కరోనావైరస్: కోవిడ్ పరీక్షల ఖర్చును ప్రజలే భరించాలా?

ముంబయిలోని ధారావి ప్రాంతంలో కరోనావైరస్ పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముంబయిలోని ధారావి ప్రాంతంలో కరోనావైరస్ పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

థైరోకేర్ అనే ప్రైవేటు డయాగ్నస్టిక్ లేబోరేటరీ ఈ మధ్యే కోవిడ్-19 పరీక్షలు చేయడం మొదలు పెట్టింది. అయితే, అన్ని పరీక్షలూ ఉచితంగా చేయాలని భారత సుప్రీం కోర్టు ఆదేశించింది.

“ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు పరీక్షల బిల్లు చెల్లిస్తారని, పేదలకు ప్రభుత్వం చెల్లిస్తుందనే విధంగా ఆదేశాలు ఉంటాయని మేం భావించాం” అని థైరోకేర్ వ్యవస్థాపకులు అరోక్య స్వామి వేలుమణి అన్నారు.

కోవిడ్-19 పరీక్ష కోసం రూ. 4,500 ఖర్చుచేయడం అంటే అంత చౌక ఏం కాదు. అయితే, ప్రైవేటు ల్యాబ్‌లు ఆ మొత్తాన్ని తిరిగి ఎలా రీయింబర్స్ చేసుకోవాలన్న విషయంలో కోర్టు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో థైరోకేర్ సహా మరికొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు కూడా పరీక్షల్ని నిలిపివేశాయి.

అయితే, కోవిడ్-19 పరీక్షల్ని వీలైనన్ని ఎక్కువగా చెయ్యాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని కోర్టును కోరింది.

దీంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రజారోగ్య బీమా పథకంలో ఉన్న50 కోట్ల మందికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని, మిగిలిన వాళ్లు సొంతంగా చెల్లించుకోవాలని ఏప్రిల్ 13న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, ఒక వేళ ఉచితం కాకపోతే. భారత్‌లో వీలైనంత ఎక్కువ మందికి కోవిడ్-19 పరీక్ష నిర్వహించడం సాధ్యపడుతుందా..? ఇదే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న.

ఎల్ఎన్‌జేపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూదిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్‌జేపీ) హాస్పిటల్

కొండెక్కిన కోవిడ్-19 పరీక్ష ధర

సుమారు 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఏప్రిల్ 19 నాటికి 15,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 507 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

అయితే చాలా తక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం వల్లే తక్కువ కేసులు నమోదవుతున్నాయన్నది చాలా మంది వాదన. ఏప్రిల్ 19 నాటికి దేశ వ్యాప్తంగా కేవలం 3,86,791 మందికి మాత్రమే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైనంత ఎక్కువమందికి పరీక్షలు నిర్వహించడం సవాలే. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అనుమతులు పొందిన టెస్టింగ్‌ కిట్ల తయారీ కంపెనీలు దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలోనే ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా టెస్టింగ్ కిట్లకు డిమాండ్ ఉండటంతో దిగుమతులు ఆలస్యమవుతున్నాయి. అటు పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సామాగ్రి సరఫరా కూడా తగినంతగా లేదు.

ప్రస్తుతం ఉన్న భారత జనాభాతో పోల్చితే ఉన్న వనరులు దేశం నలుమూల చేరుకోవడం సాధ్యపడుతుందా అన్న విషయం చెప్పడం కూడా కష్టమే.

ఈ పరిస్థితులన్నింటి కారణంగా పరీక్షలు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకుంటోంది. ప్రభుత్వాసుపత్రులలో, ల్యాబొరేటరీలలో ఈ పరీక్షలు ఉచితం. కొన్ని నెలలుగా వాళ్లకు మాత్రమే కోవిడ్-19 పరీక్షలు చేసేందుకు అనుమతిచ్చారు.

అయితే తగిన నిధులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజారోగ్య వ్యవస్థకు సాయం చేసేందుకు ఆ తరువాత ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొచ్చాయి.

దీంతో ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థల నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఇంటివద్దకు వెళ్లి కోవిడ్-19 పరీక్ష నిర్వహిస్తే రూ.4,500, అదే ఆస్పత్రికి వెళ్లి చేయించుకుంటే రూ.3,500గా నిర్ణయించింది.

