కరోనావైరస్: నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ కేంద్రం ‘హాట్ స్పాట్’ ఎలా అయ్యింది?

నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్

ఫొటో సోర్స్, ADIL ABASS/BARCROFT MEDIA VIA GETTY IMAGES

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తి విషయం బయటపడడంతో దిల్లీలోని నిజాముద్దీన్ పతాకశీర్షికల్లో నిలిచింది. మార్చి నెలలో ఇక్కడ జరిగిన ఒక మతపరమైన కార్యక్రమమే దానికి కారణం.

ఈ కార్యక్రమం జరిగిన ముస్లిం సంస్థ తబ్లీగీ జమాత్ ప్రధాన కార్యాలయం నిజాముద్దీన్‌లో ఉంది. ఈ కార్యక్రమానికి వేలమంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నా, జనం భారీ సంఖ్యలో అక్కడే ఉంటూవచ్చారు.

అయితే, జనతా కర్ఫ్యూ ప్రకటించగానే తమ కార్యక్రమం నిలిపివేశామని, కానీ పూర్తిగా లాక్‌డౌన్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ఉన్న జనం తిరిగి స్వస్థలాలకు వెళ్లలేకపోయారని తబ్లీగీ జమాత్ ఒక మీడియా ప్రకటన విడుదల చేసింది.

దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆ సంస్థలో ఉన్న 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మిగతా వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మొత్తం ప్రాంతాన్ని సీల్ చేశారు

దిల్లీ పోలీసులు నిజాముద్దీన్ మొత్తం ప్రాంతాన్ని సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే జనం భారీసంఖ్యలో అక్కడ గుమిగూడారని చెబుతున్నారు.

“అక్కడ ఇలాంటి కార్యక్రమం జరిగిందనే విషయం మాకు తెలీగానే, లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘించారని మేం వారికి నోటీసులు జారీ చేశాం. అక్కడ ఉన్న చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తీసుకొచ్చాం. అందరికీ పరీక్షలు చేస్తున్నాం అని ఒక సీనియర్ పోలీస్ అధికారి పీటీఐతో చెప్పారు..

అక్కడ ఉన్నవారిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు ఆదివారం రాత్రి సమాచారం అందడంతో దిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు వైద్య బృందాలను తీసుకుని అక్కడికి చేరుకున్నారు.

దిల్లీ పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్నీ సీల్ చేశారు. వారిలో తబ్లీగీ జమాత్ ప్రధాన కేంద్రం కూడా ఉంది. ఈ కేంద్రానికి సమీపంలో నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్, ఆ పక్కనే ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా దర్గా కూడా ఉంది.

అక్కడ ఉన్నవారిని గుర్తించి, వారందరినీ ఆస్పత్రిలో క్వారంటైన్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు.

దిల్లీ ప్రభుత్వం వాదన

తెలంగాణలో కరోనాతో చనిపోయిన ఆరుగురు దిల్లీలోని నిజాముద్దీన్‌లో మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారని అక్కడి ప్రభుత్వం భావించడంతో ఈ మొత్తం ఘటన పతాకశీర్షికల్లో నిలిచింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దిల్లీ ప్రభుత్వం ఈ మొత్తం ఘటనపై చర్చించేందుకు సమావేశమైంది అని ఏఎన్ఐ చెప్పింది.

“తబ్లీగీ జమాత్ హెడ్ క్వార్టర్‌లో ఉంటున్న 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 700 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. 335 మందిని ఆస్పత్రిలో పర్యవేక్షణలో ఉంచారు” అని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఈ మొత్తం ఘటనకు సంబంధించి కార్యక్రమం నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దిల్లీ ప్రభుత్వం సిఫారసు కూడా చేసింది. అది నిర్వహించిన సమయంలో దిల్లీలో ఒక ప్రాంతంలో ఐదుగురికి మించి గుమిగూడకూడదని ఎన్నో సెక్షన్లు అమలు అవుతున్నాయని చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

నిజాముద్దీన్‌లో ఉంటున్న 1500-1700 మందిలో సుమారు 1000 మందిని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడ ఇప్పటికీ ఆరోగ్య శాఖ ఉద్యోగుల పరీక్షలు కొనసాగుతున్నాయి.

నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్

ఫొటో సోర్స్, ADIL ABASS/BARCROFT MEDIA VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్

కేంద్ర ప్రభుత్వ వాదన

“మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రొటోకాల్ ప్రకారం టెస్టింగ్, క్వారంటైన్‌ సౌకర్యం, మిగతా పరీక్షలు నిర్వహిస్తాం” అని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం చెప్పారు.

ఈ కార్యక్రమం నిర్వాహకులపై చట్టప్రకారం దర్యాప్తు కొనసాగుతుందని హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.

నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్

ఫొటో సోర్స్, ADIL ABASS/BARCROFT MEDIA VIA GETTY IMAGES

తబ్లీగీ జమాత్ అంటే

ఇది 1920 నుంచీ నడుస్తున్న ఒక మత సంస్థ. దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. దీనిని ‘మర్కజ్’(కేంద్రం) అని కూడా అంటారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా పనిచేసిన సరేష్‌వాలా ఎన్నో ఏళ్లుగా తబ్లీగీ జమాత్‌లో ఉన్నారు.

“ఇది ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం సంస్థ. దీని సెంటర్లు 140 దేశాల్లో ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

భారత్‌లోని అన్ని పెద్ద నగరాల్లో దీని ‘మర్కజ్’లు ఉన్నాయి. వీటిలో ఏడాది అంతా ఇజ్తెమా జరుగుతుంటుంది. అంటే జనం వస్తూపోతూ ఉంటారు.

