సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో రియా చక్రవర్తి ఎందుకు విలన్ అయ్యారు? - అభిప్రాయం

ఫొటో సోర్స్, INSTAGRAM
- రచయిత, దివ్యా ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి జీవితాన్ని న్యూస్ చానళ్లు ఈ మధ్య ఒక టీవీ సీరియల్‌లా చూపిస్తున్నాయి.
ఒక్కోసారి అది కుట్రలతో, మంత్ర-తంత్రాలతో మగాడిని వశం చేసుకునే మహిళ కథగా ఉంటే, ఇంకోసారి అది సంతోషంగా, బలంగా ఉండే పురుషుడిని అణగారిన, బలహీనమై వ్యక్తిగా మార్చిన మహిళ కథగా కనిపిస్తుంది.
కథలో కొత్త మలుపులు కూడా వస్తుంటాయి. ముఖ్య పాత్రలు పోషించే వారు వచ్చివెళ్తుంటారు. చాలా లోతైన సత్యం తెలిసినట్లు తమ అభిప్రాయాలను చెబుతుంటారు.
కానీ, ఈ కథ ఒక మహిళ, పురుషుడి మధ్య ఉన్న బంధం గురించి. కానీ, ఇక్కడ పురుషుడు హీరో అయితే, మహిళ విలన్. అది కూడా ఎలాంటి దర్యాప్తూ లేకుండానే. ఇప్పటివరకూ అయితే ప్లాట్ ఇలాగే నడుస్తూ వచ్చింది. ఉంటూ వచ్చింది.
జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో చనిపోయి కనిపించిన తర్వాత, చాలా కాలం పాటు దానికి కారణం బాలీవుడ్‌లో బంధుప్రీతే అన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రశ్నించారు. టీవీ స్టూడియోలో చర్చలు జోరుగా సాగాయి.
కానీ, తర్వాత ఆ సందేహాలన్నీ అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వైపు తిరిగాయి. ఆమెకు డబ్బు ఆశ ఉందన్న కొందరు అత్యాచారం, హత్య కూడా చేస్తామని బెదిరించారు. దీంతో, విసిగిపోయిన రియా దీనిపై ముంబయి పోలీసులకు, సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ఆధిపత్యం చూపించే మహిళలు
కానీ, సుశాంత్ తండ్రి రియా తన కొడుకు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని, డబ్బుల కోసం పీడించిందని, కుటుంబానికి దూరం చేసిందని బీహార్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో, ఆ వదంతులన్నింటికీ ఒక విధంగా ఆమోద ముద్ర వేసినట్టైంది.
దర్యాప్తు జరిగేటపుడు, కోర్టు విచారణ సమయంలో పరిశీలించే అభియోగాలను, అక్కడివరకూ వెళ్లే ముందు ఆరోపణలుగా చెప్పాలి.
కానీ, అలా జరగలేదు. రియా చక్రవర్తిని బిహార్ జేడీయూ నేత మహేశ్వర్ హజారీ ‘విష కన్య’గా వర్ణించారు. “సుశాంత్‌ను ప్రేమలో పడేయడానికి, ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం పంపించారు. తర్వాత, ఆమె అతడిని ఏం చేసిందో మనందరికీ తెలుసు” అన్నారు.

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY INSTA
ఇలాంటి వ్యాఖ్యలతో రియాపైనే కాదు, మొత్తం బెంగాల్ మహిళలపై సోషల్ మీడియాలో విసుర్లు మొదలయ్యాయి. “ఇంగ్లిష్ మాట్లాడే, వివాహేతర సంబంధాలు పెట్టుకోడానికి వెనకాడని, మనసులో మాటను ఓపెన్‌గా చెప్పే బెంగాలీ మహిళలు ఉత్తరభారతంలో మగవాళ్లను నాశనం చేస్తున్నారని” ఆరోపణలు వచ్చాయి.
“బెంగాలీ అమ్మాయిలు ఆధిపత్యం చూపిస్తారు. అబ్బాయిలను ఎలా బుట్టలో పెట్టాలో వాళ్లకు తెలుసు, మొదట వాళ్లు మంత్రాలతో పెద్ద చేపకు ఎరవేస్తారు. తర్వాత వారితో అన్ని పనులూ చేస్తారు” అంటూ రకరకాల ట్వీట్స్ పెట్టారు.
