కమలం జాతీయ పుష్పమా? పాస్‌పోర్టులపై కమలం ఎందుకు ముద్రిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
పాస్‌పోర్టులపై కమలం చిత్రాన్ని ముద్రించడంపై వివాదం రేగింది. బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఇది దేశాన్ని కాషాయీకరణ చేసే దిశగా బీజేపీ వేసిన అడుగని ఆయన ఆరోపించారు.
అయితే, జాతీయ పుష్పం కావడం వల్లే కమలం చిత్రాన్ని పాస్‌పోర్టులపై ముద్రించామని భారత విదేశాంగశాఖ వివరణ ఇచ్చింది.
మరి, నిజంగా కమలం జాతీయ పుష్పమేనా?
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం పాత్రికేయ సమావేశంలో ఈ అంశం గురించి మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''మెరుగైన భద్రత ప్రమాణాలు పాటించడంలో భాగంగా తీసుకున్న చర్య అది. నకిలీ పాస్‌పోర్టులను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఈ విషయం బయటకు చెప్పకూడదని భావించాం. అయితే, దీనిపై ప్రశ్నలు వస్తుండటంతో చెప్పాల్సి వస్తోంది. ప్రతి నెలా పాస్‌పోర్టుపై గుర్తించే చిత్రాలు మారిపోతాయి. ఈ నెల కమలం ఉంటే, మరో నెల పులి వస్తుంది. ఇంకో రోజు ఇంకొకటి వస్తుంది. జాతీయ పుష్పం, జాతీయ జంతువు ఇలా.. భారత్‌తో ముడిపడి ఉండే చిహ్నాలు వస్తాయి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) మార్గదర్శకాలను అనుసరించి ఇలా ముద్రిస్తున్నాం'' అని ఆయన వివరించారు.
ఈ వివరణలో కమలాన్ని రవీశ్ కుమార్ జాతీయ పుష్పంగా వర్ణించారు.
ఎన్‌సీఆర్‌టీ, యూజీసీ సహా భారత ప్రభుత్వానికి సంబంధించిన ఇతర వెబ్‌సైట్స్‌లోనూ కమలం జాతీయ పుష్పమని ఉంది. పాఠ్య పుస్తకాల్లోనూ ఈ సమాచారాన్ని చేర్చారు.
అయితే, కమలం జాతీయ పుష్పమా, కాదా అన్న విషయంపై పూర్తి స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, knowindia.gov.in
గత జులైలో రాజ్యసభలో బిజూ జనతాదళ్ ఎంపీ ప్రసన్న ఆచార్య కేంద్ర హోంశాఖను ఈ అంశంతో ముడిపడి ఉన్న ప్రశ్నలు అడిగారు. అవి..
భారత్ జాతీయ జంతువు, పక్షి, పుష్పం ఏవి?
దీనికి సంబంధించి ప్రభుత్వం గానీ, మరేదైనా ప్రాధికార సంస్థ గానీ నోటిఫికేషన్ ఇచ్చిందా?
ఒక వేళ ఇచ్చుంటే ఆ వివరాలేవి?
ఒక వేళ నోటిఫికేషన్ లేకుండా ఉంటే, ఏ నిబంధనలను అనుసరించి ఎన్‌సీఈఆర్‌టీ, యూజీసీ, ఇతర భారత ప్రభుత్వ వెబ్‌సైట్లు జాతీయ జంతువు, పక్షి, పుష్పం బొమ్మలను చూపిస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బదులు ఇచ్చారు.
''పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం పులిని జాతీయ జంతువుగా, నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించారు. జాతీయ పుష్పం గురించి మాత్రం నోటిఫికేషన్ ఏదీ లేదు. జాతీయ పుష్పం గురించి సంబంధిత సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నాం. సభలో సమర్పిస్తాం'' అని తెలిపారు.
ఐశ్వర్య పరాశర్ అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ 2017లో 'కమలాన్ని జాతీయ పుష్పంగా ప్రకటించారా?' అని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రశ్నించినట్లు మీడియా కథనాలు వచ్చాయి.
అలా తాము ఎప్పుడూ ప్రకటించలేదని ఆ సంస్థ నుంచి సమాధానం వచ్చినట్లు అవి పేర్కొన్నాయి.
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు
- పాస్‌పోర్టు రంగు మార్చాలనుకోవడం వివక్ష అవుతుందా!
- పాస్‌పోర్ట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- ఇచట పౌరసత్వం, పాస్‌పోర్టులు అమ్మబడును
- మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?
- పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- బోరిస్ జాన్సన్: ఒక జర్నలిస్టు.. బ్రిటన్ ప్రధాని ఎలా అయ్యారు?
- ఐస్ బకెట్ చాలెంజ్ ద్వారా రూ. వందల కోట్లు సమీకరించిన పీట్ ఫ్రేటస్ మృతి
- అత్యాచారాలు, హత్యలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా ఒక కారణమా...
- ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్: ఫోన్ కూడా లేని ఇంటి నుంచి గూగుల్ బాస్‌గా ఎదిగిన చెన్నై కుర్రాడు
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- స్పీడ్ రీడింగ్ కోర్సు: 5 నిమిషాల్లో లక్ష పదాలు చదవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








