రామోజీరావు కన్నుమూత, ఆయన ప్రస్థానం ఎలా సాగిందంటే...

ఫొటో సోర్స్, FB/Ramoji Rao
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు.
ఈనెల 5వ తేదీన ఆయన అస్వస్థతకు గురయ్యారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు.
అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారని ఈనాడు వెల్లడించింది.
రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

ఫొటో సోర్స్, FB/RamojiRao
కృష్ణా జిల్లాలో జననం
చెరుకూరి రామోజీరావు, కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న జన్మించారు.
ఆయన తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ. ఆయనకు ఇద్దరు అక్కలు.
ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. తర్వాత ఆయన తన పేరును రామోజీరావుగా మార్చుకున్నారు.
రామోజీరావుపై ఈనాడు సంస్థలు ప్రచురించిన '75 వసంతాల వెలుగు' పుస్తకం ప్రకారం ఆయన 1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరి 1951లో సిక్స్త్ ఫాం (11వ తరగతికి సమానం) వరకు చదివారు.
రామోజీకి చదువు మీద కన్నా కళలు, రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి. ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవారు.
నాటి గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ చదివారు. తర్వాత దీని పేరును అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా మార్చారు.
దిల్లీలో మొదటి ఉద్యోగం
దిల్లీలో రామోజీ తన మొదటి ఉద్యోగం చేశారు. అనంత్ అనే మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు.
విజయవాడ పక్కనున్న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన 1961 ఆగస్టు 19న వివాహం చేసుకున్నారు.
1962 ఆయన హైదరాబాద్‌కు తిరిగివచ్చి అదే ఏడాది అక్టోబర్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను స్థాపించారు.
దిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో 1965లో కిరణ్ యాడ్స్‌ను ప్రారంభించారు.
1967 నుంచి 1969 వరకు ఖమ్మం పట్టణంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు.
1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఫెర్టిలైజర్స్ వ్యాపారాన్ని నిలిపేశారు.

ఫొటో సోర్స్, Twitter/CBN
ఈనాడు-ఈటీవీ
1970 నవంబర్ 23న రమాదేవి ఎండీగా ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్లు దీనికి రమాదేవి నేతృత్వం వహించారు.
1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం చేపట్టారు. 1980 జూన్ 21న అది త్రీస్టార్ హోటల్‌గా ప్రారంభమైంది. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో తార, సితార హోటళ్లను నిర్మించారు.
మిగిలిన అన్ని వ్యాపారాల కంటే రామోజీరావు అనగానే గుర్తొచ్చేది ఆయన పెట్టిన మీడియా సంస్థలే.
రామోజీరావు 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించారు.
అప్పటికే ఉన్న సంప్రదాయ శైలికి భిన్నంగా నడపడంతో ఈనాడు ప్రజల్లోకి వెళ్లింది.
విశాఖపట్నంలో మొదలైన పత్రిక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తెలుగు వారు ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది.
ఏబీసీ గణాంకాల ప్రకారం తెలుగులో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికగా ఈనాడు ఎదిగింది.
సినీ ప్రేమికుల కోసం 1976 అక్టోబర్ 3న సితార అనే సినీ పత్రికను ప్రారంభించారు. తర్వాత 1978లో నెలకో నవలతో చతుర, వివిధ భాషా కథల సమాహారంగా విపుల మాసపత్రికను మొదలుపెట్టారు.
తెలుగువారి వంటింటి రుచుల్ని ప్రపంచానికి చాటుతున్న ప్రియా ఫుడ్స్‌ను 1980 ఫిబ్రవరి 9న ప్రారంభించారు.
అతిథి పాత్రలో మెరిసిన రామోజీ
స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక సినిమాలోనూ అతిథిగా నటించారు.
యు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన ‘మార్పు’ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు.
అతిథి పాత్రలో నటించినప్పటికీ, సినిమా పోస్టర్లపై రామోజీరావు ఫోటోను ప్రచురించారు.
.
ఉషాకిరణ్ మూవీస్, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్
1983 మార్చి 2న ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏర్పాటు చేశారు.
తర్వాత తొలి సినిమా ‘శ్రీవారికి ప్రేమ లేఖ’తో మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ను ప్రారంభించారు.
1995లో ఈటీవీని ప్రారంభించారు. ఆ తరువాత తెలుగులో న్యూస్ చానెళ్ళు, ఇతర భాషల్లో చానెళ్ళు కూడా పెట్టారు. తరువాత పలు చానెళ్ళను నెట్‌వర్క్ 18కి అమ్మేశారు.
రామోజీరావు యజమాని అయినప్పటికీ, ఈనాడు సంపాదకునిగా ఆయన పేరే ఉండేది. 2019 వరకు అలానే కొనసాగింది.
ఈ పత్రిక, గ్రూపు సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయని తీవ్ర విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు.
1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఈనాడు పత్రిక సహకరించిందని, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార మార్పిడి జరిగినప్పుడు చంద్రబాబుకు సహకరించిందని పలువురు సీనియర్ పాత్రికేయులు చెబుతారు.
ఆ క్రమంలోనే వైయస్సార్సీపీ అధ్యక్షులు జగన్‌కి చెందిన సాక్షి పత్రిక రామోజీరావుపై వ్యక్తిగతంగా అనేక కథనాలు ప్రచురించింది. అటు బీజేపీ నాయకత్వంతో రామోజీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి.
స్వయంగా ఎల్‌కే అద్వానీ, అమిత్ షాలు రామోజీ ఇంటికి వెళ్లి కలిసేవారు. రామోజీని వ్యతిరేకించే పార్టీలో కూడా ఆయనకు సన్నిహితులు ఉండేవారు.