అయితే ఈ ధరల్ని ఏకపక్షంగా నిర్ణయించారని ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్ వర్క్‌ సంస్థకు చెందిన మాలిని ఐసోలా అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 పరీక్షకు అయ్యే ఖర్చును లెక్కేస్తే సుమారు రూ.700 వరకు ఉండవచ్చని తేలినట్టు ఓ వైరాలజస్ట్ తెలిపారు.

“ ప్రైవేటు సంస్థలు ధరల్ని నిర్ణయించడంలో భాగమైతే.. ప్రభుత్వం దేనికి ఎంత ఖర్చువుతుందన్న వివరాలను విడుదల చేయాలి.” అని డిమాండ్ చేశారు మాలిని.

అయితే ప్రైవేటు ల్యాబ్ యజమానులు మాత్రం ఆ ధర న్యాయమైనదేనని అంటున్నారు. “సరఫరా చేసే వ్యవస్థ సరిగ్గా లేదు. ప్రతి ఒక్కరు ముందస్తు చెల్లింపులు చేస్తేనే పని చేస్తామంటున్నారు.” అని కోర్ డయాగ్నస్టిక్స్ సీఈఓ జొయా బ్రార్ తెలిపారు.

హెచ్ఐవీ, విష జ్వరాలకు విస్తృతంగా వినియోగించే సాధారణ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్ ధర సుమారు రూ.1200. దీంతో పాటు అదనంగా మరో కిట్ వస్తుంది. దాంతో వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల నుంచి జెనెటిక్ కోడ్‌ను సేకరిస్తారని ఆమె తెలిపారు.

“ప్రస్తుతానికి వాటి సరఫరా తక్కువగా ఉంది. ఒక వేళ సరఫరా మెరుగుపడినట్టయితే మాకు రూ.1000కే వస్తుంది. అది ఓ రకంగా మాకు వరం అని చెప్పొచ్చు. వాటితో పాటు పరీక్షలు నిర్వహించే వారికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, ఇవ్వాలి, ఉద్యోగుల జీతాలు, ల్యాబ్ నిర్వహణ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి.” అని జొయా అన్నారు .

“ల్యాబ్‌లలో పని చేసే ఉద్యోగులకు ఎక్కడ వైరస్ సోకుతుందో అన్న భయంతో తక్షణం ఆ పని వదులుకోవాలని కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో మేం వారికి ఎక్కువ జీతాలు ఇచ్చి ఉద్యోగాలకు పిలిపించుకోవాల్సి వస్తోంది.” అని థైరో కేర్ వ్యవస్థాపకులు డాక్టర్ వేలుమణి అన్నారు.

పీపీఈ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్యక్తిగత సంరక్షణ సాధనాలు (పీపీఈ) తయారు చేస్తున్న సీఆర్‌పీఎఫ్ పారామిలటరీ సిబ్బంది

ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తే...

ప్రస్తుతం మన దేశంలో వైద్యులు సూచిస్తేనే పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ ప్రభుత్వాసుపత్రులలో సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి రావడం, ప్రైవేటు ఆస్పత్రులలో ధరలు అధికంగా ఉండటంతో కొందరిలో లక్షణాలు పెరుగుతున్నప్పటికీ పరీక్షలు చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు.

“ఈ మహమ్మారిని అదుపు చెయ్యాలంటే పరీక్షల నిర్వహించడంలో ధరలు నిర్ణయాత్మక పాత్ర పోషించకూడదు.” అని దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులుగా పని చేస్తున్న జయతీ ఘోష్ అభిప్రాయపడ్డారు.

కేవలం పేదలకు మాత్రమే ఉచితంగా పరీక్షలు నిర్వహించినంత మాత్రాన సరిపోదన్నది మరి కొందరు ఆర్థికవేత్తల మాట.

“దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారి సంఖ్య భారీగానే ఉంటుంది. అలాగే ఉపాధి కోల్పోయిన మధ్యతరగతి వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వాళ్లు అంత ఖర్చు పెట్టుకొని తమ కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయించలేరు.” అని ఆర్థికవేత్త వివేక్ దెహిజియా అన్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

వైరస్ లక్షణాలు కనిపించకుండానే కోవిడ్-19 బారిన పడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో మున్ముందు భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం తప్ప భారత్‌కు మరో దారి లేదు.

