పాస్‌పోర్ట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
పాస్‌పోర్ట్ జారీకి సంబంధించి ఇటీవల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
ఒక ముస్లింను మతాంతర వివాహం చేసుకున్న తనకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారంటూ తన్వీ సేఠ్ విదేశాంగశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది.
ఆ తరువాత మంత్రి జోక్యంతో ఆమెకు పాస్‌పోర్ట్ జారీ చేయడంతోపాటు సంబంధిత అధికారిని బదిలీ చేశారు.
ఈ ఘటనతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆ తరువాత విచారణలో కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. చిరునామాకు సంబంధించి తన్వీ సేఠ్ సమర్పించిన పత్రాలు సరిగ్గా లేనట్లు అధికారులు గుర్తించారు.
పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో భాగంగా పోలీసులు చిరునామా విచారణ కోసం లఖ్‌నవూలోని తన్వీ అత్తగారింటికి వెళ్లారు. గత ఏడాది కాలంగా ఆమె అక్కడ నివసిస్తున్నట్లు నిర్ధరించే ఎటువంటి సాక్ష్యాలూ వారికి లభించలేదు. దీనితో ఆమెకు పాస్‌పోర్ట్‌ను నిలిపివేశారు.
పాస్‌పోర్ట్ దరఖాస్తులో ఇచ్చిన చిరునామాలో ఆమె ప్రస్తుతం ఉండటం లేదు. గత ఏడాది కాలంగా ఆమె నోయిడాలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇలా తప్పుడు చిరునామా ఇచ్చినందుకు తన్వీ సేఠ్, ఆమె భర్త సాదియా అనాస్‌లపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

ఫొటో సోర్స్, facebook/tanvi
చిరునామా చాలా ముఖ్యం
పాస్‌పోర్ట్ దరఖాస్తులో చిరునామా ఎంతో ముఖ్యం. పోలీసులు విచారణకు ఆ చిరునామాకే వస్తారు.
జారీ అయిన తర్వాత పాస్‌పోర్ట్ కూడా అక్కడికే పోస్ట్ ద్వారా పంపిస్తారు. తన్వీ సేఠ్ విషయంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యంతో ఆమెకు, ఆమె భర్తకు కార్యాలయంలో పాస్‌పోర్ట్ అందజేశారు.
ఇలా ఎలా ఇస్తారన్నది ప్రశ్న. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారు సంబంధిత చిరునామాలో నివసిస్తున్నారో లేదో పోలీసులు తెలుసుకోవాలి. ఆ తరువాత చిరునామాకు పాస్‌పోర్ట్‌ను పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
పేరు మారితే ఎలా?
మీరు మొదటిసారి పాస్‌పోర్ట్ తీసుకుంటున్నట్టయితే, మీ జనన ధ్రువీకరణపత్రం కాపీ, జనన ధ్రువీకరణ పత్రం, సర్వీస్ రికార్డ్ (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు) కాపీ ఇవ్వొచ్చు. వీటిని స్వీకరిస్తారు.
పెళ్లి తర్వాత పేరు మార్చుకున్నట్టయితే జీవిత భాగస్వామికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కారణాల వల్ల పేరు మార్చుకుంటే అవసరమైన అఫిడవిట్లు, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.
ఇతర సర్టిఫికెట్లు ఏవీ లేనట్టయితే, అఫిడవిట్‌తో పాటు పేరు మార్పుకు సంబంధించిన ప్రకటన అచ్చయిన రెండు దినపత్రికల కాపీలను సమర్పించాలి. లేదంటే ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ కాపీని అందించాలి. అప్పుడే మీ పని సులువవుతుంది.
పాస్‌పోర్ట్‌లు చేయించుకునే వాళ్లకు పుట్టినరోజు విషయంలోనే పెద్ద సమస్య ఎదురయ్యేది. ఇందుకోసం ముందు జనన ధ్రువీకరణ పత్రం కాపీ తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు 7-8 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఇచ్చినా సరిపోతుంది. దాంతో ఈ ప్రక్రియ మరింత సులువైంది.
ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు ఉన్న డాక్యుమెంట్లు ఏవైనా పుట్టినరోజు ధ్రువీకరణకు ఆధారాలుగా స్వీకరిస్తారు.
ఒకవేళ మీ పేరులో చిన్న చిన్న మార్పులేవైనా చేయాల్సి ఉంటే, ఉదాహరణకు ఇంటిపేరులో మార్పు లేదా ఇంటిపేరును చేర్చడం వంటి మార్పులు ఉన్నట్టయితే.. దానికి మళ్లీ పోలీసు పరిశీలన అవసరం లేదు. దానిని చిన్న పొరపాటుగానే పరిగణిస్తారు.
విడాకులు తీసుకున్న మహిళలు మాజీ భర్త పేరు అవసరం లేదు
విడాకులు తీసుకున్నవారు ఇకపై గత పెళ్లి ధ్రువీకరణ పత్రం లేదా విడాకుల పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.
అలాగే విడాకులు తీసుకున్న మహిళలు గతంలో దరఖాస్తులో మాజీ భర్త పేరును రాయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ అవసరం లేదు.
చిరునామా ధ్రువీకరణ కోసం ఇవి ఇవ్వొచ్చు..
- టెలిఫోన్ బిల్లు
- విద్యుత్ బిల్లు
- ఓటరు గుర్తింపు కార్డు
- గ్యాస్ కనెక్షన్
- కంపెనీ లెటర్ హెడ్ ప్రమాణపత్రం
- భాగస్వామి పాస్‌పోర్ట్ కాపీ
- మైనర్ అయితే తల్లిదండ్రుల పాస్‌పోర్ట్ కాపీ
- ఆధార్ కార్డు
- రెంట్ అగ్రిమెంట్
- బ్యాంక్ పాస్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images
పాస్‌పోర్ట్ జారీ ఎప్పుడు మొదలైంది?
మొదటి ప్రపంచయుద్ధానికి ముందు భారతదేశంలో పాస్‌పోర్ట్ జారీ అనేది లేదు. యుద్ధ సమయంలో భారత రక్షణ చట్టం-1915 తీసుకొచ్చారు.
ఈ చట్టం ప్రకారం విదేశాలకు వెళ్లాలన్నా, దేశంలోకి తిరిగి రావలన్నా పాస్‌పోర్ట్ తప్పనిసరి.
ఇవి కూడా చదవండి
- పీరియడ్స్‌లో గుడికి వెళ్తే తప్పేంటి?
- వైరల్: పాకిస్తాన్లో భద్రతపై తీసిన ఈ వీడియో భారత్‌లో హత్యకు కారణమైంది. ఇలా..
- గమ్మున కూసోనీయదు.. కుదురుగా నిలుసోనీయదు!
- బాడీహ్యాకర్లు: సాహసోపేతం, స్ఫూర్తిదాయకం.. భీతావహం
- పాస్‌పోర్టు రంగు మార్చాలనుకోవడం వివక్ష అవుతుందా!
- #లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందడం ఎలా?
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- కృత్రిమ మేధ: చైనాతో పోటీపడాలంటే భారత్‌కు ఉన్న అనుకూలతలివే
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








