కాంతార: చాముండి దేవిని రణ్‌వీర్ సింగ్ అవమానించారంటూ వివాదం

రణ్‌వీర్ సింగ్

ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు.

గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకలో 'కాంతార-చాప్టర్ 1'కు సంబంధించి రణ్‌వీర్ సింగ్ చేసిన యాక్షన్, వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

కాంతార చాప్టర్ 1

ఫొటో సోర్స్, X/hombalefilms

రణ్‌వీర్ సింగ్ అసలేమన్నారు?

ఈ వేడుకలో భాగంగా రణ్‌వీర్ సింగ్.. కాంతార-చాప్టర్ 1లో రిషబ్ శెట్టి పర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని పొగడ్తల వర్షం కురిపించారు.

''ఫీమేల్ ఘోస్ట్'' రిషబ్ శరీరంలోకి వచ్చిన సీన్ అద్భుతంగా చేశారంటూ.. ఆ సీన్‌ను ఇమిటేట్ చేశారు.

స్టేజీ మీద ప్రేక్షకుల ముందు కాంతార-చాప్టర్ 1 క్లైమాక్స్ సీన్‌ను రణ్‌వీర్ సింగ్ రీక్రియేట్ చేసిన సమయంలో అక్కడ రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.

''ఇక్కడ ఎవరైనా నన్ను కాంతార 3లో చూడాలనుకుంటున్నారా?.. టెల్ దిస్ , టెల్ హిమ్'' అంటూ రణ్‌వీర్ సింగ్ వ్యాఖ్యానించారు.

అయితే, ఈ సీన్ చాముండి దేవికి ప్రతిరూపమని, కోస్టల్ కర్ణాటకలో పూజలందుకునే ‘పవిత్ర’ చాముండి దేవిని రణ్‌వీర్ సింగ్ అవమానించారని కొందరు ఆగ్రహిస్తున్నారు.

మరో మూడు రోజుల్లో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' సినిమా విడుదల కానుంది. ఈ సమయంలో కాంతార సినిమాలోని సన్నివేశాన్ని ఇమిటేట్ చేయడం చర్చనీయంగా మారింది.

అయితే, ఇలా ఇమిటేట్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న రిషబ్ శెట్టి నవ్వి ఊరుకున్నారు తప్ప, దానిపై పెద్దగా స్పందించలేదు.

కాంతారా చాప్టర్ 1

ఫొటో సోర్స్, X/hombalefilms

సోషల్ మీడియాలో వచ్చిన రియాక్షన్లేంటి?

అయితే, రణ్‌వీర్ సింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌‌గా మారింది.

రణ్‌వీర్ సింగ్ స్టేజీ మీద అలా వ్యవహరించడం సందర్భానికి తగిన విధంగా లేదని చాలామంది సోషల్ మీడియా యూజర్లు పేర్కొన్నారు.

మత, సాంస్కృతిక విశ్వాసాల విషయంలో ప్రజల మనోభావాలు దెబ్బతినేలా రణ్‌వీర్ సింగ్ వ్యవహరించారని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు.

''కాంతారలో చూపించిన చాముండి దేవిని అక్షరాలా రణ్‌వీర్ సింగ్ ఎగతాళి చేశారు. ఈ మూవీ స్టార్లు పవిత్రమైన తుళునాడు దైవారాధన విశ్వాసాలపై ఎలాంటి గౌరవం లేకుండా డబ్బు, పేరు ప్రఖ్యాతి కోసం ఎంత దిగజారుతున్నారు?

సిగ్గు చేటు. రిషబ్ ఈ కామెడీని ఎంజాయ్ చేస్తున్నారా? ''

అని అంటూ ఒక సోషల్ మీడియా యూజర్ రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

''రీసెర్చ్ చేయడం మర్చిపోయినప్పుడు ఏం జరుగుతుంది? రణ్‌వీర్ సింగ్ 'దేవత'ను 'దెయ్యం'గా పిలిచారు, ఆగ్రహం పెల్లుబికింది'' అని మరో యూజర్ కామెంట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

''రణ్‌వీర్ సింగ్ యాక్షన్లు చాలా సిగ్గుచేటుగా, అవమానకరంగా ఉన్నాయి. హాస్యాస్పదమైన రీతిలో ముఖాన్ని పెట్టి దేవతను వెక్కిరించారు'' అని మరో యూజర్ రాసుకొచ్చారు.

‘‘ఇలాంటి ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు.

ఈ బాలీవుడ్ నటులు మన సంస్కృతిని, మన నటులను ఎప్పుడూ కించపరుస్తూనే ఉన్నారు’’ అని ఒక యూజర్ రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

‘‘భక్తి గురించి వారు అర్థం చేసుకోలేనప్పుడు, వారందరూ చేసేది ఈ వెక్కిరింపులే. ఇది చాలా సీరియస్ విషయం. రణ్‌వీర్ సింగ్ క్షమాపణ చెప్పాలి’’ అని మరో యూజర్ డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రణ్‌వీర్ సింగ్

ఫొటో సోర్స్, Stephane Cardinale - Corbis/Corbis via Getty Images

క్షమాపణ చెప్పిన రణ్‌వీర్ సింగ్

ఈ వివాదంపై రణ్‌వీర్ సింగ్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు.

