవ రెడ్డి' , 'పరుగు' వంటి సినిమాలలో ఆయన విలన్‌గా నటించారు.
“అసలు ఫ్యాక్షనిస్ట్‌లంటూ ఎవరూ ఉండరని.. రాయలసీమ ప్రజలు నీతికి, నిజాయతీకి ప్రాణం ఇస్తారని” జయప్రకాశ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
రాయలసీమ భాషను సినిమాలలో ఉపయోగించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎవరి గోల వారిదే, కిక్, కబడ్డీ వంటి సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
జయప్రకాశ్ రెడ్డి తోబుట్టువులు వివిధ వృత్తులలో అమెరికాలో స్థిరపడ్డారు.

ఫొటో సోర్స్, Twitter/sudhirbabu
ఫ్యాక్షన్‌కు సంబంధించిన పాత్ర అనగానే సినిమా రంగం వారి మదిలో మొదట గుర్తు వచ్చే పేరు జయప్రకాశ్ రెడ్డిదేనని నిర్మాత సురేశ్ కొండేటి అన్నారు.
ఆయనతో తనకున్న అనుబంధం గురించి వివరిస్తూ 15 రోజుల క్రితమే తనకి ఫోన్ చేసి , క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుని షూటింగులు ఎప్పుడు మొదలు కావచ్చని అడిగారని అన్నారు.
జయ ప్రకాష్ రెడ్డి అలెగ్జాండర్ ' సినిమాని ప్రొడ్యూస్ చేశారని, ఆ సినిమాని థియేటర్లో రిలీజ్ చేసేందుకు కూడా తనను సంప్రదించారని చెప్పారు. అయితే, ఆ సినిమా థియేటర్‌లో విడుదల చేయాలనే ఆయన కోరిక తీరలేదని సురేష్ అన్నారు.
ఆయన ఎన్ని సినిమాలు చేసినా కాస్త విరామం దొరికినా ఆ సమయాన్ని నాటక రంగానికే కేటాయించేవారని, ఎక్కడ నాటకోత్సవాలు జరిగినా వెళ్లేవారని బీబీసీకి చెప్పారు.
తనికెళ్ల భరణి లాంటి సినిమా ప్రముఖులు జయ ప్రకాష్ ఎదురుపడినప్పుడు ఓం నమః శివాయ అని పలకరిస్తారని చెబుతారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ జయప్రకాశ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆగస్టు 16 న కరోనా గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వాట్సాప్‌లో తనకు వీడియో పంపినట్లు తెలిపారు.
"సినీరంగంలో విలన్ గా,హస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్దానాన్ని సముపార్జించుకున్నప్పటకీ అత్యంత నిరాడంబరంగా ఉండేవారు. రైల్లో రెండో తరగతిలో సామాన్యుడిలా ప్రయాణం చేసేవారు. రైల్వే ప్లాట్ ఫారంపై సాధారణ వ్యక్తిలా కూర్చునేవారు. సినీరంగంపై కన్నా నాటకరంగంపై మక్కువ ఎక్కువ. నాటక పోటీలకు ప్రేక్షకులలో కనిపించేవారు. వారితో కలసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను" అని బుద్ద ప్రసాద్ అన్నారు.
“అవనిగడ్డతో వారికి ప్రత్యేక అనుబంధం. నాటక రచయిత శ్రీపూసలకు ఆప్తమిత్రుడు. ఇద్దరూ కలసి నాటకాలలో నటించేవారు. పూసల రచించిన ఏకపాత్ర నాటకం అలగ్జాండర్‌ను సినిమాగా తీశారు” అని చెప్పారు.
ఆ సినిమాను వీలైతే మీరు చూసి ఉపరాష్ట్రపతి కి చూపించాలని తనను కోరినట్లు చెప్పారు.
“చలనచిత్ర రంగం,నాటకరంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. ఇటీవల తెలుగుచిత్రాలలో ప్రతినాయకులు ఇతర భాషల వారే కనిపిస్తున్నారు. ఉన్న ఒకే ఒక్కడు మన మధ్యనుంచి వెళ్లిపోయారు. గుంటూరుపై ప్రేమతో అక్కడే స్థిరపడ్డారు. ప్రతి నెల గుంటూరులో నాటకాలు వేయించేవారు”, అని బుద్ద ప్రసాద్ తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/nandamuri balakrishna
ఆయన మరణం పై సినీ రంగ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌లు చేశారు.
‘‘ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను’’ అంటూ నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి కమెడియన్‌ను, నటుడిని కోల్పోయిందని.. ఆయనతో కలిసి పని చేసిన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ఆయన కుటుంబానికి సంతాపం తెలియచేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తాను చివరిసారిగా తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150లో జయప్రకాశ్ రెడ్డితో నటించానని.. ఆయన శని, ఆది వారాల్లో షూటింగులు పెట్టుకునేవారు కాదని.. వారంలో ఆ రెండు రోజులు ఆయన స్టేజ్ పర్ఫార్మెన్సులు ఇచ్చేవారని.. సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయిందని చిరంజీవి ట్వీట్ చేశారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ, హీరోలు వెంకటేశ్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్‌లు ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుుకున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత బండ్ల గణేశ్, హీరోయిన్ ప్రణీత తదితరులు ఆయనతో పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.
జయప్రకాశ్ రెడ్డికి మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని కేసీఆర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తెలుగు సినిమా ఒక రత్నాన్ని కోల్పోయింది. ఆయన నటించిన సినిమాలు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఆయన మృతి పట్ల పలువురు తారలు, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేశారు.
ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు కొరిటెపాడులో మంగళవారం నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








