చైనా, భారత్: చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా

ఫొటో సోర్స్, NURPHOTO
భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌లలో సరిహద్దు దేశాలు(భూసరిహద్దు పంచుకుంటున్న) పాల్గొనకుండా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
భారత ప్రభుత్వం తన ‘జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలు-2017’లో మార్పులు చేసింది.
ఈ వాణిజ్య నిబంధనల మార్పు వల్ల చైనాపైనే అత్యధిక ప్రభావం పడనుంది. దేశ రక్షణ, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఈ నిబంధనను రూపొందించింది.
‘డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) రిజిస్ట్రేషన్ కమిటీలో నమోదు అయినప్పుడు మాత్రమే, ఆ దేశాల తరఫున బిడ్ వేసేవారు వేలంలో పాల్గొనడానికి వీలుంటుంది.
అంతేకాదు, వారు అందులో పాల్గొనాలంటే భారత విదేశాంగ, హోం శాఖల నుంచి రాజకీయ, భద్రతా అనుమతులు తీసుకోవడం కూడా తప్పనిసరి.
అన్ని రాష్ట్రాలూ తమ కొనుగోళ్లలో ఇదే నిబంధనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రా ప్రభుత్వాలకు సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
కొన్నింటికి మినహాయింపులు
ఈ నిబంధనలో ఆర్థిక శాఖ కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది.
కోవిడ్-19 నియంత్రణకు వినియోగించే వస్తువుల కొనుగోళ్లపై డిసెంబర్ 31 వరకు మినహాయింపులు ఇచ్చింది.
మరోవైపు, భారత్ ఏయే దేశాలకు రుణాలు ఇస్తోందో, అభివృద్ధి కోసం సాయం చేస్తోందో ఆయా దేశాలు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్, నేపాల్, మియన్మార్, భూటాన్‌లకు ఈ వెసులుబాటు కల్పించారు.
చైనా, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్‌తో భారత్ సరిహద్దులను పంచుకుంటోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం చైనా, పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం జరిగేలా కనిపిస్తోంది.
చైనా ఉత్పత్తులు, పెట్టుబడులను పరిమితం చేయడానికి భారత్ ప్రయత్నాలుగా దీనిని చూస్తున్నారు.
ఆన్‌లైన్లో అమ్మే వస్తువులు ఎక్కడ తయారవుతున్నాయో తప్పనిసరిగా చెప్పాలని జూన్ 23న భారత ప్రభుత్వం ఈ-కామర్స్ సంస్థలను ఆదేశించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రభుత్వ కొత్త నిబంధనలపై ప్రశంసలు
భారత ప్రభుత్వ కొత్త వాణిజ్య నిబంధనపై దేశంలో వివిధ వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. దీనిపై గురువారం అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ కూడా చేసింది.
భారత భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది.
దీనిని చైనాకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న మొదటి శిక్షణాత్మక చర్యగా రక్షణ నిపుణులు బ్రహ్మా చెల్లానీ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
“లద్దాఖ్‌లో చైనా కుట్రపూరితంగా చేసిన దాడి తర్వాత భారత్ మొదటిసారి భారీ వాణిజ్య నియంత్రణ చర్యను చేపట్టింది. చైనా తరఫున బిడ్ వేసేవారు భారత్‌లోని రాష్ట్రాల పరిధిలోనూ ఈ కొత్త నిబంధనను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








