55 ఏళ్ల కిందటి చిన్నారి మిస్సింగ్ కేసు: సెర్చ్ బృందానికి దొరికిన ఆ ఎముకలు ఎవరివి?

చిన్నారి మిస్సింగ్, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Grimmer family

    • రచయిత, కెల్లీ ఎన్‌జీ

55 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాలో అదృశ్యమైన బ్రిటీష్ చిన్నారి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్న ఓ వలంటీర్ బృందం..ఆ అమ్మాయి తప్పిపోయినట్లు భావిస్తున్న (ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్) ప్రాంతం నిజమైన ప్రాంతం కాదని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.

1970లో చెరిల్ గ్రిమ్మర్ అనే బాలిక తన మూడేళ్ల వయసులో అదృశ్యమవగా అప్పటి నుంచి ఈ కేసు ఓ మిస్టరీగా కొనసాగుతోంది.

కడావర్ డిటెక్షన్ డాగ్స్ సాయంతో చెరిల్ గ్రిమ్మర్ కోసం వెతుకుతున్న ఓ వలంటీర్ బృందానికి.. ఆమె ఆనవాళ్లు ఏమైనా ఆ ప్రాంతంలో కనిపిస్తే.. ఈ కేసులో ఓ ఆశాజనకమైన పరిణామంగా మారుతుందని అధికారులు భావించారు.

అయితే.. అక్కడ ఆ బృందానికి కనిపించిన ఎముకలు ఒక జంతువుకు సంబంధించినవని పోలీసులు బీబీసీకి తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్లు వారు చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి బీబీసీ తెలుగు గతంలో ప్రచురించిన కథానాన్ని ఈలింకు ద్వారా చదవండి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చెరిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అదృశ్యమైన సమయంలో పాపను వెతుకుతున్న బృందం (ఫైల్ ఫోటో )

బ్రిటన్‌లోని బ్రిస్టల్ నుంచి చెరిల్ కుటుంబం ఆస్ట్రేలియా వొల్లాన్ గాంగాలోని ఫెయిరీ మెడావ్ బీచ్‌కి రాగా..1970 జనవరిలో ఆమె అపహరణకు గురైందని అధికారులు అనుమానిస్తూ వచ్చారు.

చెరిల్ అదృశ్యంపై అప్పట్లో ఓ టీనేజీ బాలుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా... బోల్గోవైన్ లోని ఓ అటవీ ప్రాంతంలో గురువారం అన్వేషణ మొదలుపెట్టారు.

చెరిల్ అపహరణ, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెర్క్యురీ అనే కోడ్ నేమ్ తో పిలిచే ఆ అనుమానితుడు 2019లో మరణించాడు.

అప్పటికే 60 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి.. తాను ఏ తప్పూ చేయలేదని చెబుతూ, తన మీద ఉన్న ఆరోపణలను తిరస్కరించారు.

ఆయన మైనర్‌గా ఉన్నప్పుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని జడ్జి తిరస్కరించడంతో ప్రాసిక్యూటర్లు తరువాత ఆయనపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకున్నారు.

చెరిల్ అదృశ్యమైన తర్వాతి నుంచి దశాబ్దాల పాటు అధికారులు అనేక సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.

అయితే... ఆమెకు ఏమైందనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లూ కనుగొనలేదు.

చెరిల్ అపహరణ, మరణంపై ఆరోపణలకు సంబంధించి ఏదైనా సమాచారం ఇచ్చినట్లయితే.. ఒక 10 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 5.8 కోట్లు) రివార్డు ప్రకటించారు.

చెరిల్ అదృశ్యమైనప్పుడు ఆ సమయంలో పోలీసుల విచారణలో తేలిన విషయాలు... అవాస్తవాలని ఆమె సోదరుడు 62 ఏళ్ల రిక్కీ నష్ అన్నారు.

చెరిల్ అదృశ్యమైనప్పుడు నష్ వయసు ఏడేళ్లు. ఫెయిరీ మెడావ్‌లో గదులు మారుతున్న సమయంలో ఆమెను ఆయన చివరిసారి చూశారు.

చెరిల్ తరహాలో అదృశ్యమైన వ్యక్తులకు సంబంధించి న్యూసౌత్ వేల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటుకు ఒక వినతి పత్రం అందింది. ఈ పిటిషన్ పై 10వేల మంది సంతకాలు చేశారు.

దీనిపై పార్లమెంటులోనూ చర్చ జరిగింది. కానీ, ఈ పిటిషన్లపై స్పందనగా అధికారులు విడుదల చేసిన లేఖలో మాత్రం విచారణ ఏజెన్సీ గురించి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)