అమృతా షేర్గిల్ పెయింటింగ్‌కు రూ. 62 కోట్లు... ఇండియన్ ఆర్ట్‌లో ఇదే వరల్డ్ రికార్డ్

ఫొటో సోర్స్, PENGUIN VIKING
భారతీయ సంతతికి చెందిన ప్రముఖ పెయింటర్ అమృతా షేర్గిల్ వేసిన ఒక పెయింటింగ్ ఏకంగా రూ. 62 కోట్లకు అమ్ముడుపోయి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
ఆమె వేసిన ‘ది స్టోరీ టెల్లర్’ అనే పేయింటింగ్‌కు ఈ భారీ మొత్తం లభించింది.
ఒక భారతీయ పేయింటర్ వేసిన చిత్రానికి లభించిన అత్యధిక ధర ఇదే.
సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టేషన్’ పెయింటింగ్ నెలకొల్పిన రికార్డును శనివారం ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్ బద్దలు కొట్టింది. జెస్టేషన్ పెయింటింగ్ రూ. 51.75 కోట్లకు అమ్ముడైంది.
1937లో వేసిన ఈ ఆయిల్ పేయింటింగ్‌ను న్యూదిల్లీలోని ‘ది ఒబెరాయ్ హోటల్’లో వేలం వేశారు. అత్యధిక ధరకు అమ్ముడై ఈ పెయింటింగ్ మరోసారి అమృత షేర్గిల్ పేరును చర్చల్లో నిలిపింది.

ఫొటో సోర్స్, PENGUIN VIKING
అమృతా షేర్గిల్ ఎవరు?
అమృతా షేర్గిల్, హంగేరిలో జన్మించారు. ఆమె హంగేరి దేశ పౌరురాలు. ఆమె బాల్యంలో ఎక్కువ భాగం భారత్‌లోనే గడిపారు.
కళల పట్ల ఆమెకు ఉన్న ఇష్టాన్ని చూసి పెయింటింగ్‌లో శిక్షణ కోసం తల్లిదండ్రులు ఆమెను ప్యారిస్ తీసుకెళ్లారు. ప్యారిస్‌కు వెళ్లినప్పుడు అమృత వయస్సు 16 ఏళ్లు.
తర్వాత అయిదేళ్లు ఆమె ప్యారిస్‌లో గడిపారు. ఆ సమయంలో చిత్రకారులు విన్సెంట్ వాన్ గాగ్, పాల్ గాగ్‌ను ఆమె విపరీతంగా అభిమానించేవారు.
ప్యారిస్‌లో ఉన్న మోనాలిసా చిత్రం ఆమెను చాలా ప్రభావితం చేసింది.
పెళ్లి తర్వాత, భర్తతో కలిసి ఆమె భారతదేశంలో నివసించడం ప్రారంభించారు. ఆమె కేవలం 28 ఏళ్ల వయస్సులో లాహోర్‌లో చనిపోయారు.
అమృతా షేర్గిల్‌ను 20వ శతాబ్దపు ప్రముఖ చిత్రకారుల్లో ఒకరుగా పరిగణిస్తారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల దుస్తులపై స్టాంపులు అంటించి పోస్టులో పార్శిల్...ఎప్పుడు, ఎక్కడ?
- కపిల్ దేవ్ 175: వరల్డ్ కప్ గెలవగలమనే నమ్మకాన్ని భారతజట్టుకు ఇచ్చిన చరిత్రాత్మక ఇన్నింగ్స్
- మెక్సికో పార్లమెంటులో ‘ఏలియన్స్’.. నాసా ఏం చెప్పిందంటే
- 'రష్యా ఒక పవిత్ర యుద్ధం చేస్తోంద'న్న ఉత్తర కొరియా అధ్యక్షుడు... కిమ్, పుతిన్ భేటీతో అమెరికా, దక్షిణ కొరియాలకు చిక్కులు తప్పవా?
- 'నా రొమ్ముల మధ్య ముఖం పెట్టాడు'.. ఆపరేషన్ థియేటర్లలో సీనియర్ల లైంగిక వేధింపులకు బలవుతున్న మహిళా సర్జన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