ఫొటో సోర్స్, FB/RamojiRao
రామోజీ ఫిలిం సిటీ
1996 హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలిం సిటీ ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే పెద్ద స్టూడియో కాంప్లెక్సుగా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.
అటు బాహుబలి వంటి సినిమాల నిర్మాణం నుంచి, సామాన్యులు టూరిస్టుల్లా చూడటానికి వెళ్లే యాత్రా స్థలంగా ఈ ఫిలిం సిటీ మారిపోయింది.
రామోజీ కూడా తన స్థిర నివాసాన్ని ఫిలిం సిటీలోనే ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1600 ఎకరాల్లో విస్తరించింది ఫిలింసిటీ.

ఫొటో సోర్స్, FB/RamojiRao
మార్గదర్శి వివాదం
భారతదేశంలోని పెద్ద చిట్ ఫండ్ వ్యాపారాల్లో ఒకటైన మార్గదర్శి దాదాపు 10 వేల కోట్ల టర్నోవర్‌తో నడుస్తోన్న సంస్థ.
అయితే ఈ సంస్థ చట్టపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ హోదాలో పలు కేసులు వేశారు.
అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఏప్రిల్‌లో ఈ సంస్థ డిపాజిట్లపై విచారణ జరపాలని సూచిస్తూ హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు.
ఆ విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. డిపాజిట్ల సేకరణ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని ఉండవల్లి ఆరోపణ కాగా, అందరికీ డిపాజిట్లు తిరిగి చెల్లించామని మార్గదర్శి వాదనగా ఉంది.
అయితే వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తరచూ తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోన్న రామోజీపై కక్ష సాధింపుగా కేసు వేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
అయితే తాను ఎంపీగా దిగిపోయినప్పటికీ, కాంగ్రెస్ అధికారంలో లేనప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం నిరంతరం ఆ కేసును కొనసాగిస్తూ వచ్చారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీ సీఐడీ కూడా మార్గదర్శిపై కేసు పెట్టి, రామోజీ రావును విచారించింది.
అన్ని వ్యాపారల కంటే అతి ముఖ్యంగా ఈనాడు, ఈటీవీ సంస్థల ద్వారా తెలుగు ప్రజల నోళ్ళలో నిరంతరం ఉండేవారు రామోజీ రావు.

ఫొటో సోర్స్, Twitter/Modi
రామోజీ మృతి విషాదకరం: నరేంద్ర మోదీ
రామోజీరావు మరణానికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. ఆయన మృతివార్త చాలా విషాదకరమని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘భారత మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు ఆయన. జర్నలిజం, ప్రపంచ సినిమాపై తన ప్రభావాన్ని చూపారు.
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పారు.
ఆయనను గతంలో కలిసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాహుల్ గాంధీ నివాళులు
భారత మీడియా రంగంలో మార్గదర్శిగా నిలిచిన రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు.
జర్నలిజం, సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కథనంలో Facebook అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Facebook కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Facebook ముగిసింది

ఫొటో సోర్స్, TDP
రామోజీరావు మృతి తీరని లోటు: చంద్రబాబు
రామోజీరావు మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
''ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది'' అని చంద్రబాబు అన్నారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించామని, ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పారు. మీడియా రంగంలో ఆయనది ప్రత్యేక శకం అని చంద్రబాబు కొనియాడారు.
ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీరావు సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలి: రేవంత్ రెడ్డి
రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలుగు మీడియా రంగానికి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అని ఆయన పేర్కొన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, FB/YS Jagan
దిగ్భ్రాంతికి గురయ్యా: వైఎస్ జగన్
రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా సేవ చేసిన రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘‘నన్ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు’’: జూనియర్ ఎన్టీఆర్
''రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది'' అని అన్నారు జూనియర్ ఎన్టీఆర్.
‘నిన్ను చూడాలని’ చిత్రంతో తనను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన విషయం ఎప్పటికీ మార్చిపోలేనంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
తెలుగు మీడియాకు తీరని లోటు: జి. కిషన్ రెడ్డి
రామోజీరావు ఇక లేరనే విషయం తీవ్ర విచారాన్ని కలిగిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు.
నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తూ ఎందరి జీవితాల్లో వెలుగు నింపిన ఆయన మరణం తెలుగు మీడియా రంగానికి, టీవీ పరిశ్రమకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
జనసేన పార్టీ సంతాపం
రామోజీరావు మృతికి జనసేన పార్టీ సంతాపం ప్రకటించింది.
ఈనాడు అధినేత, ప్రపంచంలోనే అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాత, పద్మవిభూషణ్ రామోజీ రావు మరణవార్త తీవ్ర బాధాకరమని జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
ఇవి కూడా చదవండి:
- అగ్నిబాణ్: 3డీ ప్రింటర్‌తో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి రాకెట్ ప్రత్యేకత ఏంటి?
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- మియన్మార్: ‘టాటూ ఉందని చర్మం కోసేశారు.. దాహమేస్తుందంటే మూత్రం సీసాలిచ్చారు’
- ‘గాంధీ’ సినిమాకు ముందు ఆయన గురించి ప్రపంచానికి తెలియదా, మోదీ ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