“మీరు నిజంగా దేశ వ్యాప్తంగా కోవిడ్-19 పరీక్షల సంఖ్యను పెంచాలనుకుంటే అందరూ తమ సొంత జేబుల నుంచే పరీక్షలకు అయ్యే మొత్తాన్ని చెల్లించాలని ఆశించవద్దు. మరీ ముఖ్యంగా వైరస్ లక్షణాలు కనిపించిని వారు కూడా.” అని దిహీజియా అన్నారు.

సింగపూర్, దక్షిణ కొరియా రెండు దేశాల్లోనూ ప్రభుత్వమే తమ సొంత ఖర్చులతో పరీక్షలు నిర్వహిస్తోంది. భారత్‌లో ఉన్నటువంటి పరిస్థితులే ఉన్న వియత్నాంలో ఎక్కువగా వైరస్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ మన దేశంలో మాత్రం ఇంకా పరీక్షలకు అయ్యే ఖర్చుల దగ్గరే ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది.

“వైరస్ ఎవరికి సోకిందన్న విషయం తెలీకుండా దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. కనుక అందరికీ పరీక్షలు నిర్వహించడం అన్నది ప్రభుత్వ బాధ్యత.” అని ప్రోఫెసర్ ఘోష్ అభిప్రాయపడ్డారు.

కోవిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరు చెల్లించాలి?

బీబీసీతో మాట్లాడిన చాలా మంది ఆర్థికవేత్తలు ఇచ్చిన సూచనలు, సలహాల సారాంశం ఒక్కటే... “ఈ విషయంలో ప్రభుత్వం మరింత చేయాల్సి ఉంది.” అని.

“ఇలాంటి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి నుంచి బయట పడేందుకు మీరు కేవలం స్వచ్చంధ సంస్థలపై మాత్రమే నమ్ముకుంటే ప్రయోజనం ఉండదు.” అని దిహిజాయా అభిప్రాయ పడ్డారు.

కానీ భారత్‌లో వైద్య రంగానికి కేటాయించే నిధులు అంతంత మాత్రమే. అదీగాక ఈ దేశంలో వైద్య బీమా అందరికీ తప్పనిసరి కాదు. ఇక చాలా బీమా సంస్థలు కేవలం ఆస్పత్రిలో చేరితేనే ఖర్చును భరిస్తాయి తప్ప వైద్య పరీక్షలకు, మందులకు భరించవు.

ఒక వేళ ప్రైవేటు ఆస్పత్రులను ఈ ప్రక్రియలో భాగం చేస్తే వారి పరీక్షా వ్యూహాలను తమ పరిధిలోకి తెచ్చుకోవడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతుంది.

తాజాగా దేశ వ్యాప్తంగా ఆస్పత్రులను నడుపుతున్న ఓ ప్రముఖ సంస్థ అడ్మిషన్ సమయలోనే కోవిడ్-19 పరీక్ష తప్పని సరి చేసింది. ఇది ప్రస్తుతం ప్రభుత్వ నియమ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం.

కోవిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరికైతే కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయో లేదా అప్పటికే వైరస్‌తో బాధపడుతున్న వారిని కలిసిన వారికి మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలన్నది సర్కారు నిబంధన.

దేశీయ రక్షణ సామాగ్రి, టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వస్తే పరీక్ష ధర మరింత తగ్గుతుందడనంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సరైన ప్రమాణాలతో కూడిన నమూనాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. మరి కొన్ని చోట్ల మొబైల్ సెంటర్లు లేదా కియోస్కులు ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా వీలైనంత తక్కువ రక్షణ సామాగ్రిని ఉపయోగించి ఎక్కువ మందికి పరీక్ష చేసే అవకాశం ఉంటుంది. అలాగే రవాణ ఖర్చులు కూడా తగ్గుతాయి.

ఒకేసారి ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించేందుకు కూడా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఒక వేళ ఈ పరీక్షల్లో నెగిటివ్ వస్తే ఎవ్వరికీ వైరస్ సోకనట్టు లెక్క. పాజిటివ్ వస్తే వాళ్లందరికీ వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

దీన్ని వీలైనంత ప్రభావవంతంగా, చురుగ్గా చేసినంత కాలం కోవిడ్-19 పరీక్ష ఖర్చును నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుందని డాక్టర్ జోయా అన్నారు.

కానీ వెంటనే కోవిడ్-19 పరీక్షల ధరలను అదుపులోకి తీసుకురావడం ఇప్పటికిప్పుడు చెయ్యాల్సిన పని అని ఆమె స్పష్టం చేశారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)