కరోనా పాజిటివ్ కేసులు బయపడ్డాయనే వార్తలు వ్యాపించినప్పుడు కూడా అక్కడ ఇజ్తెమా నడుస్తోంది. ఆ సమయంలో ప్రతి రాష్ట్రం నుంచీ వేల సంఖ్యలో జనం వస్తుంటారు. ప్రతి ఇజ్తెమా 3 నుంచి 5 రోజులు నడుస్తుంది.

మార్చి నెలలో కూడా ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి జనం ఇజ్తెమా కోసం వచ్చారు. వారిలో చాలామంది విదేశీయులు కూడా ఉన్నారు. భారత్‌తోపాటు పాకిస్తాన్‌లో కూడా ఇదే సమయంలో ఇజ్తెమా నిర్వహిస్తున్నారు.

అయితే విదేశాల్లో చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగగానే, ఇలాంటి కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించారు. కానీ దిల్లీలో అలా జరగలేదు.

తబ్లీగీ జమాత్ వాదన

తాజా ఘటనల దృష్ట్యా సోమవారం అర్థరాత్రి తబ్లీగీ జమాత్ ఒక మీడియా ప్రకటన జారీ చేసింది. అందులో “మేం ఈ కార్యక్రమం తేదీని ఏడాది ముందే నిర్ణయించాం, ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూ ప్రకటించగానే, మా కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేశాం” అని చెప్పారు.

“కానీ, సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందే కొన్ని రాష్ట్రాలు రైళ్లు, బస్సు సేవలు ఆపేశాయి. ఆ సమయంలో ఎక్కడివారిని అక్కడికి తిరిగి పంపించడానికి తబ్లీగీ జమాత్ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత వెంటనే ప్రధానమంత్రి సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో, చాలామంది తిరిగి వెళ్లలేకపోయారు” అన్నారు.

అప్పుడు అక్కడ ఉన్నవారి సంఖ్య దాదాపు వెయ్యి వరకూ ఉండవచ్చని తబ్లీగీ జమాత్ తమ మీడియా ప్రకటనలో చెప్పింది. ఈ విషయం మార్చి 24న పోలీసులకు చేరింది. దాంతో స్థానిక పోలీసులు మర్కజ్ మూసేయాలని నోటీసులు పంపించారు.

తబ్లీగీ జమాత్ నోటీసుకు అదే రోజు సమాధానం ఇచ్చామని చెప్పింది. అందులో “మా కార్యక్రమం ఆపివేశాం. 1500 మంది తిరిగి వెళ్లిపోయారు, కానీ సుమారు వెయ్యి మంది ఇక్కడే చిక్కుకుపోయారు” అని చెప్పింది. ఆ లేఖ తర్వాత మార్చి 26న ఎస్‌డీఎంతో ఒక మీటింగ్ జరిగింది. తర్వాత రోజు ఆరుగురిని పరీక్షల కోసం తీసుకెళ్లారు.

“తర్వాత మార్చి 28న 33 మందిని పరీక్షల కోసం తీసుకెళ్లారు. మేం అప్పుడు కూడా స్థానిక అధికారులతో అక్కడ ఉన్నవారిని వారి స్వస్థలాలకు పంపించడానికి వాహనాలు ఏర్పాటు చేయాలని అడిగాం. అదే రోజు లాజ్‌పత్ నగర్ ఏసీపీ నుంచి చట్టపరమైన దర్యాప్తు గురించి ఒక నోటీసు కూడా వచ్చింది. ఆ తర్వాత రోజు అంటే మార్చి 29న మేం దానికి సమాధానం ఇచ్చాం” అన్నారు.

మార్చి 30న అంటే సోమవారం ఈ మొత్తం విషయం మీడియాలో వచ్చింది.

తబ్లీగీ జమాత్ విదేశీ సంబంధాలు

ఇదే, తబ్లీగీ జమాత్‌కు చెందిన ఒక కార్యక్రమం మలేసియా, కౌలాలంపూర్‌లోని ఒక మసీదులో కూడా జరిగింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకూ జరిగిన ఆ కార్యక్రమానికి హాజరైన వారే ఆగ్నేయాసియాలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు వ్యాపించేలా చేశారని ఎన్నో మీడియా రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి.

మలేసియాలో బయటపడిన కరోనా పాజిటివ్ కేసుల్లో మూడో వంతు కేసులు తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారివే. బ్రూనైలో బయటపడ్డ మొత్తం 40 కరోనా కేసుల్లో 38 మంది ఇదే మసీదులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారని అల్ జజీరా రిపోర్ట్ చెప్పింది.

ఈ మసీదులో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సింగపూర్, మలేసియా సహా ఎన్నో దేశాల్లో వైరస్ వ్యాపించింది. పాకిస్తాన్ కథనం ప్రకారం తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది ఆ దేశంలో కూడా కరోనా పాజిటివ్‌గా తేలారు.

విదేశాల నుంచి 500 మంది

మర్కజ్‌లో పాల్గొన్న 35 మందికి స్క్రీనింగ్ చేశారు. వీరిలో 27 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. పాకిస్తాన్‌లో కూడా సుమారు 1200 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో 500 మంది విదేశాల నుంచి వచ్చారు అని డాన్ చెప్పింది.

మార్చి 31 వరకూ ఎలాంటి మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదని దిల్లీ ప్రభుత్వం ఈనెల మొదట్లోనే ఆంక్షలు విధించింది. అంతే కాదు, నిరసన ప్రదర్శనల్లో 50 మందికి పైగా జనం గుమిగూడడాన్ని నిషేధించింది.

కరోనావైరస్ వ్యాప్తి ముప్పు దృష్ట్యా ప్రధానమంత్రి మార్చి 25 నుంచి 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. లాక్‌డౌన్ ఉల్లంఘించే వారిపై పోలీసులు డ్రోన్లతో నిఘా పెడుతున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)