ఇలాంటి వాటిపై కోల్‌కతా పోలీసులకు రిపోర్ట్ కూడా చేశారు. కానీ, బెంగాలీ, మిగతా మహిళలు సోషల్ మీడియాలో అలా పెట్టినవారికి, అదే పద్ధతిలో సమాధానం చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ట్విటర్‌లో రుచికా శర్మ అనే యువతి “భారత్‌లో మహిళలను మంత్రగత్తెలుగా చెబుతూ టైంపాస్ చేసే పద్ధతి పాపులర్ అవుతోంది. ఇలాంటి ఆలోచనలు దశాబ్దాల స్త్రీవాద ఉద్యమాలను మార్చలేకపోయాయి. ఎందుకంటే పురుషులతో మన బంధం, ఇంటి నుంచే ప్రారంభం కావాల్సుంటుంది” అన్నారు.
నటి స్వస్తికా ముఖర్జీ కూడా ట్విటర్‌లో అలాగే స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
“అవును, నాకు రుయీ, బెత్కి అంటే ఇష్టం. తర్వాత వాటిని ఆవనూనెలో ఫ్రై చేసి, వేడి వేడి అన్నంలో, ఎండు మిర్చి లేదా పచ్చిమిర్చితో తింటాను. బెంగాలీ మహిళల్లారా, ఎవరైనా నాతో కలవాలనుకుంటున్నారా” అని ట్వీట్ చేశారు.
నిస్సహాయ పురుషుడు
మంత్ర తంత్రాలు, చేతబడితో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను వశం చేసుకున్నారనే వాదన, ఒక తెలివైన మగాడిని నిస్సహాయుడుగా మార్చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇదంతా, గత ఏడాది జలాలుద్దీన్ రూమీ “లైక్ ది షాడో, అయాం, అండ్ అయాం నాట్ (ఒక నీడలా.. నేను ఉన్నాను, లేను)” అనే వాక్యాలు పోస్ట్ చేసిన అదే సుశాంత్ సింగ్ గురించి చెబుతున్నారు.
నిస్సహాయత అనే ఈ వాదన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుంగుబాటు రోగి అనే దానికి సంబంధించినది. ఈ వాదనపై కూడా చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి. అది వేరే విషయం. ఆయన ఫొటోల్లో విషాద ఛాయలు కూడా కనిపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
“డిప్రెషన్ లుక్.. అంటే ఏంటి? సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి టీవీ కవరేజ్‌లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా మానసిక వైద్య నిపుణులు కూడా ఎందుకు మాట్లాడ్డం లేదు” అని సినీ విశ్లేషకులు అనా వెట్టికాడ్ అన్నారు.
మానసిక వ్యాధి అంటే ఏదైనా వైఫల్యం, ఒక వ్యక్తిగత ఓటమి. మగాడిని బలహీనుడిగా భావించడం సమాజానికి కూడా కష్టమే.
అది కూడా టెలివిజన్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ మీద హీరో పాత్రలు పోషించిన ఒక మగాడు, బాలీవుడ్ బయటి నుంచి వచ్చినప్పటికీ, అక్కడ తన లక్ష్యాన్ని చేరుకున్న ఒక వ్యక్తి బలహీనుడు ఎందుకు అవుతాడు.
కుంగుబాటు లాంటి వ్యాధి మన హీరోకు ఉండడం అసౌకర్యంగానే అనిపిస్తుంది. ఆయనకు ఆ వ్యాధి ఉన్నప్పుడు, దానిని కూడా దుర్వినియోగం చేసుంటారు. అది ఆయన తప్పు కాదు, సుశాంత్‌ను మోసం చేసినవారిదే అవుతుంది. చర్చలో తర్వాత అందరి వేళ్లూ రియా చక్రవర్తిని చూపిస్తాయి.