‘సినిమాలో రిషబ్ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. మన దేశంలోని ప్రతి సంస్కృతిని, సంప్రదాయాన్ని, విశ్వాసాన్ని నేనెప్పుడూ గౌరవిస్తుంటా. ఎవరి మనోభావాలనైనా నేను బాధపెట్టుంటే, క్షమాపణ కోరుతున్నా'' అని రాశారు.

రణ్‌వీర్ సింగ్

ఫొటో సోర్స్, Insta/RanveerSingh

రణ్‌వీర్ సింగ్‌పై ఫిర్యాదు

రణ్ వీర్ సింగ్ వ్యాఖ్యలపై హిందూ జనజాగృతి సమితి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

కాంతార చాప్టర్-1లో చూపించిన దైవరూపాన్ని ఫీమేల్ ఘోస్ట్ గా వర్ణించారని, దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాంతార ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1 విడుదల

కాంతార ఎలాంటి అంచ‌నాలు లేకుండా వచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. దానికి 'ప్రీక్వెల్‌'గా కాంతార చాప్ట‌ర్ -1 రిలీజైంది.

కాంతారలో హీరో తండ్రి ఎక్క‌డైతే మాయ‌మ‌వుతాడో అక్క‌డే చాప్టర్ 1 ప్రారంభ‌మైంది.

కాంతార ప్రాంత గొప్ప‌త‌నం, గుళిగ ఉగ్ర‌రూపం, ఈశ్వ‌రుని పూదోట విశిష్ట‌త, గ‌తంలో వ‌రాహ రూపంలోని పంజుర్లి ఈసారి పులి రూపంలో క‌నిపించ‌డం, ఇలా ర‌క‌ర‌కాల ఫాంట‌సీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

భూతకోల

భూతకోల ఆచారం ఏంటి? ఎక్కడ చేస్తారు?

కాంతార సినిమా నేపథ్యంలో భూతకోల ప్రక్రియపై చాలా ఆసక్తి నెలకొంది.

భూత కోల లేదా దైవ కోల ప్రధానంగా తుళునాడు ప్రాంత లేదా తుళు మాట్లాడే ప్రజల ఆచారం.

దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది.

పశ్చిమ కనుమలు, అరేబియా సముద్ర తీర ప్రాంతాలైన కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలతో పాటు కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఇది బాగా కనిపిస్తుంది.

తుళు ప్రజలతో పాటు, కొందరు మలయాళీలు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.

కేరళ తెయ్యం కళారూపానికి భూత కోలతో దగ్గర సంబంధం ఉంది.

కర్ణాటక యక్షగానంపై దీని ప్రభావం ఉంది.

పూర్వీకుల ఆరాధన లేదా ప్రకృతి శక్తుల ఆరాధన లేదా దేవతల ఆరాధన.. ఇలా మూడు రకాలుగానూ దీన్ని చూడాలి.

భూత అనే శబ్దం చాలా మందికి భిన్న అర్థాలు కలిగిస్తున్నా, దైవారాధన అనే పదాన్నే వీరు ఎక్కువగా వాడుతున్నారు.

సాధారణంగా నవంబరు నుంచి మే వరకు భూతకోల జరుగుతుంది.

మంగళూరు ప్రాంత ప్రజల్లో కాంతారపై మిశ్రమ అభిప్రాయం ఉంది. ఆ సినిమా ద్వారా తమ ప్రాంత సంస్కృతి ప్రపంచం అంతా తెలిసినందుకు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో టీవీ షోల్లో, ఇతర స్టేజీలపై భూతకోలను ఒక వేషంలా వేయడం, దానిపై రీల్స్ వంటివి చేయడంపై అక్కడి వారికి అసంతృప్తి ఉంది.

భూతకోల ప్రదర్శన సమయంలో అక్కడ ఉన్న యువతను కాంతార గురించి ప్రశ్నించినప్పుడు, వారి అభిప్రాయం కూడా అదే.. దైవికం కాని వేదికలపై దీన్ని ప్రదర్శించకూడదని గతంలో బీబీసీతో చెప్పారు భూత కోల చేసే దయానంద జి కట్టల్సార్.

''దేశ విదేశాలకు వెళ్లిపోయిన ఈ ప్రాంత వాసులకు తమదైన ప్రక్రియ ఉందని కాంతార ద్వారా తెలిసింది. వారు దీన్ని ఇప్పుడు సొంతం చేసుకుంటున్నారు. అది పాజిటివ్. అయితే, దీన్ని బహిరంగ వేదికలపై ప్రదర్శించకూడదు. ఇదేదో కళారూపమో, డ్రామానో, సినిమానో కాదు. ఇది ఒక దైవారాధన ప్రక్రియ. దానికి కొన్ని పద్ధతులున్నాయి. ఇది ప్రదర్శన కళ కాదు, నిదర్శన కళ'' అని అన్నారు దయానంద.

''పిల్లలు కాలేజీ స్టేజీల మీద దీన్ని చేసి, రీల్స్ తీయడం బాధాకరం. భక్తికీ, ఆసక్తికీ మధ్య తేడా ఉంది. యువత ఆ తేడా తెలుసుకోవాలి. వారిది భక్తి కాదు, ఆసక్తి. కొందరు ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి వస్తుంటారు. కానీ రుషి, నది, దైవం మూలాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. వాటిని అంగీకరించాలి. ఫలితాలను అనుభవించాలి. ఇప్పుడు ఆసక్తితో వచ్చే యువత, భక్తితో వచ్చే వారు వేర్వేరు. కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీయడానికి మాత్రమే వస్తారు'' అని చెప్పారు దయానంద.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)