విశాఖ గ్యాస్ లీక్ కేసు: రూ. 50 కోట్లు జమ చేయాలన్న ‘గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల్లో జోక్యం చేసుకోం’ - సుప్రీంకోర్టు

విశాఖపట్నం గ్యాస్ లీక్ బాధితులకు సహాయం చేయటానికి రూ. 50 కోట్లు జమ చేయాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎల్‌జీ పాలిమర్స్‌కు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
విశాఖపట్నంలో మే 7వ తేదీన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషయ వాయువు లీక్ అవటంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు.
దీనిపై విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్.. రూ. 50 కోట్లు జమ చేయాలంటూ ఎల్‌జీ పాలిమర్స్‌ను నిర్దేశించింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టస్ బి.శేషశయనారెడ్డి సారథ్యలో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
హరిత ట్రైబ్యునల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం, కేంద్ర ప్రభుత్వాలు పలు కమిటీలు వేయడాన్ని ఎల్‌జీ పాలిమర్స్ సుప్రీంకోర్టులో ప్రశ్నించింది.
ఈ పిటిషన్‌ను జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది.
హరిత ట్రైబ్యునల్ ఆదేశాల్లో తక్షణమే జోక్యం చేసుకోవటానికి నిరాకరించింది. ఈ అంశాలను జూన్ 1వ తేదీన హరిత ట్రైబ్యునల్‌లోనే ప్రస్తావించాలని స్పష్టం చేసింది.
కేసు విచారణను జూన్ 8వ తేదికి వాయిదా వేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మృతుల కుటుంబాలకు పరిహారం అందించాం: ప్రభుత్వం
ఇదిలావుంటే.. విశాఖ వెంకటాపురం ఎల్‌జీ పాలిమర్స్ స్టెర్లిన్ గ్యాస్ బాధితులకు మంగళవారం నాడు మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పరిహారాలు అందజేసనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతిచెందిన 12 మంది కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు నగదునూ అందజేశారు.
ఎల్‌జీ పాలిమర్స్‌ను అనుకుని ఉన్న ఐదు గ్రామాల బాధితులు 19,893 మందికి మొత్తం రూ. 19.82 కోట్ల చెక్కును వారి వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రెండు రోజులు హాస్పిటల్‌లో చికిత్స పొందిన వారికి రూ. 1 లక్ష వంతున 445 మందికి రూ. 4.45 లక్షల కోట్లు ప్రభుత్వం అందజేసింది. అలాగే.. అస్వస్థతకు గురైన 99 మందికి రూ. 25 వేలు చొప్పున ప్రభుత్వం అందజేసింది.
గ్రామంలో చనిపోయిన 25 పాడి పశువుల నిమిత్తం రూ. 8.75 లక్షలు పరిహారం అందజేశారు. గ్యాస్ లీక్ అయిన ఘటనలో సేవలు అందించిన పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బందికి మంత్రి శాలువా కప్పి సన్మానం చేశారు.
గ్యాస్ లీక్ ఘటన మీద విచారణ కమిటీల నివేదికలు రాగానే వాటికి అనుగుణంగా కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పట్టణాభివృద్థి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక మీడియా సమావేశంలో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం గ్యాస్ లీకేజి: ‘‘నాకు పరిహారం వద్దు.. నాకు నా ఇద్దరు పిల్లల్ని, నా భర్తను ఇవ్వండి’’
- విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన
- కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’
- తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం
- కరోనావైరస్: ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనా స్థానాన్ని భారత్ సొంతం చేసుకోగలదా?
- భారత్‌తో సరిహద్దుల్లో పాకిస్తాన్ కంచె ఎందుకు వేయడం లేదు
- కరోనా లాక్డౌన్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – నెదర్లాండ్స్ ప్రభుత్వ మార్గదర్శకాలు
- సైక్లోన్ ఆంఫాన్: పశ్చిమ బెంగాల్, ఒడిశాల మీదకు ముంచుకొస్తున్న పెను తుపాను
- భారత్-నేపాల్ సరిహద్దు: భారత రైతులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు
- లత భగవాన్ ఖరే: భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు
- టిబెట్ పంచెన్ లామా: ఆరేళ్ల బాలుడిని చైనా ఎందుకు మాయం చేసింది.. ఆ బాలుడంటే ఎందుకంత భయం
- మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ: ఆర్థిక జాతీయవాదం ఆచరణ సాధ్యమా? స్వావలంబన ఇంకెంత దూరం?
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