మహిళల దుస్తులపై వ్యాఖ్యలు
ఒక వీడియోను విడుదల చేసిన రియా, న్యాయవ్యవస్థపై తన నమ్మకం ఉంచారు. మీడియాలో తన గురించి చెబుతున్నవన్నీ తప్పని చెప్పారు.
కానీ, తెల్లటి సల్వార్-కమీజ్‌లో ఆమె విడుదల చేసిన ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యలు కాకుండా, ఆమె వేసుకున్న దుస్తులు పతాక శీర్షికల్లో నిలిచాయని సుశాంత్ తండ్రి తరఫు లాయర్ అన్నారు.
రియా వీడియో ఆమె గురించి చెప్పలేదు, ఆమె బట్టల గురించి చెబుతోంది. ఆమె తన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి బట్టలు వేసుకుని ఉంటుందని నాకు అనిపించడం లేదు. ఆమె తనను తాను ఎంత సాదాసీదా అమ్మాయిని అని చూపించాలనుకుంటోంది” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
దీనిని సీనియర్ లాయర్ కరుణా నంది ‘లీగల్ మిసోజనీ’ అంటే చట్ట పరిధిలో మహిళలను కించపరచడంగా చెప్పారు. “తక్కువ బట్టలు అంటే నేరం, సల్వార్-కమీజ్ అంటే నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు” అని ట్వీట్ చేశారు.
మీడియాలో ప్రచారం చేస్తున్న మానసిక వ్యాధులకు సంబంధించిన అపోహలను దూరం చేసేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ థెరపిస్ట్ ఒక ప్రకటన ఇచ్చారు. “కుంగుబాటును మానసిక వ్యాధి అనుకోడానికి బదులు వ్యక్తి బలహీనతగా భావించడం తప్పు” అన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ‘బైపోలార్ డిజార్డర్’ ఉండేదని కూడా చెబుతున్నారు. అది దాచిపెట్టుకోకుండా, ఇతరులను సాయం కోరేలా రియా అతడిలో ధైర్యం పెంచిందని అంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఈ సీరియల్ అప్పుడే అయిపోలేదు. మీడియా కోర్టులో ప్రతి రోజూ కొత్త సమాచారం అందిస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవారి వ్యాఖ్యలు బయటికి వస్తూనే ఉన్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కారణం ఆత్మహత్యా, లేక అతడిని హత్య చేశారా? ఈ మరణం వెనక ఏదైనా కుట్ర ఉంటే, అది ఎవరు, ఏ లక్ష్యంతో చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే దారిలో రాజకీయం, వ్యక్తిగత స్వార్థం కూడా ఉంది. వీటన్నిటి మధ్యా నిజాన్ని ఎక్కడో అణగదొక్కేశారు.
న్యాయవ్యవస్థ, దర్యాప్తు ఏజెన్సీల కోసం వేచిచూడకుండా స్టింగ్ ఆపరేషన్, సొంత పరిశోధనల ద్వారా ఈ నేరాన్ని నిర్ధరించాలనే మీడియా ఈ తొందరపాటు ప్రాణాంతకం కావచ్చు.
ఒత్తిడి, ఆత్మహత్య మధ్య ఏ బంధం గురించి మనం దీనిని మొదలుపెట్టామో, అదే పరిస్థితిని విలన్ కోసం పరుగులు తీస్తూ సృష్టించకూడదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
బహుశా అందుకే డైరెక్టర్ హన్సల్ మెహతా తన ట్విటర్‌లో ఒక ప్రశ్న అడిగారు. “మీడియా ట్రయల్ వల్ల అలాంటిదే జరిగితే.. దానికి ఎవరు బాధ్యులు?“ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ విమాన ప్రమాదం: 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ భయంతో వణికిపోయారు
- హిరోషిమా, నగాసాకి నగరాలపై అణుబాంబు దాడికి 75 ఏళ్లు.... ఇవే ఆ విధ్వంసకర దృశ్యాలు
- రామజన్మభూమి తరువాత మోదీ లక్ష్యం యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి తేవడమేనా?
- హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు: కనిమొళి ట్వీట్‌తో కలకలం
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- భారత్ - చైనా ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ స్థానం ఏమిటి? ఎవరి వైపు మొగ్గుతుంది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏమిటి.. ఇండియాలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)