#AadhaarFacts: ఏ దేశాల్లో ఎలాంటి గుర్తింపు కార్డులు వాడతారు?

ఫొటో సోర్స్, uidai
రేషన్, వైద్యం, విద్య, లైసెన్స్, బ్యాంక్ ఎకౌంట్, పాస్‌పోర్ట్.. ఇలా భారత్‌లో అనేక సర్వీసులు ఆధార్‌తోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రతి పౌరుడికీ అదో తప్పనిసరి అవసరంలా మారింది.
భారత్‌లోలానే కాదు ఇతర దేశాల్లోనూ ఆధార్‌ను పోలిన బయోమెట్రిక్ ఐడీ కార్డులు పౌరులకు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తుల గుర్తింపును నమోదు చేసేందుకు ఆయా ప్రభుత్వాలు వాటినే ప్రామాణికంగా భావిస్తాయి. అలా వేర్వేరు దేశాల్లోని ఐడీ కార్డులివి.

ఇండొనేసియా
కార్డు పేరు: కార్టు టండా పెండుడుక్
కార్డులో: వేలిముద్రలు, ఫొటో, చిరునామా, విశిష్ట సంఖ్య ఉంటాయి.
ఉపయోగాలు: పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సిమ్, ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, భూమి వివరాలు, ఇతర గుర్తింపు కార్డుల కోసం దీన్ని ఉపయోగిస్తారు.

మలేషియా
కార్డు పేరు: మైకాడ్
కార్డులో: వేలిముద్రలు, సెక్స్ వివరాలు, పౌరసత్వ వివరాలుంటాయి.
ఉపయోగాలు: పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్సిట్ కార్డ్, వైద్య సేవలు.

బొలీవియా
కార్డుపేరు: రిజిస్ట్రో బయోమెట్రికో
కార్డులో: వేలిముద్రలు, చేతి కొలతలు, చెవి కొలతలు, రెటీనా-ఐరిస్ నమూనాలు, స్వర తరంగాలు, డీఎన్‌ఏ వివరాలు, సంతకాలు ఉంటాయి.
ఉపయోగాలు: బొలీవియాలో నివసించే విదేశీయులందరికీ ఈ కార్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

బల్గేరియా
కార్డుపేరు: లిష్నా కార్టా (బల్గేరియన్ ఐడెంటిటీ కార్డ్)
కార్డులో: ఫొటో, విశిష్ట సంఖ్య, పేరు, సెక్స్, పుట్టిన తేదీ, జన్మస్థలం, సంతకం, శాశ్వత చిరునామా, ఎత్తు, కంటి రంగు వివరాలుంటాయి.
ఉపయోగాలు: ప్రతి బల్గేరియావాసీ నిత్యం ఈ కార్డులను తమతో పాటు ఉంచుకోవాలనే నిబంధన ఉంది. అలా లేని పక్షంలో చట్టప్రకారం జరిమానా విధిస్తారు.

చిలీ
కార్డుపేరు: రోల్ యునికో డె ఐడెంటిడాడ్
కార్డులో: పేరు, చిరునామా, విశిష్ట సంఖ్య, వేలి ముద్రలు, ఫేషియల్ రికగ్నిషన్ వివరాలుంటాయి.
ఉపయోగాలు: గుర్తింపు కోసం, వోటింగ్, బ్యాంకు ఖాతాలు, ప్రయాణాలకు సంబంధించిన ధృవీకరణ కోసం దీన్ని ఉపయోగిస్తారు.

భారత్
కార్డుపేరు: ఆధార్ కార్డ్
కార్డులో: పేరు, చిరునామా, విశిష్ట సంఖ్య, వేలిముద్రలు, రెటీనా స్కాన్ వివరాలుంటాయి.
ఉపయోగాలు: అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో గుర్తింపు ధృవీకరణ కోసం దీన్ని ఉపయోగిస్తారు.

మెక్సికో
కార్డుపేరు: పర్సనల్ ఐడెంటిటీ కార్డ్ ఫర్ మైనర్స్
కార్డులో: పేరు, చిరునామా, ఐరిస్ స్కాన్, వేలి ముద్రలు, ఫొటో, సంతకం ఉంటాయి.
ఉపయోగాలు: మైనర్ల విద్య, ఆరోగ్య సేవల కోసం దీన్ని ఉపయోగిస్తారు.

ఉరుగ్వే
కార్డుపేరు: నేషనల్ ఐడీ కార్డ్
కార్డులో: పేరు, పుట్టిన తేదీ, స్వస్థలం, వేలిముద్రలు, ఫొటో ఉంటాయి.
ఉపయోగాలు: బ్యాంకులు, పన్ను విభాగ సేవలు, ప్రభుత్వ, ప్రైవేట్, ఆన్‌లైన్ సేవల కోసం దీన్ని ఉపయోగిస్తారు.
ఇవి కూడా చదవండి
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- #BBCShe విశాఖ: మా డిగ్రీలు కేవలం పెళ్లి కోసమే!
- ఉత్తర కొరియా: రైలులో కిమ్ చైనా యాత్ర... జిన్‌పింగ్‌తో భేటీ
- ’ఆధార్ లీక్ బయటపెట్టిన రిపోర్టర్‌కు అవార్డు ఇవ్వాలి’
- కోబ్రాపోస్ట్: డబ్బులు తీసుకుని హిందుత్వ వార్తలు రాయడానికి 17 మీడియా సంస్థలు సిద్ధం
- మీ ఆధార్‌కి తాళం వేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








