పాస్‌పోర్ట్ వివాదం: సుష్మా స్వరాజ్‌పై 'సోషల్' ఆగ్రహం

ఫొటో సోర్స్, MEAINDIA
ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న హిందూ యువతికి పాస్‌పోర్ట్ ఇచ్చేలా అధికారులను ఆదేశించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హిందూవాదులకు 'లక్ష్యం'గా మారారు.
తాను పోస్‌పోర్ట్ కోసం లఖ్నౌ పాస్‌పోర్ట్ కార్యాలయం వెళ్లగా వికాస్ మిశ్రా అనే అధికారి మతం ఆధారంగా తన పట్ల వివక్ష చూపారంటూ తన్వీ సేఠ్ ట్విటర్‌లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో, మీడియాలో బాగా చర్చ జరిగింది.
లఖ్నౌలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి ఒకరు తమను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని నోయిడాకు చెందిన ఈ జంట ఆరోపించింది.
తనను మతం మార్చుకోవాలని, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఆ అధికారి తనతో అన్నట్టు తన్వీ భర్త అనస్ సిద్దిఖీ మీడియాకు చెప్పారు.
ఆ తర్వాత మంత్రి ఆదేశాలతో తక్షణం చర్యలు తీసుకుంటూ అధికారులు వారికి పాస్‌పోర్టులు మంజూరు చేశారు.
పాస్‌పోర్ట్ కార్యాలయం తమకు పాస్‌పోర్ట్‌లు జారీ చేసిందంటూ సుష్మా స్వరాజ్‌ను ట్యాగ్ చేస్తూ తన్వీ ట్వీట్ చేశారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ ఎదురు కాగూడదని ఆమె తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
"వేరే ఎవరికీ ఇలా జరక్కూడదనే మేం కోరుకుంటున్నాం. మాకు పెళ్లయి 11 ఏళ్లయ్యింది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు. తర్వాత అధికారులు క్షమాపణ అడిగారు. పాస్‌పోర్ట్ జారీ చేశారు" అని తన్వీ సేఠ్ ట్విటర్ ద్వారా తెలిపారు.
మరోవైపు, ఈ వివాదంలో చిక్కుకున్న పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి వికాస్ మిశ్రా తనను తాను సమర్థించుకున్నారు.
"నేను తన్వీ సేఠ్‌తో మ్యారేజ్ సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా సాదియా అనస్ అనే పేరు రాయాలని కోరాను. మేం ఇలాంటి వాటిలో చాలా కచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరూ మారు పేర్లతో పాస్‌పోర్ట్ పొందకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది" అన్నారు.

ఫొటో సోర్స్, BBC/SAMIRATMAJ MISHRA
ఈ ఆరోపణల తర్వాత వికాస్ మిశ్రాను లఖ్నౌ నుంచి గోరఖ్‌పూర్ బదిలీ చేశారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరగిన తర్వాత, కొంతమంది హిందూవాదులు వికాస్ మిశ్రాకు మద్దతుగా పోస్టులు పెట్టారు.
తన్వీ సేఠ్‌కు పాస్‌పోర్ట్ జారీ చేశారు. అయితే ఈ ప్రక్రియలో ప్రశ్నలు తలెత్తడంతో ఆమె పాస్‌పోర్ట్ విషయంలో ముందు ముందు విచారణ జరిగే అవకాశాలున్నాయి.
కాగా, సుష్మా స్వరాజ్ ముస్లింలను బుజ్జగిస్తున్నారంటూ ట్విటర్‌లో కామెంట్లు చేస్తున్నారు. #IsupportVikasMishra అనే హాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.

ఫొటో సోర్స్, @SINGHHSAAHEB
"పాస్‌పోర్ట్ జారీ చేసిన తర్వాత దానిపై విచారణ ఎందుకు, నియమాలు ఉల్లంఘించి ఒక గంటలో పాస్‌పోర్ట్ ఎలా జారీ చేశారు? విచారణ పెండింగ్‌లో ఉండగా వికాస్ మిశ్రా బదిలీ ఆపాలి" అని వరుణ్.వి సుష్మా స్వరాజ్‌ను కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"సుష్మా స్వరాజ్ మేడమ్, నిజంగా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం మంచిదే, మీరు చేసిన మానవతా సాయం కొందరిని ఆకట్టుకుంది. కానీ వాస్తవ విచారణకు ఆదేశించిన ఒక అధికారిని బదిలీ చేయడం తప్పుడు సంకేతాలను ఇస్తుంది" అని ప్రమోద్. డి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"భారత నేతలకు, యూరప్, అమెరికా నేతలకు తేడా ఉంది. వాళ్లు రూల్స్ బుక్ చూస్తుంటే, మన నేతలు మాత్రం చౌకబారు ప్రచారం కోసం సోషల్ మీడియా వైపు చూస్తున్నారని" సుష్మా స్వరాజ్‌ను ట్యాగ్ చేస్తూ మనోజ్ ట్వీట్ చేశారు.
"మీ లౌకికవాదాన్ని నిరూపించుకునే పద్ధతి ఇదేనా మేడమ్, ముస్లిం కాడు కాబట్టి ఒక అధికారిని వేధిస్తారా" అని అని ప్రిన్స్ ఉత్సవ్ సుష్మను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఆమె ఫేస్‌బుక్ పేజ్‌కి సుమారు 30 లక్షల మంది అభిమానులున్నారు. ట్విటర్‌లో ఆమెను 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
సుష్మ ట్విటర్ ద్వారా సామాన్యుల సమస్యలను పరిష్కరిస్తూ పేరు తెచ్చుకున్నారు. చాలా మంది సుష్మను ట్యాగ్ చేస్తూ తమ సమస్యల గురించి రాస్తుంటారు. వాటిపై సుష్మ తరచూ చర్యలు తీసుకుంటూ ఉంటారు.
అందులో భాగంగానే, తన్వీ సేఠ్ తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసినపుడు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సుష్మా స్వరాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఫొటో సోర్స్, FB.COM/SUSHMA SWARAJBJP
ఇప్పుడు ఫేస్‌బుక్‌లో సుష్మా స్వరాజ్ పేజ్‌కు నెగెటివ్ రేటింగ్ ఇస్తున్నారు. దీంతో ఆమె రేటింగ్ వేగంగా తగ్గిపోతోంది.
ఈ వివాదం తర్వాత 20 వేల మందికి పైగా ఆమె ఫేస్‌బుక్ పేజ్‌కు నెగెటివ్ రేటింగ్ ఇచ్చారు. మరి కొంతమంది మాత్రం ఆమెకు పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
"నేను వికాస్ మిశ్రాకు మద్దతిస్తున్నాను కాబట్టి నెగెటివ్ రేటింగ్ ఇస్తున్నా" అని పృథక్ బాతోహీ అనే నెటిజన్ ఫేస్‌బుక్‌లో రాశారు. "సుష్మ ఇస్లామిక్ బుజ్జగింపులు హద్దులు దాటింది" అని అనన్య్ అవినాశ్ అనే ఫేస్‌బుక్ యూజర్ రాశారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
మరోవైపు హీనా ఖాన్ అనే నెటిజన్ సుష్మా స్వరాజ్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. "మన కాలానికి చెందిన ఒక మంచి నేత ఉండదగని పార్టీలో ఉన్నారు" అని ఆమె తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
మరోవైపు, ఈ మొత్తం వివాదం కొనసాగుతుండగానే తన్వీ సేఠ్ తన ట్విటర్ అకౌంట్‌ను ప్రైవేట్ చేసేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








